Srikanth OTT: ఓటీటీలోకి హీరో శ్రీకాంత్ ఎంట్రీ- లాయర్‌గా అబ్జెక్షన్ మై లార్డ్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Srikanth Objection My Lord OTT Release: హీరో శ్రీకాంత్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన లాయర్‌గా ప్రధాన పాత్రలో నటించిన కోర్టు రూమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పవర్‌ఫుల్ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Published on: Jul 19, 2026, 20:18:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Srikanth OTT Entry With Objection My Lord Streaming Date: తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటీటీ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. వెండితెరపై అలరించిన స్టార్ హీరోలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల యువ హీరో సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు' సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఓటీటీలోకి హీరో శ్రీకాంత్ ఎంట్రీ- లాయర్‌గా అబ్జెక్షన్ మై లార్డ్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి హీరో శ్రీకాంత్ ఎంట్రీ- లాయర్‌గా అబ్జెక్షన్ మై లార్డ్- ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

నాగ చైతన్య ధూత సంచలనం

అలాగే, అక్కినేని నాగ చైతన్య నటించిన ధూత ఓటీటీ సిరీస్ ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సిరీస్ సీక్వెల్ కూడా లైన్‌లో ఉంది. ఈ డిజిటల్ హవాలో తానేమీ వెనకబడలేదని నిరూపిస్తూ సీనియర్ హీరో మేకా శ్రీకాంత్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేశారు.

శ్రీకాంత్ ఓటీటీ ఎంట్రీ

సరికొత్త కోర్టు రూమ్ డ్రామా సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీకి రెడీ అయ్యారు హీరో శ్రీకాంత్. లాయర్‌గా శ్రీకాంత్ పవర్‌ఫుల్ పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పేరు 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord). ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 వేదికగా జులై 31 నుంచి ఈ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

లాయర్ పరశురామ్‌గా శ్రీకాంత్.. కటకటాల వెనుక మంటలు

ఈ సందర్భంగా విడుదల చేసిన అబ్జెక్షన్ మై లార్డ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సిరీస్‌పై అంచనాలను పెంచేసింది. ఈ సిరీస్‌లో శ్రీకాంత్ 'పరశురామ్' అనే లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ కథలోని తీవ్రతను ప్రతిబింబిస్తోంది. కోర్టు బోనులో ఉన్న ఒక వ్యక్తి చుట్టూ మంటలు అంటుకుంటున్నట్లుగా ఉన్న విజువల్స్ సస్పెన్స్‌ను రేకెత్తిస్తున్నాయి.

న్యాయ వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నించేలా?

'ప్రతీ అభ్యంతరమూ వ్యవస్థను సవాల్ చేస్తుంది.. ప్రతీ గొంతుకూ వినబడే అర్హత ఉంది' అని పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఓటీటీ సిరీస్ థీమ్‌ను స్పష్టం చేస్తోంది. సమాజంలోని లోపాలను, న్యాయ వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నించేలా ఈ సిరీస్ సాగనుందని చిత్ర బృందం హింట్ ఇచ్చింది.

భారీ తారాగణం.. సీనియర్ నటుల సందడి

ఈ కోర్టు రూమ్ డ్రామా థ్రిల్లర్‌లో శ్రీకాంత్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సీనియర్ నటి మధుబాల, విలక్షణ నటుడు ముఖేష్ రిషి, సుమన్, షఫీ, అనన్య శర్మ, సిజ్జు మీనన్ లాంటి భారీ తారాగణం ఈ సిరీస్‌లో భాగమయ్యారు.

ముఖేష్ జి దర్శకత్వంలో

ఇంతమంది సీనియర్ నటులు ఒకే స్క్రీన్‌పై కనిపించనుండటంతో సీన్ల మధ్య డ్రామా పీక్స్‌లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రేజీ వెబ్ సిరీస్‌ను దర్శకుడు ముఖేష్ జి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

జీ5 ఓటీటీలో రిలీజ్

థియేటర్లలో కోర్టు రూమ్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. మరి జీ5లో ఓటీటీ రిలీజ్ అవనున్న ఈ లీగల్ థ్రిల్లర్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More