Jana Nayagan Collection: ఫలించని సీఎం క్రేజ్- జన నాయగన్‌కు దారుణమైన కలెక్షన్స్- టాప్ 25లో కూడా లేని దళపతి విజయ్ సినిమా!

Jana Nayagan Box Office Collection Day 1: దళపతి విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం తొలిరోజు ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేక దారుణమైన ఫలితాలు చూసింది. టాప్ 25 ఓపెనింగ్ సినిమాల్లో కూడా జన నాయకుడు లేకపోవడం గమనార్హం.

Published on: Jul 24, 2026, 10:05:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jana Nayagan 1st Day Worldwide Box Office Collection: తమిళనాడు సీఎం, దళపతి విజయ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ వచ్చిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan). సెన్సార్ అడ్డంకులతో దాదాపు ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి నిన్న (జూలై 23) వచ్చింది.

ఫలించని సీఎం క్రేజ్- జన నాయగన్‌కు దారుణమైన కలెక్షన్స్- టాప్ 25లో కూడా లేని దళపతి విజయ్ సినిమా! (Lakshmi )
ఫలించని సీఎం క్రేజ్- జన నాయగన్‌కు దారుణమైన కలెక్షన్స్- టాప్ 25లో కూడా లేని దళపతి విజయ్ సినిమా! (Lakshmi )

చివరి సినిమా కావడంతో

దళపతి విజయ్ పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా మారే ముందు వచ్చిన చివరి సినిమా కావడంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రికార్డు కలెక్షన్లు సాధించలేకపోయింది.

తమిళనాడు వ్యాప్తంగా హౌస్‌ఫుల్ బోర్డులతో బోణీ కొట్టినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. భారత బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ. 41 కోట్ల నెట్ (రూ. 48 కోట్ల గ్రాస్) కలెక్షన్లను మాత్రమే రాబట్టింది జన నాయగన్ సినిమా. తెలుగు, హిందీ రాష్ట్రాల్లో డబ్బింగ్ వెర్షన్లకు ఆశించిన స్థాయి స్పందన రాలేదు.

జన నాయగన్ కలెక్షన్స్

ఈ రెండు భాషల్లో కలిపి కేవలం రూ. 3 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది సినిమా మొత్తం భారతీయ వసూళ్లలో 10 శాతానికంటే తక్కువే కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్‌కు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ప్రమోషన్ల లోపం వల్ల ఇక్కడ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మందగించాయి.

ఓవర్సీస్‌లో పర్వాలేదనిపించిన వసూళ్లు

స్వదేశంలో డల్ అయినప్పటికీ, విదేశాల్లో మాత్రం 'జన నాయగన్' పర్వాలేదనిపించింది. ఉత్తర అమెరికాలో ప్రిమియర్లతో కలిపి తొలిరోజే 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో మరొక 1 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది.

దీంతో ఓవర్సీస్ వ్యాప్తంగా తొలిరోజు మొత్తం 3.2 మిలియన్ డాలర్ల గ్రాస్ అంటే, 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జన నాయగన్ చిత్రం తొలిరోజు రూ. 78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

వంద కోట్ల కలెక్షన్స్ మిస్.. పాత రికార్డులు భద్రం

తొలిరోజే సునాయాసంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించినా, ఆ మార్కును అందుకోవడంలో 'జన నాయకుడు' విఫలమయ్యాడు. భారతీయ సినీ చరిత్రలో టాప్ 25 ఓపెనింగ్స్ సాధించిన సినిమాల జాబితాలో కూడా ఈ చిత్రం చోటు దక్కించుకోలేకపోయింది. విజయ్ గత చిత్రాలైన 'లియో' (రూ. 150 కోట్లు), 'గోట్' (రూ. 99 కోట్లు), 'బీస్ట్' (రూ. 83 కోట్లు) సాధించిన తొలిరోజు వసూళ్ల కంటే ఇది చాలా తక్కువ.

సూపర్‌స్టార్ రజినీకాంత్ 'కూలీ' సాధించిన రూ. 152 కోట్ల వసూళ్లలో సగం మాత్రమే 'జన నాయగన్' దక్కించుకుంది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న 'పెద్ది' (రూ. 117 కోట్లు), 'వార్ 2' (రూ. 79 కోట్లు) సినిమాల తొలిరోజు కలెక్షన్ల కంటే కూడా ఈ సినిమా వెనుకబడటం గమనార్హం.

సీఎం హోదాలో థియేటర్లలోకి విజయ్

హెచ్. వినోథ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నిజానికి జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది. సీబీఎఫ్‌సీ (CBFC) నుంచి సర్టిఫికేట్ రావడంలో ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. ఈ వ్యవధిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) విజయం సాధించడం, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయాయి.

దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయ్ నటించిన ఆఖరి సినిమా విడుదల కావడం ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరేన్ ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More