Jason Sanjay: తండ్రి జన నాయగన్ కోసమే కొడుకు సిగ్మా వాయిదా? తనలోనూ నటుడు ఉన్నాడన్న దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్

Jason Sanjay On Acting And Sigma Delayed: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ త్వరలోనే 'సిగ్మా' చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ తరుణంలో నటనపై తనకున్న ఆసక్తితో పాటు, తండ్రి సినిమాతో క్లాష్ కాకుండా తను తీసుకున్న తాజా నిర్ణయాన్ని పంచుకున్నారు.

Published on: Jul 17, 2026, 11:47:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jason Sanjay On Acting And Sigma Delayed: తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అయితే తండ్రిలా కెమెరా ముందుకు కాకుండా, కెమెరా వెనుక ఉండి కథను నడిపించే డైరెక్టర్‌గా ఆయన పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

తండ్రి జన నాయగన్ కోసమే కొడుకు సిగ్మా వాయిదా? తనలోనూ నటుడు ఉన్నాడన్న దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్
తండ్రి జన నాయగన్ కోసమే కొడుకు సిగ్మా వాయిదా? తనలోనూ నటుడు ఉన్నాడన్న దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'సిగ్మా' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ద్వారా జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జేసన్ సంజయ్ తన సినీ ప్రయాణం, నటనపై ఆసక్తి, తండ్రితో బాక్సాఫీస్ పోటీపై మనసు విప్పి మాట్లాడారు.

ప్రేమమ్ డైరెక్టర్ ఆఫర్ ఎందుకు కాదన్నారంటే?

తను నటుడిగా మారాలని చాలామంది కోరుకున్నట్లు జేసన్ తెలిపారు. 'ప్రేమమ్' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ సైతం జేసన్ వద్దకు ఒక అద్భుతమైన కథతో వచ్చారట. అప్పటికి జేసన్ వయస్సు కేవలం 20 ఏళ్లు. ఆ సమయంలో సినిమా రంగాన్ని తన వృత్తిగా ఎంచుకోవాలనే ఆలోచన లేకపోవడం వల్లనే ఆ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు జేసన్ వివరించారు.

ఆ సినిమా చేయడానికి తగిన వ్యక్తిని ఎంచుకోవాలని అల్ఫోన్స్ పుత్రెన్‌ను కోరినట్లు చెప్పారు. అయినప్పటికీ అంతటి గొప్ప దర్శకుడు తనను సంప్రదించడం గర్వంగా అనిపించిందని సంతోషాన్ని వ్యక్తపరిచారు.

హీరోగా మారుతున్నారని

ఇటీవల విడుదలైన 'సిగ్మా స్టైల్' ప్రమోషనల్ సాంగ్‌లో జేసన్ చిందులు వేయడం చూసి ఆయన హీరోగా మారుతున్నారా అనే ప్రచారం నడిచింది. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇస్తూ, కేవలం సినిమా ప్రమోషన్ కోసం, సరదాగానే ఆ పాటలో కనిపించానని స్పష్టం చేశారు.

"ప్రతి దర్శకుడి లోపల ఒక నటుడు దాగి ఉంటాడు. నాలోనూ ఒక నటుడు ఉన్నాడు. కానీ ప్రస్తుతం నా పూర్తి దృష్టి 'సిగ్మా' సినిమాను విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపైనే ఉంది" అని జేసన్ సంజయ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నటన వైపు అడుగులు వేస్తారా లేదా అనేది ఈ సినిమా విడుదలైన తర్వాతే ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు.

తండ్రి విజయ్ 'జన నాయగన్' సినిమా కోసమే వాయిదా?

సాధారణంగా పెద్ద సినిమాల క్లాష్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మొదట 'సిగ్మా' సినిమాను జూలై 31న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అదే సమయంలో తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా'జన నాయగన్' జూలై 23న థియేటర్లలోకి రానుంది.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో, హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలవుతోంది. థియేటర్ల కొరత తలెత్తకుండా ఉండటానికి, తండ్రి సినిమా విజయానికి మార్గం సుగమం చేస్తూ 'సిగ్మా' విడుదలను ఆగస్టుకు వాయిదా వేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

తెలుగు హీరో కావడం

కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేసిన జేసన్ సంజయ్, టాలెంట్ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో తన తొలి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం బాగా పరిచయమున్న సందీప్ కిషన్ హీరోగా చేస్తుండటంతో ఈ సినిమాపై తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More