Jana Nayagan: సీఎం విజయ్ జన నాయగన్‌కు సెన్సార్ షాక్- ఆ వివాదస్పద డైలాగులపై కత్తెర- ఎక్కడెక్కడ ఎలా?, ఎందుకు మార్చారంటే?
Thalapathy Vijay Jana Nayagan Censor Cuts: తమిళనాడు సీఎం విజయ్ చివరి మూవీ జన నాయగన్ సెన్సార్ ఇబ్బందులను దాటుకుని విడుదలకు సిద్ధమైంది. పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఈ సినిమాలోని పలు కీలక రాజకీయ, మతపరమైన డైలాగులపై సెన్సార్ బోర్డు భారీగా కత్తెర వేసింది. ఆ కత్తెర పడిన డైలాగ్స్, సీన్స్, ఏంటో తెలుసుకుందాం.
Thalapathy Vijay Jana Nayagan Censor Cuts: భారత సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్'. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

భగవంత్ కేసరి రీమేక్?
విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన చివరి సినిమా కావడంతో దీనిపై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చి ఘన విజయం సాధించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే, విడుదలకు ముందే ఈ చిత్రం సెన్సార్ పరంగా పెద్ద చిక్కుల్లో పడింది. దాదాపు ఏడు నెలల పాటు సెన్సార్ సర్టిఫికేట్ కోసం వేచి చూసిన ఈ చిత్రానికి ఎట్టకేలకు కేంద్ర చలనచిత్ర బోర్డు (CBFC) పలు మార్పులు, చేర్పులతో అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రొడక్షన్ హౌస్ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' అధినేత కె. వెంకట నారాయణ సెన్సార్ బోర్డు విధించిన కత్తెరలపై స్పందించారు.
అంబేద్కర్, టీవీకే డైలాగులపై అభ్యంతరాలు
ఈ సినిమాలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న సంభాషణలు, విజయ్ సొంత పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ప్రస్తావనలపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి, టీవీకే పార్టీకి ముడిపెడుతూ రాసిన ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను బోర్డు పూర్తిగా సవరించింది.
"మీరు గనుక అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, ఇక్కడ టీవీకే చట్టం వర్తిస్తుంది" అనే అర్థం వచ్చేలా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఈ డైలాగ్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో మేకర్స్ దానికి మార్పులు చేయాల్సి వచ్చింది. దీనిపై నిర్మాత వెంకట నారాయణ మాట్లాడుతూ.. తాము దేశ చట్టాలను గౌరవిస్తామని, బోర్డు సూచించిన మార్పులన్నింటినీ పూర్తి చేశామని స్పష్టం చేశారు.
"రాజ్యాంగాన్ని పాటించకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో సమాజానికి అర్థమయ్యే రీతిలో సాధారణ భాషలోనే ఆ డైలాగ్ రాశాం. కానీ, అందులో రాజకీయ కోణం ఉందనే కారణంతో బోర్డు మార్పులు కోరింది" అని నిర్మాత వివరించారు.
మతపరమైన పదాలు, జాతీయ జెండా సీన్ల తొలగింపు
రాజకీయ ప్రస్తావనలతో పాటు మతపరమైన భావాలు వ్యక్తమయ్యే కొన్ని పదాలను కూడా సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. జన నాయగన్ సినిమాలో వచ్చే 'భాగవతన్', 'రంగనాథర్', 'ఓమ్' వంటి పదాలను ప్రేక్షకులు వినపడకుండా కట్ చేశారు. కథలో వచ్చే 'ఆపరేషన్ మేలుహా'ను వివరించే క్రమంలో వాడిన 'ఓమ్' అనే పదాన్ని పూర్తిగా తొలగించారు.
వీటితో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రం ఉన్న ఒక పుస్తకం కవర్‌ను కూడా మార్చాల్సిందిగా ఆదేశించారు. అలాగే, సినిమాలో జాతీయ జెండాకు సంబంధించిన ఒక కీలక సన్నివేశాన్ని సైతం సెన్సార్ అధికారులు తొలగించడం గమనార్హం.
20 సెకన్లకు కత్తెర, మరో 10 సెకన్ల విజువల్స్ మార్పు
మొత్తంగా ఈ చిత్రంలో దాదాపు 20 సెకన్ల నిడివి గల సీన్లపై కత్తెర పడగా, మరో 10 సెకన్ల సీన్లను వేరే విజువల్స్‌తో రీప్లేస్ చేశారు. సినిమాలో ఎక్కడైతే 'టీవీకే' పార్టీ పేరు వస్తుందో ఆయా చోట్ల ఆడియోను పూర్తిగా మ్యూట్ చేయడం లేదా మార్చడం చేశారు.
ఇదిలా ఉంటే, ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన గ్లామర్ భామ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. సెన్సార్ కట్స్ ఎలా ఉన్నప్పటికీ, విజయ్ కెరీర్ లోనే ఇది అత్యంత పవర్‌ఫుల్ పొలిటికల్ ఫిల్మ్ కానుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


