Vijay Trisha Dhyan: నేను కూడా సీఎం అవుతా, ఆమె ఏడవాలి.. విజయ్, త్రిషలపై హీరో ధ్యాన్ శ్రీనివాసన్ సెటైర్లు
Dhyan Sreenivasan Satires On Vijay Trisha: హీరో ధ్యాన్ శ్రీనివాసన్ తన తాజా చిత్ర ప్రమోషన్స్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. సహ నటీనటులు నవ్య నాయర్, అజు వర్గీస్‌లను కూడా ఈ సరదా వ్యాఖ్యల్లోకి లాగుతూ ఆయన చేసిన హంగామా వైరల్ అవుతోంది.
Dhyan Sreenivasan Satires On Vijay Trisha: మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌తో, ఇంటర్వ్యూలలో నోటిదురద జోకులతో ప్రేక్షకులను నవ్వించడం హీరో ధ్యాన్ శ్రీనివాసన్‌కు అలవాటే. ఆయన నటించిన 'విజిటర్' (Visitor) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టిస్తున్నాయి.

ధ్యాన్ శ్రీనివాసన్ సెటైర్లు
తమిళనాడు రాజకీయాలు, సినిమా రంగానికి సంబంధించిన కొన్ని సున్నితమైన విషయాల మీద ధ్యాన్ శ్రీనివాసన్‌న్ వేసిన సెటైర్లు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాయి. ఈ ఈవెంట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషల వ్యక్తిగత ప్రయాణాన్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ షేర్ అవుతున్నాయి.
నేను కేరళ సీఎం అవుతా.. విజయ్ దారిలోనే ప్రయాణం!
తనతో పాటు వేదిక పంచుకున్న నటీనటులు నవ్య నాయర్, అజు వర్గీస్‌లను కూడా ఈ ఫన్నీ వ్యవహారంలోకి ధ్యాన్ శ్రీనివాసన్ లాగడం విశేషం. ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో ధ్యాన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. తాను ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా స్టేజ్ షోలు, ప్రకటనలపైనే శ్రద్ధ పెట్టానని తెలిపారు.
ఆస్ట్రేలియాలో ఒక కార్యక్రమం జరుగుతున్న సమయంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, అది చూసి తాను కూడా రాబోయే 15 ఏళ్లలో అదే దారిలో పయనించి కేరళ ముఖ్యమంత్రిని కావాలని డిసైడ్ అయ్యానని జోక్ చేశారు. ఈ క్రమంలో తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్ తనకు ఇచ్చిన విచిత్రమైన సలహాల గురించి కూడా బయటపెట్టారు.
ముందు అమ్మ ప్రెసిడెంట్ అవ్వు
"మొదట నువ్వు 'అమ్మ' (మలయాళ నటీనటుల సంఘం - AMMA) అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాలని, ఆ తర్వాత సమాజ సేవ చేసి జనాన్ని మెప్పించి సీఎం అవ్వొచ్చని అజు నాకు సలహా ఇచ్చాడు. కానీ కొద్దిసేపటికే మళ్లీ ఫోన్ చేసి.. 'అమ్మ' అసోసియేషన్‌లో పెద్ద పెద్ద సమస్యలు నడుస్తున్నాయి, నువ్వు దాని జోలికి వెళ్లొద్దు. నీకు సీఎం కంటే గవర్నర్ పోస్ట్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ అస్సలు పనే ఉండదు' అని మార్చేశాడు" అని ధ్యాన్ నవ్వుతూ వివరించారు.
విజయ్ సార్.. నా స్నేహితుడికి పిచ్చెక్కింది: అజు క్షమాపణలు
ధ్యాన్ వ్యాఖ్యల తర్వాత వేదికపైకి వచ్చిన అజు వర్గీస్.. ఈ తమిళనాడు రాజకీయాల జోకులపై భయపడిపోతూ నవ్వులు పూయించారు. తన ప్రాణ స్నేహితుడి తరఫున నేరుగా విజయ్‌కు క్షమాపణలు చెప్పారు.
"ఒక విషయం అయితే నాకు అర్థమైంది, ఇకపై నేను తమిళనాడులో అడుగుపెట్టలేను. నా స్నేహితుడికి పూర్తిగా పిచ్చెక్కింది. నాది అసహాయత. దయచేసి నన్ను క్షమించండి విజయ్ సార్" అని అజు వర్గీస్ వేదికపైనే వేడుకున్నారు.
ప్రమాణస్వీకారం చేస్తుంటే నవ్య నాయర్ కళ్లలో నీళ్లు!
విజయ్, త్రిషల మధ్య నడిచే చర్చలను బేస్ చేసుకుని ధ్యాన్ శ్రీనివాసన్ వేసిన జోక్ ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. తన పక్కనే ఉన్న హీరోయిన్ నవ్య నాయర్‌ను ఉద్దేశించి ధ్యాన్ శ్రీనివాసన్ క్రేజీ కామెంట్స్ చేశారు.
"మేము చాలా కాలం తర్వాత కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యకు పెళ్లయి ఒక బాబు కూడా ఉన్నాడు. అయినప్పటికీ, నేను కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున.. నవ్య నాయర్ చక్కగా చీర కట్టుకుని, కళ్లలో ఆనందబాష్పాలతో ముందు వరుసలో కూర్చుంటుందని ఆశిస్తున్నాను" అని ధ్యాన్ అనడంతో హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది.
నవ్య నాయర్ కౌంటర్
దీనికి సమాధానంగా నవ్య నాయర్ కూడా స్టేజ్ పైనే గట్టి కౌంటర్ ఇచ్చారు. "నువ్వు అసలు ఆందోళన పడకు ధ్యాన్. నువ్వు అనుకున్నట్లే సీఎం అయిన రోజున.. నేను పచ్చటి అంచు ఉన్న తెల్లటి చీర, మెడలో డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలోనే కూర్చుంటాను. కళ్లలో నీళ్లు పెట్టుకుంటూ నీకు జై కొడతాను. కానీ నా కోసం ముందు వరుసలో సీటు రిజర్వ్ చేస్తావుగా?" అని నవ్య నవ్వుతూ ప్రశ్నించారు.
అంటే, సేమ్ విజయ్ ప్రమాణ స్వీకారం రోజున త్రిష ఎలా రెడీ అయి వచ్చింది, ఎలా రియాక్ట్ అయిందనే విషయాలపై సెటైర్లు, జోకులతో ధ్యాన్ శ్రీనివాసన్, నవ్య నాయర్ నవ్వించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విజయ్-త్రిషల నేపథ్యం ఏంటి?
ధ్యాన్ శ్రీనివాసన్ అంతలా జోక్ చేయడానికి కారణం కొంతకాలంగా కోలీవుడ్‌లో జరిగిన పరిణామాలే. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెళ్లినట్లు ప్రచారం జరగడం, ఆ తర్వాత విజయ్, త్రిషలు ఒక వివాహ వేడుకలో ఒకేలాంటి దుస్తులు ధరించి కనిపించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ప్రమాణ స్వీకారం సమయంలో
వీటన్నింటికీ మించి.. దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో, నటి త్రిష ఆయన తల్లిదండ్రులైన ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభలతో కలిసి ముందు వరుసలోనే కూర్చుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సీన్‌ను దృష్టిలో పెట్టుకునే ధ్యాన్ ఈ వినూత్నమైన పొలిటికల్ జోక్స్ వేసి వార్తల్లో నిలిచారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


