Janhvi Kapoor: అమ్మ వెళ్లిపోయింది, లోకం నన్ను అసహ్యించుకుంది.. ఆ సినిమా తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లా: జాన్వీ కపూర్
Janhvi Kapoor Depression After Dhadak: అతిలోక సుందరి శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్ సినీ రంగప్రవేశం చేశారు. తొలి సినిమా 'ధడక్' ఘనవిజయం సాధించినప్పటికీ, ఆ సమయంలో తను ఎదుర్కొన్న మానసిక వేదనను, డిప్రెషన్‌ను ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకుంటూ జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ సినీ ప్రయాణం ఎంతో విషాదకరమైన పరిస్థితుల్లో మొదలైంది. ఆమె తొలి చిత్రం 'ధడక్' విడుదల కావడానికి కొద్ది నెలల ముందే జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి కన్నుమూశారు. ఆ సమయంలో తను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, ప్రేక్షకుల నుంచి వచ్చిన నెగెటివిటీ తనను ఎలా కుంగదీశాయో తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో జాన్వీ కపూర్ వెల్లడించారు.

డిప్రెషన్‌లోకి వెళ్లా
ధడక్ సినిమా తర్వాత తను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లానని, అందరూ తనను ద్వేషిస్తున్నారని భావించానని జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో జాన్వీ తన సినీ కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
"ధడక్ గురించి ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు.. 'నువ్వు చాలా బాగా నటించావు', 'సినిమా బాగుంది', 'బాగా డబ్బులు సంపాదించావు' అని చెబుతుంటారు. కానీ నా జ్ఞాపకాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. నా పని అయిపోయింది, ఇక ప్యాకప్ అనుకున్నాను. జనం నన్ను అసహ్యించుకుంటున్నారని ఫీలయ్యాను" అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
అమ్మ వెళ్లిపోయాక.. ప్రేక్షకులే సర్వస్వం అనుకున్నా!
తనకు జీవితంలో కావాల్సిన ప్రోత్సాహం, ప్రశంసలు అన్నీ అమ్మ దగ్గర నుంచే అందేవని జాన్వీ తెలిపింది. "అమ్మ దూరం కావడంతో.. ఆ ప్రేమను, గుర్తింపును ప్రేక్షకుల నుంచి ఆశించాను. అందరూ నన్ను ఆదరిస్తారని అనుకున్నాను, కానీ అలా జరగలేదు. కేవలం నెగెటివిటీ మీద మాత్రమే దృష్టి పెట్టాను" అని జాన్వీ కపూర్ పేర్కొంది.
"నిజానికి 'సయ్యారా' సినిమా వచ్చే వరకు నూతన నటీనటులతో చేసిన సినిమాల్లో 'ధడక్' అతిపెద్ద కమర్షియల్ హిట్. కానీ, ఆ విషయం నా బుర్రలోకి వెళ్లలేదు. నేను నటనలో పనికిరాను, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు అనే భావనే నా వాస్తవంగా మారిపోయింది" అని జాన్వీ కపూర్ వివరించింది.
నాపై 'వారసురాలు' అన్న ముద్ర వేశారు..
గతంలో మరో ఇంటర్వ్యూలో కూడా జాన్వీ కపూర్ తనపై వస్తున్న విమర్శల గురించి స్పందించారు. "ధడక్, గుంజన్ సక్సేనా సినిమాల సమయంలో.. నా తల్లిదండ్రుల వల్ల నాకు అవకాశాలు వస్తున్నాయని, నేను వాటికి అనర్హురాలిని అని చాలామంది అన్నారు. నేను దేనికీ పనికిరానని నన్ను ఫీలయ్యేలా చేశారు. కానీ నాకు నటన అంటే ప్రాణం. నా తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవంతోనే నాకు ఆ ప్రేమ, అవకాశాలు వస్తున్నాయని నాకు తెలుసు. కానీ నేను నటిగా నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాను" అని తన మనసులోని మాటను బయటపెట్టింది జాన్వీ.
జాన్వీ కపూర్ సినిమాలు
శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో వచ్చిన 'ధడక్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 110.11 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ తర్వాత జాన్వీ 'గుంజన్ సక్సేనా', 'రూహీ', 'గుడ్ లక్కీ జెర్రీ' వంటి విభిన్న చిత్రాల్లో నటించి మెప్పించింది.
మరోసారి తెలుగులో
ఇక రీసెంట్‌గా వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా, దేవర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మరోసారి పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ది ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


