Janhvi Kapoor: మద్యానికి బానిస అవ్వడమంటే నైతిక విలువలు లేకపోవడం కాదు.. ఆఫ్ ది రాక్స్‌లో జాన్వీ కపూర్ కామెంట్స్

Janhvi Kapoor About Drinking Addiction: మద్యం అలవాటు ఎప్పుడు వ్యసనంగా మారుతుందో ఎవరికీ తెలియడం లేదని హీరోయిన్ జాన్వీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సామాజిక వివక్షను వీడి, వైద్యపరమైన అవగాహన పెంచుకోవాలని జాన్వీ కపూర్ పిలుపునిచ్చారు.

Published on: Apr 5, 2026, 12:20:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి జాన్వీ కపూర్ ఇటీవల మద్యం వ్యసనం (Alcohol Addiction), దాని చుట్టూ ఉన్న సామాజిక అపోహలపై మాట్లాడింది. సమాజంలో మద్యాన్ని ఒక సాధారణ అలవాటుగా చూస్తున్నారని, అయితే అది ఎప్పుడు క్లినికల్ సమస్యగా మారుతుందో గుర్తించడంలో ప్రజలు విఫలమవుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. 'ఆఫ్ ది రాక్స్' (Off The Rocks) అనే అవగాహన కార్యక్రమ ప్రారంభోత్సవంలో జాన్వీ కపూర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మద్యానికి బానిస అవ్వడమంటే నైతిక విలువలు లేకపోవడం కాదు.. ఆఫ్ ది రాక్స్‌లో జాన్వీ కపూర్ కామెంట్స్
మద్యానికి బానిస అవ్వడమంటే నైతిక విలువలు లేకపోవడం కాదు.. ఆఫ్ ది రాక్స్‌లో జాన్వీ కపూర్ కామెంట్స్

నిశ్శబ్దం వద్దు.. నిందలు అంతకన్నా వద్దు!

మద్యం అలవాటు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సమాజం రెండు రకాలుగా స్పందిస్తుందని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. "మద్యం గురించి చర్చ అసలు ఉండదు, ఒకవేళ ఉన్నా అది ఎదుటివారిని తక్కువ చేసి చూపేలా (Judgmental) ఉంటుంది. ఈ రెండు పద్ధతులు కూడా వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారికి ఏమాత్రం సాయపడవు" అని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.

మద్యం వ్యసనం అనేది ఒక వాస్తవం అని, అది అన్ని వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపుతుందని జాన్వీ కపూర్ వివరించారు. "మద్యానికి బానిసవ్వడం అనేది నైతిక విలువలు లేకపోవడం కాదు. అది ఒక అనారోగ్యం, చికిత్స అవసరమైన మానసిక ఆరోగ్య సమస్య. దీనిపై అవగాహన పెంచడమే మా ఈ ప్రయత్నం" అని జాన్వీ కపూర్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం జాన్వీ కపూర్ 'అమహా' (Amaha) అనే మానసిక ఆరోగ్య సంస్థతో చేతులు కలిపారు.

వరుస సినిమాలతో బిజీబిజీ..

ఇదిలా ఉంటే, వృత్తిపరంగా చూస్తే, జాన్వీ కపూర్ ఇటీవల వరుణ్ ధావన్‌తో కలిసి 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' చిత్రంలో నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం సుమారు రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా ఓటీటీ ట్రెండింగ్‌లో కూడా ఈ మూవీ ఉంటోంది.

పెద్ది సినిమాతో మరోసారి

ఇంతేకాకుండా జాన్వీ కపూర్ మరోసారి తెలుగులో నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' (Peddi) చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.

డాక్టర్ అమిత్ మాలిక్‌తో జాన్వీ కపూర్
డాక్టర్ అమిత్ మాలిక్‌తో జాన్వీ కపూర్
  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More