Peddi Release Date: పెద్ది కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పిన నిర్మాత ఎస్కేఎన్.. తమ సినిమా వాయిదా వేసుకుంటున్నామంటూ..

Peddi Release Date: పెద్ది కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పాడు నిర్మాత ఎస్కేఎన్. తన సినిమా చెన్నై లవ్ స్టోరీ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో అనుకోకుండా రామ్ చరణ్ సినిమా రిలీజ్ డేట్ ను రివీల్ చేశాడు. దీంతో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు.

Published on: Mar 30, 2026, 21:35:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది రిలీజ్ డేట్ గురించి మెగా అభిమానులు ఎప్పటినుంచో చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ ఎండింగ్‌లో ఈ సినిమా వస్తుందని ముందుగా అనుకున్నా, ఇప్పుడు దీని రిలీజ్ డేట్ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ విషయం పెద్ది సినిమా మేకర్స్ నుంచి కాకుండా.. వేరే సినిమా ఫంక్షన్‌లో సడెన్‌గా లీక్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

Peddi Release Date: పెద్ది కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పిన నిర్మాత ఎస్కేఎన్.. తమ సినిమా వాయిదా వేసుకుంటున్నామంటూ..
Peddi Release Date: పెద్ది కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పిన నిర్మాత ఎస్కేఎన్.. తమ సినిమా వాయిదా వేసుకుంటున్నామంటూ..

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అసలేం జరిగిందంటే..

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్న లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంట్ సోమవారం (మార్చి 30) అల్లు సినిమాస్ లో చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ గురించి ఒక పెద్ద న్యూస్ రివీల్ చేశాడు. డైరెక్టర్ సాయి రాజేష్ ద్వారా తనకు ఇప్పుడే ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ తెలిసిందని, పెద్ది సినిమా జూన్ 26న థియేటర్లలోకి రాబోతోందని అతడు వేదిక మీదే చెప్పేశాడు.

వేరే తేదీలు చూస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' టీమ్..

నిజానికి తమ చెన్నై లవ్ స్టోరీ సినిమాను కూడా అదే డేట్‌కు, అంటే జూన్ 26న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నామని ఎస్కేఎన్ చెప్పాడు. కానీ ఇప్పుడు అదే రోజున రామ్ చరణ్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా వస్తుండటంతో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి క్లాష్ లేకుండా తాము వెనక్కి తగ్గుతున్నట్లు ఎస్కేఎన్ స్పష్టం చేశాడు. తమ సినిమాను రిలీజ్ చేయడానికి ఇప్పుడు వేరే తేదీల కోసం చూస్తున్నామని అతడు క్లారిటీ ఇచ్చాడు.

పెద్ది ఆ రోజేనా?

ఇండస్ట్రీలో వినిపిస్తున్న కొన్ని పుకార్ల ప్రకారం చూసుకుంటే.. పెద్ది సినిమా జూన్ 25న కూడా రావొచ్చని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఎస్కేఎన్ మాత్రం జూన్ 26వ తేదీని కొత్త రిలీజ్ డేట్‌గా మెన్షన్ చేశాడు. ఏదేమైనా ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ సినిమా జూన్ లాస్ట్ వీక్‌లో థియేటర్లలోకి రావడం దాదాపుగా ఖాయమైపోయినట్లే అని అర్థమవుతోంది. ఈ వాయిదాకు సంబంధించి త్వరలోనే నిర్మాణ సంస్థ నుంచి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More