Ram Charan : చిరుత ‘ఐపీఓ’ నుంచి ఆర్ఆర్ఆర్ ‘ప్రాఫిట్స్’ వరకు- రామ్ చరణ్ ప్రస్థానం ఒక మల్టీబ్యాగర్ జర్నీ!
Ram Charan birthday : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రయాణం.. ఒక మల్టీ బ్యాగర్ స్టాక్‌ని తలపిస్తుంది. ఆరంభంలోనే అదరగొట్టిన ఐపీఓ, ఆ తర్వాత ఒడుదొడుకులకు తట్టుకుని ఎదిగిన స్టాక్.. రామ్ చరణ్ సినీ గ్రాఫ్‌లో మనం చూడవచ్చు. మరీ ముఖ్యంగా ఓపిక ఉంటే జరిగ అద్భుతాలు ఆయన కెరీర్ హైలైట్ చేస్తుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దేశంలో నేడు పరిచయం అవసరం లేని పేరు ఇది! తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా అడుగుపెట్టి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ ప్రయాణం ఒక అద్భుతం. అయితే రామ్ చరణ్ కెరీర్‌ని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపెడితే, ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడతాయి. ఒక ఇన్వెస్టర్ దృష్టితో చూస్తే.. మెగా పవర్ స్టార్ కెరీర్ ఒక పక్కా ‘బ్లూ చిప్ స్టాక్’ ప్రయాణాన్ని తలపిస్తుంది. స్టాక్ మార్కెట్‌లో లాభనష్టాలు, ఒడిదుడుకులు ఎలా ఉంటాయో.. చరణ్ కెరీర్‌లోనూ అలాగే ఉన్నాయి.

నేడు, మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ గ్లోబల్ స్టార్ కెరీర్ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని స్టాక్ మార్కెట్ టిప్స్‌ని ఇక్కడ చూసేయండి..
1. ఐపీఓ - చిరుతతో బంపర్ లిస్టింగ్!
ఒక కంపెనీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎంత హైప్ ఉంటుందో, 'చిరుత' సినిమాతో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ హైప్ ఉంది. మెగాస్టార్ వారసుడు అనే బ్రాండ్ వాల్యూతో ఈ 'స్టాక్' (చరణ్) మార్కెట్లోకి భారీ ప్రీమియంతో లిస్ట్ అయ్యింది. తొలి సినిమాతోనే మాస్ ఆడియన్స్‌ను మెప్పించి, తన మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను ఒక్కసారిగా పెంచేసుకున్నారు చరణ్.
2. మగధీర - మల్టీ బ్యాగర్ రిటర్న్స్
స్టాక్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఒకేసారి 10 రెట్లు లాభాలను ఇస్తాయి. చరణ్ కెరీర్‌లో 'మగధీర' కూడా అటువంటి మల్టీ బ్యాగర్. ఈ సినిమాతో చరణ్ బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది.
ట్రేడింగ్ బాషలో చెప్పాలంటే.. ఈ సినిమాతో మన చెర్రీ 'అప్పర్ సర్క్యూట్' కొట్టారు. తెలుగు సినిమా మార్కెట్ పరిధిని పెంచి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించారు.
మెగాస్టార్ మంత్ర: చిరంజీవి సినీ ప్రయాణంలో దాగున్న 'స్టాక్ మార్కెట్' పాఠాలు!
3. మార్కెట్ కరెక్షన్ - ఎదురుదెబ్బలు..
మగధీర తర్వాత చరణ్ కెరీర్‌లో కొన్ని 'కరెక్షన్లు' వచ్చాయి! 'ఆరెంజ్' లాంటి ప్రయోగాత్మక సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. ఇన్వెస్టర్లు (అభిమానులు) కాస్త ఆందోళన చెందిన సమయం అది. కానీ, రామ్ చరణ్ తన తప్పులను విశ్లేషించుకుని, మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా తనను తాను మార్చుకోవడానికి 'కన్సాలిడేషన్' పీరియడ్‌లోకి వెళ్లారు.

4. రంగస్థలం - ది బిగ్ బ్రేకౌట్..
స్టాక్ మార్కెట్‌లో ఒక షేర్ చాలా కాలం ఒకే రేంజ్‌లో ఉండి, ఒక్కసారిగా పాత రికార్డులను బద్దలు కొడుతూ పైకి వెళితే దాన్ని 'బ్రేకౌట్' అంటారు. 'రంగస్థలం' సినిమాతో చరణ్ సరిగ్గా అదే చేశారు. నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో తనపై ఉన్న 'కేవలం మాస్ హీరో' అనే ముద్రను చెరిపేసి, స్టాక్ వాల్యూను (బ్రాండ్ వాల్యూ) అమాంతం పెంచుకున్నాడు.
5. ఆర్ఆర్ఆర్ అండ్ ఆస్కార్ - గ్లోబల్ లిస్టింగ్..
ఒక భారతీయ కంపెనీ అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయితే ఎలా ఉంటుందో.. 'ఆర్ఆర్ఆర్'తో చరణ్ స్థాయి అలా పెరిగింది. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడం, గ్లోబల్ ఆడియన్స్ రామ్ చరణ్ నటనకు ఫిదా అవ్వడం ఆయన కెరీర్‌లో అతిపెద్ద మలుపు.
అందుకే నేడు చరణ్ కేవలం టాలీవుడ్ హీరో కాదు.. ఒక 'ఇంటర్నేషనల్ బ్రాండ్'.
రామ్ చరణ్ నుంచి నేర్చుకోవాల్సిన 'స్టాక్ మార్కెట్' పాఠాలు..
రామ్ చరణ్ కెరీర్ మనకు నేర్పే పాఠం ఏంటంటే.. "ఓపిక ఉంటేనే భారీ లాభాలు వస్తాయి." ప్రారంభంలో చిరంజీవి తనయుడిగా వచ్చినప్పటికీ, సొంత కష్టంతో, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ (సరైన పోర్ట్‌ఫోలియో) ఈరోజు ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం చరణ్ తన తదుపరి ప్రాజెక్టు 'పెద్ది' వంటి సినిమాతో మరో భారీ 'బుల్ రన్' కోసం సిద్ధమవుతున్నారు.
హ్యాపీ బర్త్ డే టు ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


