Ram Charan Dhurandhar 2 Review: ధురంధర్ 2 ఓ అద్భుతం: రామ్ చరణ్ కూడా రివ్యూ ఇచ్చేశాడు.. బాలీవుడ్‌కు ఏమైంది?
Ram Charan Dhurandhar 2 Review: ధురంధర్ 2పై మరో తెలుగు స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే చాలా మంది తెలుగు హీరోలు ఈ సినిమాను ఆకాశానికెత్తినా.. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ మంచి సినిమాలను మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ ది రివెంజ్' సినిమాపై చరణ్ తనదైన స్టైల్‌లో ఒక సూపర్ రివ్యూ ఇచ్చాడు. సినిమా చూసిన వెంటనే ఎక్స్ వేదికగా అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సహజంగా, ఉత్కంఠభరితంగా ఉంది..
ధురంధర్ ది రివెంజ్ సినిమా చాలా సహజంగా, ఉత్కంఠభరితంగా, మనసుపై బలమైన ప్రభావం చూపేలా ఉందని రామ్ చరణ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. డైరెక్టర్ ఆదిత్య ధర్ సినిమా స్థాయిని, అందులోని భావోద్వేగాలను చాలా అద్భుతంగా ఒకచోట చేర్చాడని, అసలు ఈ సినిమాతో ఆయన చేసిన మ్యాజిక్ నిజంగా అద్వితీయం అని చరణ్ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ఒక పాన్ ఇండియా స్టార్ ఇలా ఒక బాలీవుడ్ డైరెక్టర్ పనితనాన్ని పొగడటం చూసి అభిమానులు అంతా మురిసిపోతున్నారు.
రణ్‌వీర్ అదరగొట్టేశాడు.. మిగతా వాళ్ళ నటన కూడా సూపర్
ఇక నటీనటుల గురించి చరణ్ మాట్లాడుతూ.. హీరో రణ్‌వీర్ సింగ్ అసాధారణమైన నటనతో అదరగొట్టేశాడని ప్రశంసించాడు. అతని నటనలో ఉన్న తీవ్రత సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రేక్షకుల దృష్టి పక్కకు పోకుండా కట్టిపడేస్తుందని చరణ్ చెప్పాడు.
ఇక సీనియర్ నటులు మాధవన్ సార్, సంజయ్ దత్ సార్, అర్జున్ రాంపాల్ సార్ ముగ్గురూ తమ పవర్‌ఫుల్ నటనతో చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారని మెచ్చుకున్నాడు. అలాగే సారా అర్జున్ తన పాత్రలో చాలా గొప్పగా నటించిందని చరణ్ ప్రత్యేకంగా చెప్పాడు.
సంగీతం అదిరింది.. నిర్మాతలకు హ్యాట్సాఫ్
శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన సంగీతం ఈ సినిమాను ఇంకో మెట్టు పైకి ఎక్కించిందని రామ్ చరణ్ అన్నాడు. ఇండియన్ సినిమాలో మనల్ని కట్టిపడేసే అత్యుత్తమ సినిమాల్లో ఒకదాన్ని మనకు అందించినందుకు, డైరెక్టర్ ఆలోచనను పూర్తిగా నమ్మినందుకు జియో స్టూడియోస్, జ్యోతి దేశ్‌పాండేలకు చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. చివరగా టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ చరణ్ తన రివ్యూను ముగించాడు.
బాలీవుడ్‌కు ఏమైంది?
ధురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోల నుంచే వరుసగా ఒక్కో టాలీవుడ్ స్టార్ ఈ మూవీపై తమ రివ్యూలు ఇస్తూ వస్తున్నారు. మొదట అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, తాజాగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఆశ్చర్యకరంగా బాలీవుడ్ లోని ప్రముఖులు మాత్రం ఈ సినిమాపై మౌనంగా ఉన్నారు.
అక్కడి స్టార్ హీరోలు ఎవరూ ఈ మూవీ గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ధురంధర్ సినిమా సమయంలో స్పందించని తెలుగు హీరోలు సీక్వెల్ ను మాత్రం ఆకాశానికెత్తుతూ ట్వీట్లు చేస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్ మౌనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సౌత్ సినిమాల హవా పెరుగుతున్న సమయంలో హిందీ ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద హిట్ వచ్చినా స్పందించకపోవడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


