Dhurandhar 2 Telugu: గుడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు వెర్షన్ రిలీజ్ రేపే.. సెన్సార్ క్లియరెన్స్ వచ్చేసింది

Dhurandhar 2 Telugu: ధురంధర్ 2 తెలుగు వెర్షన్ మొత్తానికి వచ్చేస్తోంది. హిందీ వెర్షన్ వచ్చిన రెండు రోజుల తర్వాత తెలుగుతోపాటు తమిళం, మలయాళం వెర్షన్లు కూడా శనివారం (మార్చి 21) రిలీజ్ కానున్నాయి.

Published on: Mar 20, 2026, 17:08:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ధురంధర్ ది రివెంజ్ తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్స్‌కు మొత్తానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) క్లియరెన్స్ ఇచ్చేసింది. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ డబ్బింగ్ వెర్షన్స్ నిజానికి మార్చి 18న ప్రీమియర్స్, మార్చి 19న హిందీ వెర్షన్‌తో పాటు రిలీజ్ అవ్వాల్సింది. కానీ కంటెంట్ ఆలస్యం వల్ల రద్దయిన ఈ డబ్బింగ్ వెర్షన్స్ ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వస్తున్నాయి.

Dhurandhar 2 Telugu: గుడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు వెర్షన్ రిలీజ్ రేపే.. సెన్సార్ క్లియరెన్స్ వచ్చేసింది
Dhurandhar 2 Telugu: గుడ్ న్యూస్.. ధురంధర్ 2 తెలుగు వెర్షన్ రిలీజ్ రేపే.. సెన్సార్ క్లియరెన్స్ వచ్చేసింది

డబ్బింగ్ వెర్షన్స్‌కు సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

సీబీఎఫ్‌సీ వెబ్‌సైట్ ప్రకారం ధురంధర్ 2 తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్స్ సర్టిఫై అయ్యాయి. కానీ కన్నడ వెర్షన్ సర్టిఫికెట్ మాత్రం ఇంకా అప్‌లోడ్ అవ్వలేదు. ఈ మూడు వెర్షన్స్‌కు మార్చి 19న సర్టిఫికేషన్ పూర్తయింది. వీటి రన్‌టైమ్ చూసుకుంటే 3 గంటల 51 నిమిషాలు ఉంది. హిందీ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటల 49 నిమిషాలు ఉంటే, దానికంటే ఈ డబ్బింగ్ వెర్షన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. హిందీ వెర్షన్‌కు మార్చి 17న ఏ సర్టిఫికెట్ రాగా, మార్చి 18న మళ్లీ రీమాడిఫికేషన్ జరిగింది. ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్స్‌కు కూడా అదే ఏ సర్టిఫికేషన్ వచ్చింది.

సీబీఎఫ్‌సీ వెబ్‌సైట్‌లో పెట్టిన కథ ప్రకారం.. రెహమాన్ డకైత్ చనిపోయిన తర్వాత, ఇండియన్ ఏజెంట్ జస్కిరత్ సింగ్ రంగీ అలియాస్ హమ్జా అలీ మజారీ పాకిస్తాన్‌లోని గ్యాంగ్‌స్టర్ టెర్రర్ పొలిటికల్ నెట్‌వర్క్‌లో టాప్ పొజిషన్‌కు ఎదగాలని ప్లాన్ చేస్తాడు. తద్వారా ఇండియా శత్రువులకు శిక్ష పడేలా చేస్తాడు.

టికెట్ బుకింగ్స్ ఓపెన్.. ఏలూరు థియేటర్ సెటైర్

బుక్‌మైషోతో పాటు ఇతర టికెటింగ్ పోర్టల్స్‌లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళలో ధురంధర్ 2 కి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ కన్నడ డబ్బింగ్ వెర్షన్స్‌కు మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. మిగతా భాషలు అన్నీ మార్చి 21 మధ్యాహ్నం నుంచి థియేటర్లలోకి రానున్నాయి.

ఈ గ్యాప్‌లో ఏపీలోని ఏలూరు ఎస్‌వీసీ సినిమాస్ వాళ్లు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ భలే వైరల్ అవుతోంది. ఫైనల్లీ ధురంధర్ ద రివెంజ్ తెలుగు వెర్షన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈసారి టికెట్స్ బుక్ చేశాక.. క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్ కోసం కోరకుండా సినిమా చూడండి. ఆ బాధ్యత మీదే జియో స్టూడియోస్, ఆదిత్య ధర్ అంటూ మేకర్స్‌కు గట్టిగానే కౌంటర్ వేశారు.

ఆదిత్య ధర్ ఏం చెప్పాడు?

గత బుధవారం అంటే మార్చి 18 సాయంత్రం 5 గంటల డబ్బింగ్ వెర్షన్స్ షోస్ క్యాన్సిల్ అయిన తర్వాత డైరెక్టర్ ఆదిత్య తన సోషల్ మీడియాలో సాయంత్రం 6 గంటలకు ఒక నోట్ పోస్ట్ చేశాడు. ఇండియా అంతటా హిందీ షోస్ అన్నీ షెడ్యూల్ చేసినట్లే సాయంత్రం 5 గంటల నుంచి రన్ అవుతున్నాయి. మా తమిళం, తెలుగు షోస్ రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఊహించని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మలయాళం, కన్నడ షోస్ రేపు ఉదయం నుంచి పడతాయి అని అందులో రాశాడు.

కానీ ఆదిత్య అలా ప్రామిస్ చేసినా కూడా మార్చి 19న ఎక్కడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లిస్ట్ అవ్వకపోవడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. షోస్ పడకపోవడంతో చాలా థియేటర్స్ డబ్బింగ్ ప్రీమియర్స్‌కు రీఫండ్స్ ఇచ్చేశాయి. కొంతమంది మాత్రం హిందీ వెర్షన్‌ను సబ్‌టైటిల్స్‌తో చూసి అడ్జస్ట్ అయ్యారు. ఫస్ట్ పార్ట్ ధురంధర్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యి వరల్డ్‌వైడ్‌గా రూ.1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సీక్వెల్ ఫస్ట్ డేనే రూ.240 కోట్ల భారీ ఓపెనింగ్ తెచ్చుకుంది. మరి ఈ డబ్బింగ్ వెర్షన్స్ కూడా చేరాక లాంగ్ రన్‌లో ఇది ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More