సొంత తల్లిని చంపిన గ్యాంగ్​స్టర్! Dhurandhar సినిమాలోని రెహమాన్​ డకైత్​ అసలు కథ ఇది..

ధురంధర్​ సినిమాలో అక్షయ్​ కుమార్​ నటించిన ‘రెహమాన్​ డకైత్​’ పాత్ర ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. పాకిస్థాన్​ కరాచీకి చెందిన ఈ గ్యాంగ్​స్టర్​ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. మరి ఎవరు ఈ రెహమాన్​ డకైత్​? ఇతని కథ ఏంటి?

Published on: Dec 7, 2025, 10:51:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రణ్​వీర్​ సింగ్​ నటించిన ధురంధర్​ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్​ లభిస్తోంది. బాలీవుడ్​ హీరో​ కెరీర్​లోనే బిగ్గెస్ట్​ ఓపెనింగ్స్​ని ఈ సినిమా రాబట్టింది. రెండు రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ.60కోట్లు సంపాదించింది. అయితే ఈ సినిమాలో “రెహమాన్​ డకైత్​” పాత్ర పోషించిన అక్షయ్​ ఖన్నాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాకిస్థాన్​ కరాచీ అండర్​ వరల్డ్​లో అత్యంత క్రూరమైన వ్యక్తి పాత్రలో నటించి, అందరిని మెప్పించారు అక్షయ్​ కుమార్​. ఈ నేపథ్యంలోనే అసలైన “రెహమాన్​ డకైత్”​ గురించి తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఎవరు ఈ రెహమాన్​ డకైత్​? అకని అసలు కథ ఏంటి?

రెహమాన్​ డకైత్​ ఎవరు?
రెహమాన్​ డకైత్​ ఎవరు?

ధురంధర్​ : రెహమాన్ డకైత్ నేపథ్యం..

రెహమాన్ డకైత్ అసలు పేరు సర్దార్ అబ్దుల్ రెహమాన్ బలోచ్. ఇతను 90వ దశకంలో కరాచీలోని లియారీ ప్రాంతానికి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకడు. ఇతన్ని రెహమాన్ బలోచ్ అని కూడా పిలుస్తారు.

రెహమాన్ తండ్రి దదల్ బలోచ్, 1964 నుంచే డ్రగ్స్ స్మగ్లింగ్‌ చేసేవాడు. ఫలితంగా రెహమాన్ కూడా చాలా చిన్న వయసులోనే డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు.

కేవలం 13 ఏళ్ల వయసులోనే రెహమాన్ ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడని చెబుతుంటారు. అంతేకాకుండా, ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడితో సంబంధం ఉందనే అనుమానంతో రెహమాన్​ డకైత్​ సొంత తల్లిని కూడా చంపాడని ఊహాగానాలు ఉన్నాయి!

సినిమాలో అక్షయ్ ఖన్నా చెప్పే.. ‘రెహమాన్ డకైత్ కి ది హుయీ మౌత్ బహుత్ కసైనుమా హోతి హై’ (రెహమాన్ డకైత్ కసాయిలా చంపుతాడు) అనే డైలాగ్ అతని నిజ జీవిత క్రూరత్వాన్ని సూచిస్తుందని చెబుతున్నారు.

రెహమాన్ డకైత్ లియారీలో తన పాలన సాగించినప్పుడు అతని అరాచకం స్పష్టంగా కనిపించేది. రెహమాన్ 'పీపుల్స్ అమన్ కమిటీ'లో సభ్యుడుగా ఉంటూ, తన రాజకీయ పార్టీకి సమాంతరంగా అక్రమ రవాణా (స్మగ్లింగ్) కార్యకలాపాలు నిర్వహించేవాడు.

ధురంధర్​ : గ్యాంగ్ వార్స్, అంతం..

రెహమాన్ గ్యాంగ్​కి లియారీ ప్రాంతంపై బలమైన పట్టు సాధించింది. ఆ సమయంలో మరో రెండు గ్యాంగ్‌లు వీరితో పోటీ పడేవి. ప్రత్యర్థి హాజీ లాలూ కుమారుడైన అర్షద్ పప్పు, రెహమాన్‌కు అతిపెద్ద పోటీదారు. వీరి మధ్య ఉన్న వైరం కారణంగా లియారీలో అనేక గ్యాంగ్ వార్స్‌ జరిగాయి. దీని ఫలితంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఒకసారి, రెహమాన్ అందరూ చూస్తుండగానే అర్షద్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు! సినిమాలో అక్షయ్ ఖన్నా పాత్ర వీధి మధ్యలో ఒక వ్యక్తిపై దాడి చేసే సన్నివేశం నిజ జీవితంలో రెహమాన్ డకైత్ చేసిన పని ఆధారంగానే రూపొందించినట్లు చెబుతున్నారు.

డెడ్లీ గ్యాంగ్​స్టర్​ రెహమాన్‌ను 2005లో జుల్ఫికర్ మీర్జా అరెస్టు చేశారు. కానీ అతను ఆ తర్వాత తప్పించుకున్నాడు! చివరికి 2009లో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు!

'ధురంధర్' చిత్రం లియారీ గ్యాంగ్ వార్ ఆధారంగా తీశారా?

ఆదిత్య ధార్ రూపొందించిన 'ధురంధర్' చిత్రం మేజర్ మోహిత్ శర్మ జీవిత కథ ఆధారంగా తీసినట్లు తొలుత ఊహగనాలు వచ్చాయి. అయితే, సినిమా చూసిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, ఈ చిత్రంలో ఆ సైనికుడి జీవితానికి సంబంధించిన పోలికలు ఏవీ లేవని ప్రకటించింది.

అయినప్పటికీ, సినిమాలో చూపించిన కథకు, వాస్తవంగా జరిగిన వాటికి దగ్గరి పోలికలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More