PEDDI Glimpse: ఆటే నా పొగ‌రు-రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే-పెద్ది టీమ్‌ స‌ర్‌ప్రైజ్-క్రికెట్ కాదు కుస్తీ కూడా-గ్లింప్స్ వైరల్

PEDDI Glimpse: వాట్ ఏ స‌ర్‌ప్రైజ్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది మూవీ టీమ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. మల్లయోధుడిగా ఉన్న రామ్ చరణ్ వీడియోను రిలీజ్ చేసింది. పహిల్వాన్ గ్లింప్స్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

Published on: Mar 27, 2026, 09:55:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పెద్ది టీమ్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో క్రికెటర్ గానే రామ్ చరణ్ నటిస్తున్నాడని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ కుస్తీలో తలపడే మల్లయోధుడిలా కూడా రామ్ చరణ్ పోరాటానికి సై అంటున్నాడు. ఈ రోజు (మార్చి 27) రామ్ చరణ్ సందర్భంగా రిలీజ్ చేసిన పహిల్వాన్ గ్లింప్స్ అదిరిపోయింది.

రామ్ చరణ్ (x/peddi)
రామ్ చరణ్ (x/peddi)

పహిల్వాన్ గ్లింప్స్

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది మూవీ టీమ్ శుక్రవారం గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ‘పెద్ది పహిల్వాన్ గ్లింప్స్’ పేరుతో ఈ వీడియోతో టీమ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో మల్లయోధుడిలా రామ్ చరణ్ గెటప్, అతను కుస్తీ కోసం తీసుకుంటున్న శిక్షణ, పోటీలో తలపడే తీరు అదుర్స్ అనిపిస్తోంది.

ఆటే నా పొగరు

‘‘కుస్తీ అంటే బంతితో బ్యాట్ కు ఎదురెళ్లే ఆట కాదురా. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట’’ అని డైలాగ్ వినిపిస్తుండగా గ్లింప్స్ లో రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. కండలు తిరిగిన దేహంతో చెర్రీ లుక్ వేరే లెవల్ లో ఉంది. గదతో చరణ్ చేసిన విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

‘‘చూడమ్మి ఆటే నా పొగరు’’ అని ఆఖర్లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ఈ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పెద్ది సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

ఊహించని గిఫ్ట్

పెద్ది సినిమాలో రూరల్ క్రికెట్ ప్లేయర్ గానే రామ్ చరణ్ నటిస్తున్నాడని ఇన్ని రోజులు అందరూ అనుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన గ్లింప్స్, వీడియోలు, ఫొటోల్లో రామ్ చరణ్ బ్యాట్ తోనే కనిపించాడు. కానీ ఇప్పుడు కుస్తీ యోధుడిగానూ చరణ్ కనిపించనున్నాడని పహిల్వాన్ గ్లిప్స్ తో పెద్ది మూవీ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది.

రామ్ చరణ్ ఎఫర్ట్

శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ లో మల్ల యోధుడిలా రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. ఈ క్యారెక్టర్ కోసం అతను ఎంతగా కష్టపడ్డాడో ఈ వీడియో చూస్తేనే తెలుస్తోంది. కండలు తిరిగిన దేహంతో రామ్ చరణ్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా కనిపించాడు.

పెద్ది రిలీజ్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ ఏప్రిల్ 30, 2026న రిలీజ్ కానుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ పెద్ది సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఆస్కార్ అవార్డీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More