PEDDI SONG: రెహమాన్ మ్యాజిక్ వాయిస్.. డ్యాన్స్‌తో కుమ్మేసిన రామ్‌చ‌ర‌ణ్‌.. పెద్ది సెకండ్ సాంగ్‌ రై రై రారా వైర‌ల్‌

PEDDI SONG: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ‘రై రై రా రా’ సాంగ్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఇందులో రామ్ చరణ్ డ్యాన్స్ మరో లెవల్ ఉంది. పూనకం వచ్చినట్లు ఊగిపోయిన చెర్రీ.. పవర్ మూవ్స్ తో అదరగొట్టాడు. 

Published on: Mar 3, 2026, 05:46:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ్ చరణ్ డ్యాన్స్ లో ఉండే గ్రేస్, పవర్ తెలిసిందే. మరోసారి తన డ్యాన్స్ తో చెర్రీ కుమ్మేశాడు. పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. అతని అప్ కమింగ్ మూవీ పెద్ది నుంచి రిలీజైన రై రై రా రా సాంగ్ లో మాస్ గెటప్ లో రామ్ చరణ్ డ్యాన్స్ మరో లెవల్ అన్నట్లు ఉంది. ఇక వాయిస్ తో ఏఆర్ రెహమాన్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడు.

రామ్ చరణ్ రై రై రా రా సాంగ్ (x/BuchiBabuSana)
రామ్ చరణ్ రై రై రా రా సాంగ్ (x/BuchiBabuSana)

రై రై రా రా

బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘రై రై రా రా’ రిలీజైంది. ఈ పాటతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. పవర్ ఫుల్ లిరిక్స్, రామ్ చరణ్ పవర్ మూవ్స్ తో రై రై రా రా సాంగ్ రచ్చ చేస్తోంది.

పెద్ది సెకండ్ సాంగ్

పెద్ది మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ‘చికిరి’ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు రై రై రా రా అంటూ సాగుతున్న సాంగ్ కూడా మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేసేందుకు వచ్చేసింది. సోమవారం (మార్చి 2) రాత్రి ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సాంగ్ రాత్రి 7.02 గంటలకు రిలీజ్ కావాల్సింది. కానీ టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఆలస్యంగా రిలీజైంది.

ఏఆర్ రెహమాన్ మ్యాజిక్

రై రై రా రా సాంగ్ ను ఏఆర్ రెహమాన్ స్వయంగా పాడారు. మరోసారి తన వాయిస్ తో ఈ ఆస్కార్ అవార్డు విన్నర్ మ్యాజిక్ క్రియేట్ చేశారు. పెద్ది సినిమాకు రెహమానే మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఈ సాంగ్ కు జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్స్ తో కొరియోగ్రాఫీ అందించారు. రామ్ చరణ్ తన స్టైల్లో ఆ స్టెప్స్ కు మరింత జోష్ యాడ్ చేశాడు.

అనంత శ్రీరామ్ రాసిన రై రై రా రా సాంగ్ లిరిక్స్ మోటివేట్ చేసేలా ఉన్నాయి. ‘పాతేసుకోకోయ్ అలా నిన్నే నీ లోపల, హే పాతికేళ్లకే నువ్వు పాతబడిబోకురా’ అంటూ లిరిక్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి.

పెద్ది రిలీజ్ డేట్

సినీ లవర్స్ పెద్ది మూవీ కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More