Ram Charan: నార్త్ అమెరికాలో పెద్ది రికార్డు.. రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ రేటుకు రైట్స్!
ఇదీ రామ్ చరణ్ క్రేజ్ అంటే! అతని అప్ కమింగ్ మూవీ పెద్దికి నార్త్ అమెరికాలో థియేట్రికల్ రేట్స్ కు రికార్డు ధర పలికిందని టాక్. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉందో చెప్పే వార్త ఇది. అతను హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘పెద్ది’. ఇదో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీనికి బుచ్చిబాబు సాన డైరెక్టర్. అయితే ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ కు రికార్డు రేటు పలికిందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

పెద్ది థియేట్రికల్ రైట్స్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ ఏప్రిల్ 30, 2026న రిలీజ్ కానుంది. దీంతో మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ఏకంగా 7 మిలియన్ డాలర్లు పలికాయని ట్రేడ్ ఇన్ సైడ్ వర్గాల సమాచారం. చెర్రీ కెరీర్ లోనే ఇది రికార్డు.
ఆ సక్సెస్ తో
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టింది. రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. ఈ మూవీ ఓవర్సీస్ లో 15 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో పెద్ది మూవీపై నార్త్ అమెరికాలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రామ్ చరణ్ చివరి సినిమా గేమ్ ఛేంజర్ అక్కడ 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
అదే టార్గెట్
పెద్ది సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ తోనేే భారీ మొత్తం రాబట్టాలని ప్రొడ్యూసర్లు ఉన్నారని తెలిసింది. రూ.420 నుంచి రూ.450 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ ద్వారానే రాబట్టలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. పెద్ది సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. సమ్మర్ ను లక్ష్యంగా చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లకు రాబోతుంది.
రా అండ్ రస్టిక్
పెద్ది మూవీ ఫుల్ రా అండ్ రస్టిక్ గా తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ఫుల్ మాస్ గెటప్ లో కనిపించనున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్, చికిరి సాంగ్ పెద్ది సినిమాపై హైప్ మరింత పెంచేశాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ గ్రామీణ క్రికెటర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పెద్దికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


