సమాధుల్లోని శవాలను మార్చే గ్యాంగ్-ఓటీటీలోకి వచ్చిన ఫరియా అబ్దుల్లా తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్-ఇక్కడ చూసేయండి

జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో మనసులు దోచుకున్న ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. డబ్బు కోసం సమాధుల్లోని శవాలను మార్చే గ్యాంగ్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది.  

Jan 16, 2026, 13:45:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఆ సినిమానే ‘గుర్రం పాపిరెడ్డి’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ నటించిన ఈ సినిమా శుక్రవారం (జనవరి 16) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సమాధుల్లోని శవాలను మార్చే గ్యాంగ్ చేసే సందడితో ఈ మూవీ ఎంటర్ టైన్ చేస్తోంది.

ఓటీటీలో తెలుగు కామెడీ థ్రిల్లర్ (x)
ఓటీటీలో తెలుగు కామెడీ థ్రిల్లర్ (x)

గుర్రం పాపిరెడ్డి ఓటీటీ

డిఫరెంట్ టైటిల్ తో ఆడియన్స్ కు కనెక్ట్ అయిన సినిమా గుర్రం పాపిరెడ్డి. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పెద్దగా ఆడలేకపోయిన మూవీ ఇది. ఇప్పుడిది డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చింది. ఇవాళ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ తెలుగు సినిమా.

నెల రోజుల్లోపే

థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే గుర్రం పాపిరెడ్డి ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్ 19, 2025న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులో నరేశ్ అగస్త్య హీరో. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్ తదితరులు నటించారు. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ కు మురళీ మనోహర్ డైరెక్టర్.

గుర్రం పాపిరెడ్డి స్టోరీ

డబ్బు కోసం సమాధుల్లోని శవాలను మార్చడానికి ఓ గ్యాంగ్ ఏం చేసింది? ఎలాంటి చిక్కుల్లో పడిందనే కథతో సాగే సినిమానే గుర్రం పాపిరెడ్డి. ఖమ్మం జిల్లాలోని ఓ విలేజ్ లో గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య) ఉంటాడు. అతను డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతాడు. ఓ బ్యాంక్ రాబరీకి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు.

శవాలను మార్చేసి

డబ్బు కోసం పాపిరెడ్డి మరో అడ్డదారి వెతుక్కుంటాడు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో నర్సుగా చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే.. శ్రీశైలంలోని ఓ శ్మశానంలో ఉన్న సమాధిని తీసుకొచ్చి శ్రీనగర్ లో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు.

ఇందుకోసం గొయ్యి (జీవన్), మిలటరీ (రాజ్ కుమార్ కసిరెడ్డి), చిలిపి (వంశీధర్ గౌడ్)తో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుంటాడు. ఈ గ్యాంగ్ కలిసి శవాలను మార్చాలనుకుంటారు. డబ్బు కోసం పెద్ద ప్లాన్ వేస్తారు. మరి వీళ్లు శవాలను మార్చారా? అసలు ఆ ప్లాన్ ఎందుకు వేశారు? అన్నది గుర్రం పాపిరెడ్డి సినిమాలో చూడాల్సిందే.

తెలుగులో డార్క్ కామెడీ థ్రిల్లర్స్ కావాలనుకునే ఓటీటీ ఆడియన్స్ కు జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న గుర్రం పాపిరెడ్డి మూవీ మంచి ఆప్షన్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More