గుర్రం పాపిరెడ్డి రివ్యూ- శవాలు మార్చి కోట్లు కొల్లగొట్టే స్కెచ్- నరేష్, ఫరియా, బ్రహ్మానందం కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
తెలుగులో లేటెస్ట్‌గా తెరకెక్కిన సినిమా గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు తదితరులు నటించిన ఈ సినిమాకు మురళీ మనోహర్ కథ, దర్శకత్వం వహించారు. డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి గుర్రం పాపిరెడ్డి రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: గుర్రం పాపిరెడ్డి

నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, ప్రభాస్ శ్రీను, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
సినిమాటోగ్రఫీ: అర్జున్ రాజా
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
కథ, దర్శకత్వం: మురళీ మనోహర్
నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ)
విడుదల తేది: 19 డిసెంబర్ 2025
డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెలుగులో వచ్చిన లేటెస్ట్ సినిమా గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్‌గా బ్రహ్మానందం, యోగి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మురళీ మనోహర్ కథ, దర్శకత్వం అందించారు. డిసెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో నేటి గుర్రం పాపిరెడ్డి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
గ్రామీణ ప్రాంతానికి చెందిన గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) బ్యాంక్ దోపిడీకి యత్నించి ఫెయిల్ అవుతాడు. డబ్బు కోసం మరో దారి వెతుకుతాడు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో నర్స్‌గా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి కోట్లు రాబట్టేలా ఓ స్కెచ్ వేస్తాడు.
అందుకు శ్రీశైలంలోని శ్మశానంలో నుంచి ఓ శవాన్ని బయటకు తీసుకొచ్చి శ్రీనగర్‌లో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు. ఈ పనికోసం గొయ్యి (జీవన్ కుమార్), చిలిపి (వంశీధర్ గౌడ్), మిలట్రీ (రాజ్ కుమార్ కసిరెడ్డి)ని తన టీమ్‌లో చేర్చుకుంటాడు పాపిరెడ్డి.
శవాన్ని మార్చేందుకు శ్రీశైలం వెళ్లిన పాపిరెడ్డి టీమ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అసలు శవాన్ని ఎందుకు మార్చాలనుకున్నారు? దానికి డబ్బు రావడానికి సంబంధం ఏంటీ? స్వాతంత్య్రానికి ముందు నాటి కళింగ-బాలిక-చెర సంస్థానాల నేపథ్యం ఏంటీ? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇప్పటివరకు కామెడీ థ్రిల్లర్స్ సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ, ఇది చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ డార్క్ కామెడీ థ్రిల్లర్. జిల్లా కోర్ట్ జడ్జి పాత్ర బ్రహ్మానందం కథ చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. పాత్రల పరిచయం ఆకట్టుకునేలా ఉంటుంది. తర్వాత పాపిరెడ్డి, సౌదామిని డబ్బు కోసం వేసే స్కెచ్, అందుకోసం ముగ్గురుని పనిలో పెట్టుకోవడం, వారి పేర్లు అంతా బాగా మెప్పిస్తుంది.
ఫస్టాఫ్ అంతా శవాల్ని మార్చడంతో సాగుతూ చాలా కామెడీ జెనరేట్ చేస్తుంది. శ్మశానంలోని శవాలకు స్వాతంత్ర్యం కంటే ముందు నాడు ఉన్న మూడు సంస్థానాల కథకు బాగా లింక్ చేశారు. ఈ క్రమంలో వచ్చే రాజ కుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) పాపిరెడ్డి కోసం వెతకడం, ఈ ముగ్గురికి ఉన్న నేపథ్యం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
క్యూరియాసిటీ పెంచేలా ద్వితీయార్థం
కళింగ సంస్థాన వారసుడు గొయ్యి (జీవన్ కుమార్) అని గుర్రం పాపిరెడ్డి కోర్టును ఆశ్రయించడం వంటి ట్విస్టులతో సాగుతుంది. సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీ పెంచేలా ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. అయితే, ద్వితీయార్థంలో కోర్టు డ్రామాతో అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌కు ముందు యోగి బాబుతో వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి.
గుర్రం పాపిరెడ్డి సెకండ్ పార్ట్‌కు ఇచ్చిన లీడ్ బాగుంటుంది. ఇకపోతే నరేష్ అగస్త్య నటన చాలా బాగుంది. విభిన్న గెటప్పులలో మంచి ఈజ్‌తో అదరగొట్టాడు. జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా గ్లామర్‌తోపాటు నటనతో మెప్పించింది.
ఫైనల్‌గా చెప్పాలంటే!
జీవన్ కుమార్ అమాయకత్వపు పాత్రలో బాగా నవ్విస్తాడు. వంశీధర్, రాజ్ కుమార్ కసిరెడ్డి తమ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటారు. మిగతా పాత్రలన్నీ బాగా మెప్పిస్తాయి. చిన్న చిన్న మైనస్‌లు తప్పితే డైరెక్టర్ కథ, డైరెక్షన్ చాలా బాగుంది.
సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే తెలివైన వాడు తెలివిలేనివాళ్లతో తెలివి తక్కువ పని చేస్తే వచ్చే గందరగోలం, హాస్యం ఎలా ఉంటాయో చెప్పే సినిమానే గుర్రం పాపిరెడ్డి.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


