OTT Survival: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్- 117 కోట్లకి 360 కోట్ల కలెక్షన్స్- రక్తపాత సీన్లు!

Ready Or Not 2 Here I Come OTT Streaming Today: హాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. రూ. 117 కోట్ల బడ్జెట్‌కు రూ. 360 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన రెడీ ఆర్ నాట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 16, 2026, 21:52:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ready Or Not 2 Here I Come OTT Release Today: హారర్, డార్క్ కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు ఒక అద్భుతమైన వినోదం సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై మూడు నెలల పాటు వెండితెరపై ప్రేక్షకులను భయపెట్టిన హాలీవుడ్ సంచలనం 'రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్' (Ready or Not 2: Here I Come) ఇప్పుడు ఓటీటీ స్క్రీన్‌పైకి వచ్చేసింది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్- 117 కోట్లకి 360 కోట్ల కలెక్షన్స్- రక్తపాత సీన్లు!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్- 117 కోట్లకి 360 కోట్ల కలెక్షన్స్- రక్తపాత సీన్లు!

ఎక్కడో ముగిసిందో అక్కడే

2019లో వచ్చి కల్ట్ హిట్ సాధించిన 'రెడీ ఆర్ నాట్' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ కథాంశం మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే మరింత ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. లే డోమాస్ కుటుంబం చేసిన భయానక మారణహోమం నుంచి చాకచక్యంగా ప్రాణాలతో బయటపడిన గ్రేస్ (సమారా వీవింగ్)కు ఈసారి అంతకంటే పెద్ద సవాలు ఎదురవుతుంది.

ఈ ప్రమాదకరమైన నైట్‌మేర్ ఆటలో ఆమె తదుపరి దశకు చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ఆమెకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న సోదరి ఫెయిత్ (కేథరిన్ న్యూటన్) తోడవుతుంది. ప్రపంచాన్ని శాసించే 'కౌన్సిల్ ఆఫ్ హై సీట్'ను దక్కించుకోవడానికి, తన సోదరి ప్రాణాలను కాపాడుకోవడానికి గ్రేస్ రక్తం చిందించే పోరాటమే ఈ చిత్రం.

వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ..

సింహాసనం కోసం నాలుగు ప్రత్యర్థి కుటుంబాలు గ్రేస్ కోసం వేట సాగిస్తుంటాయి. ఇందులో గెలిచిన వారే ప్రపంచాన్ని ఏలుతారు. ఈ సినిమా కేవలం రక్తం చిందించే హారర్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, సమాజంలో ఉన్న లోపభూయిష్టమైన చట్టాలు, వ్యవస్థల తీరును కూడా ఎండగడుతుంది. పాత్రలు తమకు వేరే ప్రత్యామ్నాయం లేదా ఛాయిస్ లేదని భావించేలా చేసే వ్యవస్థాగత ఒత్తిడిని ఇందులో అద్భుతంగా చూపించారు.

"కేవలం భయపెట్టే సీన్లు మాత్రమే కాకుండా, వ్యవస్థలో ఉండే లోపాలను, తప్పించుకోలేని కుటుంబ చిక్కులను ఈ సినిమాలో చక్కగా విశ్లేషించారు" అని సినీ విమర్శకులు తమ రివ్యూలలో పేర్కొన్నారు. రెడీ ఆర్ నాట్ 2 హియర్ కమ్ సినిమాలో సమారా వీవింగ్, కేథరిన్ న్యూటన్‌లతో పాటు సారా మిషెల్ గెల్లర్, షాన్ హటోసి, నెస్టర్ కార్బోనెల్, కెవిన్ డురాండ్, ఒలివియా చెంగ్, డేవిడ్ క్రానెన్‌బర్గ్, ఎలిజా ఉడ్ వంటి భారీ తారాగణం నటించి మెప్పించారు.

చిన్న బడ్జెట్.. భారీ వసూళ్లు

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 14 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 117 కోట్లు) పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 42.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 360 కోట్లు) వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం మెప్పించింది.

మ్యాట్ బెట్టినెల్లి-ఓల్పిన్, టైలర్ గిల్లెట్ ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన దర్శకత్వం వహించగా.. గాయ్ బ్యూసిక్, ఆర్ క్రిస్టోఫర్ మర్ఫీ రైటర్లుగా పాత సక్సెస్‌ఫుల్ బృందాన్ని మళ్లీ నడిపించారు. ఆండ్రూ స్టియర్న్ ప్రొడక్షన్ డిజైన్, బ్రెట్ జుట్కివిచ్ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి.

రేటింగ్ అండ్ ఓటీటీ స్ట్రీమింగ్

అయితే, ఇంతటి క్రేజ్ ఉన్న రెడీ ఆర్ నాట్ 2 సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 6.5 రేటింగ్ వచ్చింది. అలాగే, రొట్టెన్ టొమాటోస్ నుంచి 100కి 75 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ లభించింది. సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రెడీ ఆర్ నాట్ 2 హియర్ కమ్ ఓటీటీలోకి ఇవాళ (జూలై 16) వచ్చేసింది.

జియో హాట్‌స్టార్‌లో రెడీ ఆర్ నాట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హారర్, యాక్షన్, రక్తపాతం, సర్వైవల్ వంటి అంశాలను ఇష్టపడే వారికి జియో హాట్‌స్టార్‌లో నేడు ఓటీటీ రిలీజ్ అయిన రెడీ ఆర్ నాట్ 2 హియర్ కమ్ మూవీ చూసేందుకు మంచి ఆప్షన్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More