Urvashi Rautela: మార్వెల్ విలన్ లోకీతో ఊర్వశి రౌటేలా ముచ్చట్లు.. బాలకృష్ణ డాకు మహారాజ్ 2లో నటించేందుకు అడుగుతుందేమో!
Urvashi Rautela With Loki Star Tom Hiddleston: బాలకృష్ణ డాకు మహారాజ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా వింబుల్డన్ 2026 ఫైనల్స్ వేదికపై సందడి చేశారు. అక్కడ హాలీవుడ్ మార్వెల్ సిరీస్ స్టార్, విలన్ 'లోకీ' ఫేమ్ టామ్ హిడిల్‌స్టన్‌ను కలిసి ఆమె ముచ్చటించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Urvashi Rautela With Loki Star Tom Hiddleston: బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ ఊర్వశి రౌటేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వినూత్నమైన ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ ఇంటర్నెట్‌ను ఊపేస్తుంటాయి. తాజాగా ఆమె హాలీవుడ్ అగ్ర నటుడితో కలిసి కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు.

వింబుల్డన్ 2026
లండన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి వెళ్లిన ఊర్వశి, అక్కడ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) చిత్రాల్లో విలన్'లోకీ' పాత్రతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న టామ్ హిడిల్‌స్టన్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి నడుస్తూ, నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.
బాలకృష్ణ యాక్షన్ చిత్రం
టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ యాక్షన్ చిత్రం 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) లో నటించిన ఊర్వశి రౌటేలా, ఈ అంతర్జాతీయ టెన్నిస్ వేదికపై పసుపు రంగు (Yellow) వెస్ట్రన్ అవుట్‌ఫిట్, మ్యాచింగ్ హ్యాండ్‌బ్యాగ్, హీల్స్ ధరించి ఎంతో స్టైలిష్‌గా మెరిశారు.
ఈ ఏడాది వింబుల్డన్ ఫైనల్స్‌లో జాన్నిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య ఉత్కంఠభరిత పోరు సాగింది. ఇందులో జాన్నిక్ సిన్నర్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను కళ్లారా వీక్షించిన ఊర్వశి, టామ్ హిడిల్‌స్టన్‌తో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.
"వింబుల్డన్ 2026 ఫైనల్స్‌లో ఇదొక మరువలేని సాయంత్రం. జాన్నిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన అద్భుత పోరాటానికి సాక్ష్యంగా నిలిచాం. విజయం సాధించిన జాన్నిక్ సిన్నర్‌కు అభినందనలు. టామ్ హిడిల్‌స్టన్‌తో కలిసి ఈ మధ్యాహ్నాన్ని పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది" అని ఊర్వశి తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
నెటిజన్ల ఫన్నీ కామెంట్లు.. విపరీతంగా ట్రోలింగ్
ఉర్వశి రౌటేలా ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లు, ముఖ్యంగా రెడ్డిట్ (Reddit) యూజర్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపించారు. వీడియోలో టామ్ హిడిల్‌స్టన్ ముఖ కవళికలను గమనించిన కొందరు, ఆయనకు ఊర్వశితో మాట్లాడటం పెద్దగా ఇష్టం లేనట్లు కనిపిస్తోందని విమర్శించారు. కేవలం మర్యాద కోసమే ఆయన నవ్వుతూ మాట్లాడి, అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారని కొందరు నెటిజన్లు రాశారు.
"ఆయన ఊర్వశి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్నాడు" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. మరికొందరు ఆమె సినిమా 'డాకు మహారాజ్'ను లాగుతూ కౌంటర్లు వేశారు. "ఊర్వశి బహుశా ఆయన్ను 'డాకు మహారాజ్ 2' లో నటించమని అడుగుతుందేమో," అంటూ సరదాగా ట్రోల్ చేశారు.
ఫ్యాషన్ సెన్స్ బాలేదు
"పసుపు రంగు దుస్తుల్లో టామ్ హిడిల్‌స్టన్‌తో మాట్లాడిన మొదటి భారతీయ మహిళ ఊర్వశి రౌటేలానేనేమో, ఆమెకు అభినందనలు" అంటూ మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్ బాలేదని, మేకప్ స్టైలిస్ట్‌ను వెంటనే మార్చాలంటూ మరికొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు.
వింబుల్డన్ వేదికపై గ్లోబల్ సెలబ్రిటీల జాతర
ఈ ఏడాది వింబుల్డన్ 2026 ఫైనల్స్ ప్రపంచవ్యాప్త సెలబ్రిటీలతో కిక్కిరిసిపోయింది. హాలీవుడ్ ప్రముఖులు ప్రియాంక చోప్రా, నికోల్ కిడ్మాన్, ఆండ్రూ గార్ఫీల్డ్, జెన్నిఫర్ లోపెజ్, పాప్ సింగర్ జో జోనాస్, డేవిడ్ బెక్హాం, బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్ వంటి దిగ్గజాలు మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు.
అలాగే బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ నుంచి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (కేట్ మిడిల్టన్), ప్రిన్స్ ఆఫ్ వేల్స్ (ప్రిన్స్ విలియం) తమ పిల్లలు జార్జ్, షార్లెట్‌లతో కలిసి హాజరయ్యారు. క్వీన్ కమిల్లా కూడా ఈ టోర్నీలో సందడి చేశారు.
సందడి చేసిన భారతీయ తారలు
మన దేశం నుంచి కూడా క్రీడా, సినీ రంగానికి చెందిన ప్రముఖులు వింబుల్డన్ గ్యాలరీలో మెరిశారు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల, కోలీవుడ్ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్, బాలీవుడ్ భామ అనన్య పాండే, లారా దత్తా, ఫర్హాన్ అక్తర్ ఇక్కడ కనిపించారు.
క్రీడా రంగం నుంచి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్, యంగ్ సంచలనాలు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ కూడా ఈ టెన్నిస్ సంబరాన్ని వీక్షించారు.
ప్రస్తుతం ఊర్వశి రౌటేలా హాలీవుడ్ పర్యటనలు, గ్లోబల్ స్టార్లతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


