Ananya Panday: ప్రియాంక చోప్రా తర్వాత అనన్య పాండే చిక్ వింబుల్డన్ స్టైల్- అందంగా ఉండననే నిజం చెప్పడానికే అన్న లైగర్ భామ!

Ananya Panday Wimbledon 2026: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్‌లో లైగర్ హీరోయిన్ అనన్య పాండే సందడి చేశారు. వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా తర్వాత పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో హాట్ రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు అనన్య పాండే.

Published on: Jul 11, 2026, 10:45:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ananya Panday Wimbledon 2026: లండన్‌లోని ప్రతిష్టాత్మక 'ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్' (AELTC) వేదికగా జరుగుతున్న వింబుల్డన్ 2026 టోర్నమెంట్ టెన్నిస్ ప్రియులనే కాకుండా అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచాన్ని సైతం ఆకర్షిస్తోంది.

ప్రియాంక చోప్రా తర్వాత అనన్య పాండే చిక్ వింబుల్డన్ స్టైల్- అందంగా ఉండననే నిజం చెప్పడానికే అన్న లైగర్ భామ!
ప్రియాంక చోప్రా తర్వాత అనన్య పాండే చిక్ వింబుల్డన్ స్టైల్- అందంగా ఉండననే నిజం చెప్పడానికే అన్న లైగర్ భామ!

ప్రియాంక తర్వాత అనన్య

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గ్లామరస్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే, బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే వింబుల్డన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగు దుస్తుల్లో కోర్టులో అడుగుపెట్టిన లైగర్ బ్యూటీ అనన్య పాండే తన స్టైలిష్ లుక్‌తో అందరి చూపు తనవైపే తిప్పుకున్నారు.

రెడ్ డ్రెస్‌లో మెరిసిన గ్లామర్ డాల్

ఈ టెన్నిస్ మ్యాచ్ కోసం అనన్య పాండే ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ 'రాల్ఫ్ లారెన్' రూపొందించిన మారిగోట్ కాటన్-బ్లెండ్ పాప్లిన్ డే డ్రెస్‌ను ధరించారు. పెద్దగా నగలు లేకుండా సింపుల్ లుక్‌తో, చేతిలో ప్రఖ్యాత 'చానెల్' (Chanel) బ్యాగ్‌తో క్లాసిక్‌గా కనిపించారు. అనన్య పాండేకు సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇటీవల ప్యారిస్ హాట్ కోచర్ వీక్‌లో చానెల్ ఫ్యాషన్ ప్రెజెంటేషన్‌లో పాల్గొన్న కొద్ది రోజులకే అనన్య లండన్ వింబుల్డన్ కోర్టులో ప్రత్యక్షమవడం విశేషం. భారతదేశం నుంచి 'చానెల్' బ్రాండ్‌కు మొట్టమొదటి అధికారిక అంబాసిడర్‌గా అనన్య పాండే రికార్డు సృష్టించారు.

వింబుల్డన్ వేదికగా భారతీయుల సందడి

ఈ ఏడాది వింబుల్డన్ టోర్నమెంట్‌లో భారతీయ సినీ నటీనటుల సందడి గట్టిగానే కనిపిస్తోంది. అనన్య పాండే కంటే ముందు ప్రియాంక చోప్రా జోనాస్, లారా దత్తా, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల, ఆయేషా ఖాన్, కళ్యాణి ప్రియదర్శన్ వంటి తారలు ఇక్కడ మ్యాచ్‌లు వీక్షిస్తూ కెమెరాల కంటికి చిక్కారు.

కోకో గాఫ్, కరోలినా ముచోవా మధ్య జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ప్రియాంక చోప్రా హాజరయ్యారు. బేజ్ కలర్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో మెరిసిన ప్రియాంక.. ప్రఖ్యాత రాయల్ బాక్స్‌లో 'వికెడ్' మూవీ స్టార్ సింథియా ఎరివోను కలిసి ముచ్చటించారు.

సక్సెస్ కానీ అనన్య సినిమాలు

అనన్య పాండే సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది మే 22న ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన 'చాంద్ మేరా దిల్' రొమాంటిక్ డ్రామాలో ఆమె నటించారు. వివేక్ సోని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో లక్ష్ లాల్వానీతో కలిసి కాలేజీ లవర్స్ పాత్రలో కనిపించారు.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికంటే ముందు వచ్చిన 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. వరుస పరాజయాలపై తాజాగా పీటీఐ (PTI) వార్తా సంస్థతో అనన్య మాట్లాడారు.

సినిమాల ఫలితాలపై అనన్య వ్యాఖ్యలు

"ప్రతి సినిమాకు ఒక విధి, సొంత ప్రయాణం ఉంటాయి. బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా మా నటనకు, ఈ సినిమా సంగీతానికి ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ దక్కింది. సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి, జనాలు వాటిని చూస్తూనే ఉంటారు" అని అనన్య పాండే పేర్కొన్నారు.

కెమెరాల వెనుక, స్క్రీన్ పైన మహిళలపై నిరంతరం ఉండే నిఘా, ట్రోలింగ్‌పై కూడా ఆమె స్పందించారు. "ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న ప్రక్రియ. నేను ఏదో ఒక మాట చేబితే పరిస్థితులు మారిపోవు. కానీ నా పరిధిలో నేను చేయగలిగింది చేస్తున్నాను" అని అనన్య అన్నారు.

అందంగా ఉండననే నిజం చెప్పడానికే ఆ ఫొటోలు

"ఎప్పుడు, ఎక్కడ ఎలా తయారవ్వాలో నాకు తెలుసు. షూటింగ్‌లు లేదా బ్యూటీ ఈవెంట్లు ఉన్నప్పుడు గ్లామరస్‌గా మేకప్‌తో కనిపిస్తాను. కానీ, సాధారణ సమయంలో నేను చాలా సహజంగా ఉండటానికే ఇష్టపడతాను. నేను నిద్ర లేవగానే ఇంత అందంగా ఉండననే నిజాన్ని అందరికీ చూపించడానికి మేకప్ లేని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తాను. నేను చేయగలిగిన బెస్ట్ ఇదే" అని అనన్య పాండే చెప్పుకొచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More