Priyanka Chopra: బికినీలో ప్రియాంక చోప్రా బోల్డ్ ఫొటోలు- వారణాసికి వీకెండ్ బ్రేక్- పక్కాగా ముగిసింది, నేను రెడీ అంటూ!
Priyanka Chopra In Black Bikini Over Varanasi Weekend Break: ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి షూటింగ్‌తో బిజీగా ఉన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేసింది. బ్లాక్ బికీనీలో ప్రియాంక చోప్రా షేర్ చేసిన బోల్డ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
Priyanka Chopra In Black Bikini Over Varanasi Weekend Break: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 'వారణాసి' కోసం సినిమా ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.

వారణాసికి వీకెండ్ బ్రేక్
ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నిరంతర షూటింగ్ షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్న ప్రియాంక చోప్రా తాజాగా దొరికిన కాస్త వీకెండ్ బ్రేక్‌ను తనదైన శైలిలో ఆస్వాదించింది. ఆదివారం (మే 31) పూల్ సైడ్ దిగిన ప్రియాంక చోప్రా హాట్ అండ్ బోల్డ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
బ్లాక్ బికీనీలో 'ఎగ్జోటిక్' వైబ్స్
ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీకెండ్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ బికీనీ ధరించి స్విమ్మింగ్ పూల్ ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలతో పాటు, నీటిలో మునిగి పైకి లేస్తూ జుట్టును వెనక్కి విసిరిన ఒక పవర్‌ఫుల్ మెర్మైడ్ (సాగర కన్య) హెయిర్ ఫ్లిప్ వీడియోను ప్రియాంక చోప్రా పోస్ట్ చేసింది.
సమ్మర్.. నేను రెడీ
రాత్రి వేళ వెలుగుతున్న చందమామ, ముఖానికి షీట్ మాస్క్ వేసుకుని చర్మాన్ని సంరక్షించుకుంటున్న మరికొన్ని ప్రియాంక చోప్రా ఫొటోలను కూడా ఇందులో జత చేసింది ఈ ముద్దుగుమ్మ. "ఆదివారం పక్కాగా ముగిసింది.. ఇక సమ్మర్, నేను రెడీ" అంటూ ప్రియాంక ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 2013లో అంతర్జాతీయ రాపర్ పిట్‌బుల్‌తో కలిసి ప్రియాంక చేసిన సూపర్ హిట్ ఆల్బమ్ 'ఎగ్జోటిక్' (Exotic) జ్ఞాపకాలను ఈ లుక్ మళ్లీ గుర్తుచేస్తోందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అప్పట్లో ఈ సాంగ్ బిల్‌బోర్డ్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.
రాజమౌళి ‘వారణాసి’ విశేషాలు
దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రియాంక చోప్రా ఇండియన్ స్క్రీన్ పైకి పునరాగమనం చేస్తోన్న చిత్రం వారణాసి కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను దాదాపు రూ. 1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది.
ఇటీవల విడుదలైన వారణాసి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రియాంక చోప్రా సాంప్రదాయ చీర కట్టులోనే చేతిలో తుపాకులు పట్టుకుని రౌడీలను ఎదిరిస్తున్న మాస్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో అలరించేందుకు రెడీగా ఉన్నారు.
మహేశ్ బాబుతో అదిరిపోయే డ్యాన్స్.. రాముడి అవతారం!
వారణాసి సినిమా గురించి డైరెక్టర్ రాజమౌళి ఇటీవల కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్‌లో ఒక ఊరమాస్ డ్యాన్స్ సీక్వెన్స్ ఉంటుందని ఆయన వెల్లడించారు.
కథలో వచ్చే ఒక కీలక సన్నివేశంలో మహేశ్ బాబు శ్రీరాముడి అవతారంలో కనిపించనున్నట్లు చెప్పి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుపుకుంటున్న వారణాసి సినిమా 2027 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. రాజమౌళి 'వారణాసి' సినిమాలో ప్రియాంక చోప్రా పాత్ర ఏమిటి?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'వారణాసి' సినిమాలో ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఆమె చీరకట్టులో చేతిలో గన్స్ పట్టుకుని యాక్షన్ సీన్లలో కనిపించనుంది.
2. 'వారణాసి' సినిమాలో మహేష్ బాబు ఎలా కనిపించనున్నారు?
ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన హీరోగా నటిస్తుండగా, కథలోని ఒక ప్రత్యేకమైన సన్నివేశంలో ఆయన శ్రీరాముడి అవతారంలో కనిపిస్తారని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.
3. ప్రియాంక చోప్రా తాజా సోషల్ మీడియా పోస్ట్‌పై ఫ్యాన్స్ ఎందుకు 'ఎగ్జోటిక్' అని కామెంట్ చేస్తున్నారు?
ఆదివారం ప్రియాంక షేర్ చేసిన బ్లాక్ బికీనీ పూల్ ఫొటోలు, ఆమె 2013 నాటి ప్రసిద్ధ అంతర్జాతీయ మ్యూజిక్ ఆల్బమ్ 'ఎగ్జోటిక్' (Exotic) నాటి గ్లామరస్ లుక్‌ను గుర్తుచేయడంతో ఫ్యాన్స్ ఆ పాటను ప్రస్తావిస్తున్నారు.
4. 'వారణాసి' సినిమా బడ్జెట్ ఎంత, ఎప్పుడు విడుదల కానుంది?
టైమ్ ట్రావెల్ హై-యాక్షన్ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సినిమాను దాదాపు ₹1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


