Balakrishna: క్యాన్సర్ చిన్నారులతో నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్.. 22న బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకలు

Balakrishna: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 22న రజతోత్సవాల ముగింపు సభను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆసుపత్రి ఛైర్మన్, హీరో నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

Published on: Jun 10, 2026, 16:24:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Balakrishna: సేవా దృక్పథంతో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ (BIACH&RI) 25 వసంతాలు (రజతోత్సవం) పూర్తి చేసుకుంది. ఈ రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జూన్ 22 (సోమవారం) సాయంత్రం హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్‌లో చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈరోజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

Balakrishna: క్యాన్సర్ చిన్నారులతో నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్.. 22న బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకలు
Balakrishna: క్యాన్సర్ చిన్నారులతో నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్.. 22న బసవతారకం సిల్వర్ జూబ్లీ వేడుకలు

చిన్నారుల మధ్య బర్త్‌డే వేడుకలు..

మీడియా సమావేశానికి ముందు హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకలలో బాలకృష్ణ పాల్గొన్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి, వాళ్లకు బొమ్మలు, ఇతర బహుమతులు పంచిపెట్టారు.

తనకు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేసేలా దేవుడు తనకు శక్తినివ్వాలని ఆయన కోరుకున్నారు.

రజతోత్సవాలకు వీవీఐపీ గెస్ట్‌లు

2000 సంవత్సరంలో మొదలైన ఈ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం ఆశయాల సాధన దిశగా సాగుతోందని బాలయ్య గుర్తుచేశారు. ఈ నెల 22న జరిగే రజతోత్సవ ముగింపు వేడుకలకు దేశం నలుమూలల నుంచి అతిరథ మహారథులు హాజరుకాబోతున్నారు.

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రానున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు.. విరాళాల వెల్లువ

గడిచిన 25 ఏళ్ల కాలాన్ని గుర్తుచేసుకున్న బాలకృష్ణ.. భవిష్యత్తులో హైదరాబాద్ హాస్పిటల్ ఆవరణలో కొత్తగా నిర్మించనున్న 'నార్త్ బ్లాక్', అలాగే ఏపీ రాజధాని అమరావతిలోని తూళ్లూరులో కట్టబోయే హాస్పిటల్ పనులను అనుకున్న గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ బర్త్‌డే సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సీతారామరాజు లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వగా.. త్రివేణి, కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు క్యాన్సర్ రోగుల సహాయార్థం తాము సేకరించిన రూ. 1,01,116 లను బాలకృష్ణకు అందజేశారు.

అమరావతిలో నిర్మించబోయే ఆసుపత్రి కోసం కాకర్ల రాఘవేంద్రరావు ఏకంగా పది లక్షల రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు. చిన్న వయసులోనే సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన విద్యార్థులను బాలయ్య ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

People Also Ask (FAQs)

బసవతారకం హాస్పిటల్ రజతోత్సవ సభ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

జూన్ 22న సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్ (Novotel) హోటల్‌లో ఈ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి.

ఈ వేడుకలకు హాజరవుతున్న ముఖ్య అతిథులు ఎవరు?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పీ. నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

బాలకృష్ణ తన పుట్టినరోజును ఎలా జరుపుకున్నారు?

బసవతారకం హాస్పిటల్‌లో క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి, వాళ్లకు బొమ్మలు పంచిపెట్టి బాలకృష్ణ తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు.

బసవతారకం ఆసుపత్రి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి?

హైదరాబాద్‌లోని ప్రెజెంట్ క్యాంపస్ లో కొత్తగా నార్త్ బ్లాక్ నిర్మించడంతో పాటు, ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో కొత్త ఆసుపత్రిని నిర్మించబోతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More