Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా- నడిచే మేకప్ దుకాణం, ఆ హీరోయిన్‌కు అప్డేటెడ్ వెర్షన్ అంటూ కామెంట్స్!

Urvashi Rautela In INCA Look Trolling: ముంబైలో జరిగిన అవార్డు వేడుకలో ఊర్వశి రౌటేలా వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఊర్వశి ఫ్యాషన్ సెన్స్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ మరో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీతో పోలుస్తున్నారు. ఊర్వశి లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 18, 2026, 05:52:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Urvashi Rautela In INCA Look Trolling: ముంబై నగరంలో ఇటీవల జరిగిన ఐఎన్‌సీఏ (ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ) అవార్డుల వేడుక సినీ తారల సందడితో కళకళలాడింది. ఈ వేడుకలో బాలీవుడ్ దిగ్గజం రేఖతో పాటు నిర్మాత కరణ్ జోహార్, యానిమల్ విలన్ బాబీ డియోల్, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియా శరన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా- నడిచే మేకప్ దుకాణం, ఆ హీరోయిన్‌కు అప్డేటెడ్ వెర్షన్ అంటూ కామెంట్స్!
బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా- నడిచే మేకప్ దుకాణం, ఆ హీరోయిన్‌కు అప్డేటెడ్ వెర్షన్ అంటూ కామెంట్స్!

అలాగే సౌత్ నుంచి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా ఈ వేడుకలో నిలిచారు. అందరూ తమ ఫ్యాషన్ గేమ్‌తో మెరిసిపోతుంటే, బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మాత్రం తన వింత డ్రెస్సింగ్ స్టైల్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలనే ఊర్వశి ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టి విమర్శలకు దారితీసింది.

ఊర్వశి వేసుకున్న ఆ డ్రెస్ విశేషాలేంటి?

ఇండియన్ నేషనల్ సినీ అవార్డ్స్ 2026 ఈవెంట్ కోసం ఊర్వశి రౌటేలా ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ మిక్స్ అయిన లెహంగాను ఎంచుకున్నారు. పింక్ కలర్ చోళీ, మెటాలిక్ టచ్ ఉన్న క్రాప్ బ్లౌజ్ ఆమెకు బోల్డ్ లుక్ ఇచ్చాయి. సిల్వర్ వర్క్, మిర్రర్ ఎంబెల్లిష్‌మెంట్స్‌తో మెరిసిపోతున్న లెహంగా స్కార్ట్ ధరించి రెడ్ కార్పెట్‌పై ఊర్వశి వాక్ చేశారు. అయితే, హెవీ మేకప్, హైలైట్ చేసిన చీక్స్, షీర్ నెట్ దుపట్టాతో ఊర్వశి లుక్ చాలా గ్రాండ్‌గా కనిపించినప్పటికీ, అది అతిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘మేకప్ దుకాణం.. రాఖీ సావంత్ వెర్షన్’ అంటూ సెటైర్లు

ఊర్వశి రౌటేలా లుక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతూ ట్రోలింగ్ మొదలెట్టేశారు. ఊర్వశి రౌటేలా ఒక ప్లాస్టిక్ బొమ్మలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. "అసలు ఈమె ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉందా?" అని ఒకరు ప్రశ్నిస్తే.. "డ్రెస్ కోసం శ్వాస ఎంతసేపు బిగబట్టి ఉంచుతావు తల్లీ" అంటూ మరొకరు ఎద్దేవా చేశారు.

ఇక కొందరైతే ఏకంగా "ఈమె హీరోయిన్ రాఖీ సావంత్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌లా ఉంది.. ఇదొక నడిచే మేకప్ దుకాణం" అంటూ ఘాటుగా స్పందించారు. నెటిజన్ల కామెంట్లతో ఊర్వశి రౌటేలాకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ వదిలి టాలీవుడ్ బాటలో..

బాలీవుడ్‌లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌటేలాకి అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. దీంతో ఊర్వశి ప్రస్తుతం సౌత్ సినిమాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్, స్పెషల్ అప్పీరెన్స్‌లతో ఇక్కడ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఊర్వశి.

నందమూరి బాలకృష్ణ-బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'డాకు మహారాజ్'లో కూడా ఊర్వశి రౌటేలా ఓ కీలక పాత్రతోపాటు స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. ఉత్తరాది కంటే సౌత్ సినిమాలోతనే ఎక్కువగా బిజీ అవుతోంది ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More