Dhyan Vijay: సీఎం విజయ్‌పై మరోసారి మలయాళ హీరో సైటెర్లు- అవన్నీ ఇక్కడ చేస్తే పరువు తక్కువగా ఉంటుందన్న ధ్యాన్ శ్రీనివాసన్
Dhyan Sreenivasan Satires On CM Vijay Again: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్‌ను ఉద్దేశించి మలయాళ హీరో ధ్యాన్ శ్రీనివాసన్ వరుసగా చేసిన సెటైర్లు దుమారం రేపుతున్నాయి. తాజాగా మరోసారి విజయ్‌లా చేస్తే ఇక్కడ పరువు తక్కువగా ఉంటుందని ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Dhyan Sreenivasan Satires On CM Vijay Again: మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతోనే కాకుండా, అంతకంటే మిన్నగా తన వివాదాస్పద, హాస్యభరిత ఇంటర్వ్యూలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో ధ్యాన్ శ్రీనివాసన్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ధ్యాన్ శ్రీనివాసన్ మరోసారి కోలీవుడ్ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను టార్గెట్ చేస్తూ వరుస వేదికపై సెటైర్లు వేశారు.

కేరళకు కాబోయే సీఎం
కేరళకు కాబోయే ముఖ్యమంత్రిని నేనేనంటూ ఒక అవార్డుల వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి రావడం, ముఖ్యమంత్రి కావడం వంటి పరిణామాలు సౌత్ ఇండియాలోనే పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రానికి చెందిన హీరో ధ్యాన్ బహిరంగ వేదికలపై సీఎం విజయ్ శైలిని అనుకరిస్తూ జోకులు పేల్చడం గమనార్హం.
ఆ వేదికపై విజయ్ డైలాగ్‌తో రచ్చ
ఇటీవల జరిగిన 'స్టార్ అండ్ సక్సెస్ అవార్డ్స్' వేడుకలో ధ్యాన్ శ్రీనివాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ఆయనను వేదికపై ప్రశ్నిస్తూ.. కేరళకు సీఎం అయితే మొదట ఏం చేస్తారని అడిగారు. "నేను మొదట 'అమ్మ' (AMMA - మలయాళ నటీనటుల సంఘం) అధ్యక్షుడిని కావాలని చూస్తున్నాను. ఆ తర్వాతే సీఎం కుర్చీపై కూర్చుంటాను" అని ధ్యాన్ శ్రీనివాసన్ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు.
అంతటితో ఆగకుండా విజయ్ రాజకీయ ఎంట్రీని ఉద్దేశిస్తూ.. "మొదట ప్రెసిడెంట్ అయ్యాక.. ఒక 13 ఏళ్ల తర్వాత.. 'జోసెఫ్ విజయ్ అను నేను..' అంటూ ప్రమాణస్వీకారం చేస్తాను" అని విజయ్ శైలిని అనుకరిస్తూ డైలాగ్ కొట్టడంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు.
జైల్లో తిండిపై కౌంటర్లు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్.. జైళ్లలో ఖైదీలకు సాధారణ ఆహారం, పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించిన విషయాన్ని హోస్ట్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. మరి మీరు సీఎం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అడగ్గా.. "నేను విజయ్ చేసిన పనులన్నీ బ్లైండ్‌గా కాపీ కొట్టను. ఇక్కడ అవన్నీ చేస్తే చాలా పరువు తక్కువగా ఉంటుంది" అని ధ్యాన్ శ్రీనివాసన్ కౌంటర్ ఇచ్చారు.
త్రిష ఎమోషనల్ సీన్‌పై సెటైర్లు
కొద్దిరోజుల వ్యవధిలోనే విజయ్‌ను ఉద్దేశించి ధ్యాన్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ల సమయంలోనూ ధ్యాన్ శ్రీనివాసన్.. తమిళ సీఎం విజయ్, హీరోయిన్ త్రిషలపై ఇదివరకు క్రేజీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో నటి త్రిష మొదటి వరుసలో కూర్చుని భావోద్వేగానికి గురవడం వైరల్‌గా మారింది. దీనిని గుర్తుచేస్తూ తన కో-స్టార్ నవ్య నాయర్‌పై ధ్యాన్ శ్రీనివాసన్ జోకులు వేశారు.
చీర కట్టుకుని కళ్లల్లో నీళ్లతో
"మేము చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్నాం. నవ్యకు పెళ్లయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినప్పటికీ, నేను కేరళ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు నవ్య నాయర్ చీర కట్టుకుని, కళ్లల్లో నీళ్లతో మొదటి వరుసలో కూర్చోవాలని ఆశిస్తున్నాను" అని ధ్యాన్ సరదాగా వ్యాఖ్యానించారు.
సీఎం కాకముందే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్ తనను సేవా కార్యక్రమాలు చేయమని అడుగుతున్నాడని ధ్యాన్ నవ్వేశారు. ఆ తర్వాత విజయ్‌కు నేరుగా క్షమాపణలు చెబుతూ.. "ఒక విషయం మాత్రం క్లియర్. నేనిక తమిళనాడులో ఇక కాలు పెట్టలేను. నా ప్రియమైన సీఎం విజయ్ సార్.. నా స్నేహితుడికి పిచ్చి పట్టింది, నన్ను క్షమించండి" అని తమిళంలో 'నన్బన్' అంటూ వేడుకున్నారు అజు వర్గీస్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


