OTT Movies: ఓటీటీలోకి వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేష్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీ నాయుడు.. ఒకేరోజున ఓటీటీ స్ట్రీమింగ్!
Korean Kanakaraju OTT DC OTT GD Naidu OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేష్ కనగరాజు డీసీ, ఆర్ మాధవన్ జీడీ నాయుడు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది. మరి ఈ మూడు సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఏ ఓటీటీల్లో రిలీజ్ అవనున్నాయనే వివరాలపై లుక్కేద్దాం.
Korean Kanakaraju OTT DC OTT GD Naidu OTT Release Platforms: థియేటర్లలోకి నిన్న (ఆగస్ట్ 7) మూడు క్రేజీ సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. ఇప్పుడు వాటి ఓటీటీలోకి రానున్నాయనే వార్త ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆ సినిమాలే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన డీసీ, ఆర్ మాధవన్ జీడీ నాయుడు సినిమాలు. ఈ మూడు సినిమాలు థియేటర్లలో ఆగస్ట్ 7న విడుదలైన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. మరి డిఫరెంట్ జోనర్లలో వచ్చిన ఈ 3 సినిమాల ఓటీటీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య కామెడీ అదిరిపోయిందని టాక్ వస్తోంది.
రాయలసీమలోని ఓ గ్రామానికి చెందిన కనకరాజు అనే యువకుడికి కొరియన్ దెయ్యం పడితే ఎలా ఉంటుందనే కథతో తెరకెక్కింది. కొరియన్ కనకరాజు ఓటీటీ రైట్స్ సినిమా రిలీజ్‌కు ముందే అమ్ముడుపోయాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 26 కోట్లు పెట్టి కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. కాబట్టి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే కొరియన్ కనకరాజు రిలీజ్ కానుందని తెలుస్తోంది.
మాధవన్ 'జీడీ నాయుడు' బయోపిక్
భారతదేశపు ఎడిసన్‌గా పేరుగాంచిన ప్రముఖ ఆవిష్కర్త, ఇంజనీర్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (జీడీ నాయుడు) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ సినిమానే జీడీ నాయుడు. ప్రియమణి, దుషారా విజయన్, జయరాం, సత్యరాజ్, యోగిబాబు తదితరులు నటించిన ఈ సినిమాకు కృష్ణకుమార్ దర్శకత్వం వహించారు.
భారతదేశపు తొలి ఇండిజిజన్ మోటార్‌ను తయారు చేసిన లెజెండరీ ఇన్వెంటర్ జీడీ నాయుడు బయోపిక్. ఏవిధమైన ఉన్నత విద్య లేకుండానే కేవలం స్వీయ ప్రతిభతో ఎన్నో యంత్రాలు, ఎలక్ట్రిక్ పరికరాలను కనిపెట్టిన ఆయన జీవితంలోని గెలుపోటములు, బ్రిటిష్ పాలనా కాలంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపించారు.
జీడీ నాయుడు ఓటీటీ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసుకుంది. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే ఆర్ మాధవన్ జీడీ నాయుడు ఓటీటీ రిలీజ్ అవనుందని సమాచారం.
లోకేష్ కనగరాజ్ 'డీసీ'
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. అలాంటి ఈ డైరెక్టర్ హీరోగా మారిన సినిమానే డీసీ. డీసీ అంటే దాస్, చంద్ర అని సినిమాలోని పాత్రల పేరుతో పెట్టిన టైటిల్. దాస్‌గా లోకేష్ నటిస్తే.. చంద్రగా బ్యూటిఫుల్ హీరోయిన్ వామికా గబ్బి చేసింది.
మరో హీరోయిన్‌గా సంజన కృష్ణమూర్తి నటించింది. డీసీ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. రా అండ్ రస్టిక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు అరుణ్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఓ గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరుగుతుంది.
ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి డీసీ ఓటీటీ హక్కులను సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. కాబట్టి సన్ నెక్ట్స్ ఓటీటీలో లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన ఈ డీసీ మూవీ ప్రీమియర్ అవనుంది. అలాగే, డీసీ శాటిలైట్ రైట్స్‌ను సన్ టీవీ నెట్‌వర్క్ దక్కించుకుందని తెలుస్తోంది.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
అయితే, కొరియన్ కనకరాజు, జీడీ నాయుడు, డీసీ ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ 4 ఒక్కరోజునే ఓటీటీ రిలీజ్ కానున్నాయని సమాచారం. అది కూడా తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
కానీ, ఈ సినిమాలకు వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్, టాక్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఓటీటీలోకి వచ్చే వరకు ఎదురుచూడటం కంటే థియేటర్లలోనే ఈ సినిమాలను ఎక్స్‌పీరియెన్స్ చేయడం ఉత్తమమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


