OTT: ఓటీటీలోకి సునీల్, లోకేష్ కనగరాజ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- నిజం ఏనుగుతో ఫైట్- 8.2 రేటింగ్- ఇక్కడ చూడండి!

Sunil Kattalan OTT Streaming: సునీల్, లోకేష్ కనగరాజ్ కీలక పాత్రల్లో ఆంటోనీ వర్గీస్ నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా నిజమైన ఏనుగుతో రియల్‌గా యాక్షన్ సీన్స్ తీసిన కాటాలన్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 2, 2026, 18:12:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sunil Kattalan OTT Release: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే వైవిధ్యమైన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్లకు తెలుగునాట ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అలాంటిది తెలుగు స్టార్ కమెడియన్, నటుడు, హీరో సునీల్, మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటించిన సినిమా ఓటీటీలోకి వస్తుందంటే మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది.

ఓటీటీలోకి సునీల్, లోకేష్ కనగరాజ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- నిజం ఏనుగుతో ఫైట్- 8.2 రేటింగ్- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి సునీల్, లోకేష్ కనగరాజ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- నిజం ఏనుగుతో ఫైట్- 8.2 రేటింగ్- ఇక్కడ చూడండి!

ఓటీటీలోకి కాటాలన్

ఆ సినిమానే 'కాటాలన్' (Kattalan). సూపర్ హిట్ 'ఆర్‌డీఎక్స్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన మలయాళ యాక్షన్ హీరో ఆంటోనీ వర్గీస్ (పెపే) నటించిన తాజా యాక్షన్ డ్రామానే ఈ కాటాలన్. మే 28న థియేటర్లలో విడుదలై రఫ్‌ అండ్ టఫ్ యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను మెప్పించిన కాటాలన్ ఓటీటీలోకి వచ్చేయనుంది.

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో తమిళ, తెలుగు నటులు కూడా భాగమవ్వడం విశేషం. ప్రముఖ నటి దుషార విజయన్ హీరోయిన్‌గా నటించగా, సునీల్‌తోపాటు బాలీవుడ్ నటుడు కబీర్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. లోకేష్ కనగరాజ్ ప్రత్యేక పాత్రలో మెరిశారు.

వీఎఫ్ఎక్స్ కాదు.. ఒరిజినల్ ఏనుగుతో మైండ్ బ్లాకింగ్ ఫైట్లు!

'కాటాలన్' చిత్రంలో ప్రధాన ఆకర్షణ ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో జంతువులతో ఉండే దృశ్యాలకు గ్రాఫిక్స్ (VFX) ఉపయోగిస్తారు. చిత్ర యూనిట్ మాత్రం ఏకంగా ఒరిజినల్ ఏనుగును ఉపయోగించి చిత్రీకరించడం విశేషం.

థాయ్‌లాండ్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ కెచ్చా ఖంపక్డీ పర్యవేక్షణలో యాక్షన్ సీన్లు తీశారు. "ఈ సినిమాలో కనిపించే ఏనుగు సీన్లు ఏవీ గ్రాఫిక్స్ కావు. అసలైన ఏనుగుతోనే నటీనటులు పోరాట ఘట్టాల్లో పాల్గొన్నారు" అని చిత్ర బృందం స్పష్టం చేసింది.

స్టార్ స్టంట్ కొరియోగ్రాఫర్

కెచ్చా గతంలో 'బాహుబలి 2', 'జవాన్', 'పొన్నియిన్ సెల్వన్ 1', 'బాఘీ 2' వంటి భారీ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. మార్షల్ ఆర్ట్స్ క్లాసిక్ 'ఓంగ్-బాక్ 2' సినిమాలో నటించి మెప్పించిన 'పాంగ్' అనే ప్రసిద్ధ ఏనుగును ఈ సినిమాలో ఉపయోగించడం మరో విశేషం.

కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. సాంకేతిక నిపుణుల సత్తా!

సీజీఐ వాడకుండా సహజ సిద్ధమైన లొకేషన్లలో రియల్ ఏనుగుతో తీసిన పోరాట ఘట్టాలు థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని అందించాయి. సాంకేతిక విభాగంలోనూ ఈ సినిమాకు టాప్ క్లాస్ టీమ్ పనిచేసింది. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఆయనకు ఇది రెండో సినిమా. 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ ఒక ప్రత్యేకమైన పాటను సమకూర్చడం మరో విశేషం. దర్శకుడు పోల్ జార్జ్.. జోబీ వర్గీస్, జెరో జేకబ్‌లతో కలిసి కథ అందించగా, 'బిగ్ బి', 'చార్లీ' వంటి క్లాసిక్ సినిమాలకు మాటలు రాసిన ప్రసిద్ధ రచయిత ఉన్ని ఆర్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చారు.

కాటాలన్ ఐఎమ్‌డీబీ రేటింగ్

ప్రముఖ ఎడిటర్ షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, చంద్రు సెల్వరాజ్, రెణదేవ్ కెమెరామెన్లుగా వ్యవహరించారు. సిద్దిఖ్, జగదీష్, ఆన్సన్ పోల్ వంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రల్లో మెరిసారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా కాటాలన్ ఐఎమ్‌డీబీ వద్ద ఏకంగా 8.2 రేటింగ్ కూడా సంపాదించుకుంది.

కాటాలన్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలాంటి కాటాలన్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ మలయాళ డిజిటల్ సంస్థ మనోరమ మ్యాక్స్ కాటాలన్ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. ఆగస్ట్ 4 నుంచి మనోరమ మ్యాక్స్‌లో కాటాలన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే, మరో రెండు రోజుల్లో కాటాలన్ ఓటీటీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More