18 ఏళ్లకే 2 సార్లు సూసైడ్ ట్రై చేశా, అతని పేరే పెట్టుకున్నా- ఇప్పుడు విశ్వక్ సేన్ గుర్తించారు- రవి బస్రూర్ ఎమోషనల్

మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కేజీఎఫ్ సినిమాతో తెగ క్రేజ్ సంపాదించుకున్నారు. తన బీజీఎమ్‌తో యావత్ సినీ ఆడియెన్స్‌ను అలరించిన రవి బస్రూర్ తాజాగా సంగీతం అందించిన సినిమా కల్ట్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహించిన కల్ట్ టీజర్ ఈవెంట్‌లో తన సూసైడ్ అటెంప్ట్ గురించి రవి బస్రూర్ చెప్పారు.

Published on: Feb 22, 2026, 07:04:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్, మార్కో, జీబ్రా సినిమాలకు ఇచ్చిన సంగీతం, బీజీఎమ్‌తో ఎంతగానో యావత్ సినీ ఆడియెన్స్‌ను మెప్పించారు రవి బస్రూర్.

18 ఏళ్లకే 2 సార్లు సూసైడ్ ట్రై చేశా, అతని పేరే పెట్టుకున్నా- ఇప్పుడు విశ్వక్ సేన్ గుర్తించారు- రవి బస్రూర్ ఎమోషనల్
18 ఏళ్లకే 2 సార్లు సూసైడ్ ట్రై చేశా, అతని పేరే పెట్టుకున్నా- ఇప్పుడు విశ్వక్ సేన్ గుర్తించారు- రవి బస్రూర్ ఎమోషనల్

యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

తాజాగా రవి బస్రూర్ సంగీతం అందించిన తెలుగు యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా కల్ట్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహించిన సినిమానే కల్ట్. తాజాగా ఫిబ్రవరి 21న కల్ట్ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ హైలెట్‌గా నిలిచింది.

కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రవి బస్రూర్‌కు రోలెక్స్ వాచ్‌ను గిఫ్ట్‌గా అందించాడు విశ్వక్ సేన్. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన సంఘనటలను, వేరే వ్యక్తి పేరును తాను పెట్టుకోవడంపై ఎమోషనల్‌గా చెప్పారు రవి బస్రూర్.

రెండుసార్లు సూసైడ్

"నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు నేను రెండుసార్లు సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాను. ఈ లోకం కేవలం డబ్బున్న వాళ్లకోసమే. మనలాంటి వాళ్లకోసం కాదు, అంతా డబ్బు గురించి పరితపిస్తున్నారు, ఈ లైఫ్ వద్దు అనిపించి రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను" రవి బస్రూర్ షాకింగ్ విషయం చెప్పారు.

"అప్పుడు రెండోసారి ఒక వ్యక్తి నన్ను కాపాడారు. అప్పుడు నాకు కీబోర్డ్ కావాలి. నేను పని చేస్తాను నాకు కీబోర్డ్ కావాలని అడిగాను. అన్ని రకాలుగా చాలా మందికి చెప్పాను. కానీ, ఎవరు వినలేదు. ఆ ఒక్క వ్యక్తి మాత్రం నా మాట విన్నారు. ఆ తర్వాత నాకు రూ. 35 వేలు ఇచ్చారు. అతని పేరే రవి. ఇది నా పేరు కాదు" అని తన పేరు వెనుకఅసలు నిజాన్ని బయటపెట్టారు రవి బస్రూర్.

నా ఆత్మను గుర్తించారు

"ఆ రోజు నా పేరును రవిగా మార్చుకున్నా. నా చచ్చేంతవరకు.. నా ఆఖరి ఊపిరి వరకు మీరంతా నన్ను రవి బస్రూర్ అని పిలుస్తారు కదా.. ఆ క్రెడిట్ అంతా అతనికే చెందుతుంది. సెకండ్ నేను విశ్వక్ సేన్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. ఇప్పుడు అతను నన్ను గుర్తించారు. ఈ ఇద్దరిని నేను నా జీవితంలో మర్చిపోను" అని ఎమోషనల్‌గా, సంతోషంగా చెప్పారు రవి బస్రూర్.

"ఎందుకంటే అతను కేవలం రవి బస్రూర్‌ను గుర్తించలేదు. ఆయన నా ప్రయాణాన్ని, నా ఆత్మ (సోల్)ను గుర్తించారు" అని చెబుతూ స్టేజీపై విశ్వక్ సేన్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు రవి బస్రూర్. దానికి విశ్వక్ సేన్ కూడా ముద్దు ఇచ్చారు. తర్వాత విశ్వక్ సేన్, రవి బస్రూర్ ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు.

మీకు ఇల్లు ఉంది..

"నా జీవితకాలం రుణపడి ఉంటా" అని రవి బస్రూర్ అంటే.. "సర్ మీకు హైదరాబాద్‌లో ఇల్లు ఉంది. నా ఇల్లే అది" అని విశ్వక్ సేన్ చెప్పాడు. దానికి సంతోషించిన రవి బస్రూర్ కల్ట్ ఆల్రెడీ ఆడుతుంది. దీని తర్వాత ఇంకా ఆడుతుంది.. మాములుగా ఉండదు.. చూడండి" అని మూవీ గురించి చెప్పారు రవి బస్రూర్. ప్రస్తుతం రవి బస్రూర్ వీడియో, కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More