Comedian: నడిరోడ్డుపై బట్టలు ఉతికి.. భక్తులతో కలిసి నేలపైనే నిద్రపోయిన స్టార్ కమెడియన్.. వైరల్ వీడియో వెనుక అసలు స్టోరీ

Comedian: స్టార్ కమెడియన్ సునీల్ గ్రోవర్ గంగా ఘాట్ లోనే అందరితో కలిసి నేలపై పడుకున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. రిషికేష్ లో అతడు ఇలా కనిపించేసరికి అభిమానులు షాక్ తిన్నారు. వీటి వెనుక కారణమేంటో చూడండి.

Published on: Jun 19, 2026, 15:58:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Comedian: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ యాక్టర్ సునీల్ గ్రోవర్ తన అద్భుతమైన టైమింగ్, సెలబ్రిటీ ఇమిటేషన్లతో కోట్ల మంది ప్రేక్షకులను నవ్వించాడు. 'కపిల్ శర్మ షో'లో డాక్టర్ మషూర్ గులాటిగా లేదా రింకూ భాబీగా ఆయన చేసిన హంగామా బుల్లితెర చరిత్రలోనే ఒక మైల్‌స్టోన్.

Comedian: నడిరోడ్డుపై బట్టలు ఉతికి.. భక్తులతో కలిసి నేలపైనే నిద్రపోయిన స్టార్ కమెడియన్.. వైరల్ వీడియో వెనుక అసలు స్టోరీ
Comedian: నడిరోడ్డుపై బట్టలు ఉతికి.. భక్తులతో కలిసి నేలపైనే నిద్రపోయిన స్టార్ కమెడియన్.. వైరల్ వీడియో వెనుక అసలు స్టోరీ

అయితే ఎప్పుడూ స్క్రీన్ మీద నవ్వులు పూయించే ఈ స్టార్ సెలబ్రిటీ.. తాజాగా సోషల్ మీడియాలో ఒక డిఫరెంట్ వీడియోతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. కోట్లు సంపాదిస్తున్నా కూడా ఎలాంటి అహంకారం లేకుండా, అత్యంత సాధారణ వ్యక్తిలా ఆయన ప్రవర్తించిన తీరు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

భక్తుల మధ్యే గంగా ఘాట్‌లో నిద్ర

సునీల్ గ్రోవర్ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఆయన ఒక గంగా ఘాట్ దగ్గర, రోడ్డు పక్కనే ఇతర సాధారణ భక్తులతో కలిసి నేలపై ఒక సింపుల్ బెడ్‌షీట్ వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. ఎవరో తనను రికార్డ్ చేస్తున్నారనే విషయం కూడా తెలియకుండా ఆయన అంత సామాన్యుడిలా పడుకోవడం విశేషం. ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో 'జై కాల్ మహాకాల్' అనే భక్తిరస గీతాన్ని జోడించిన సునీల్ గ్రోవర్.. దీనికి "తారే జమీన్ పర్" (నేలపై నక్షత్రాలు) అంటూ ఒక అందమైన క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ వీడియో ఎక్కడిది అనే విషయాన్ని సునీల్ గ్రోవర్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, కామెంట్ సెక్షన్‌లో ఫ్యాన్స్ దీనిని క్లియర్ గా గుర్తుపట్టారు. ఇది ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఉన్న ప్రసిద్ధ 'త్రివేణి ఘాట్' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

21 గంటల్లోనే 4.7 మిలియన్ వ్యూస్.. నెటిజన్ల కామెంట్ల వర్షం

ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అప్‌లోడ్ చేసిన కేవలం 21 గంటల్లోనే ఈ క్లిప్ ఏకంగా 4.7 మిలియన్ల వ్యూస్ సాధించి గ్లోబల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. సునీల్ గ్రోవర్ సింప్లిసిటీని చూసి ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఒక యూజర్ స్పందిస్తూ.. "నువ్వు ఇంతలా సాధారణంగా ఉంటావు కాబట్టే జనం నిన్ను అంతలా ప్రేమిస్తారు గులాటి సార్" అని రాయగా.. మరొకరు ఆమిర్ ఖాన్ సినిమా పేరును వాడుకుంటూ "తారే జమీన్ పర్ కాదు గురు.. సితారే జమీన్ పర్ (భూమిపైకి వచ్చిన స్టార్)" అంటూ ప్రశంసించారు.

"మాకు ఉన్నది ఒకటే గుండె.. దాన్ని ఇంకెన్ని సార్లు గెలుచుకుంటావు గురు? ఆ మహాదేవుడు నీకు మరిన్ని అపారమైన విజయాలు ఇవ్వాలి" అంటూ నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

రోడ్డు పక్కన బట్టలు ఉతుకుతూ.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తూ..

సునీల్ గ్రోవర్ ఇలాంటి రియలిస్టిక్ వీడియోలు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన రోడ్డు పక్కన ఉండే ఒక హ్యాండ్ పంప్ దగ్గర కూర్చుని స్వయంగా తన బట్టలు తనే ఉతుక్కుంటూ ఉన్న వీడియోను షేర్ చేసి షాక్ ఇచ్చాడు.

అంతేకాదు మరో వీడియోలో ఒక పల్లెటూరి వాతావరణంలో నేలపై కూర్చుని, సాంప్రదాయ కట్టెల పొయ్యి మీద పిండి కలుపుతూ, రొట్టెలు మంటపై కాలుస్తూ కనిపించాడు. ఆ వీడియోను షేర్ చేస్తూ "ఫ్రెండ్స్, రోటీ ఖా లో" (ఫ్రెండ్స్ రొట్టె తినండి) అంటూ సాదాసీదాగా క్యాప్షన్ పెట్టాడు.

సునీల్ గ్రోవర్ లేటెస్ట్, అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్

సునీల్ గ్రోవర్ రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ అయిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో కనిపించి అలరించాడు. చాలా కాలం తర్వాత కపిల్ శర్మ, కీకు శారదా, కృష్ణ అభిషేక్, అర్చన పూరన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలతో కలిసి ఆయన చేసిన కామెడీ డిజిటల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక వెండితెరపై సునీల్ గ్రోవర్ త్వరలోనే ఒక భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాణంలో, డైరెక్టర్లు అరుణభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ డ్రామా 'వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvan: Force of the Forest) లో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈ క్రేజీ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా లీడ్ రోల్స్ లో నటిస్తుండగా అనూప్ సోని, దుర్గేష్ కుమార్, శ్వేతా తివారీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అదే రోజు బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న 'ఈత' (Eetha) సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ క్లాష్ జరగబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More