Spider Man 4 Collection: వర్కింగ్ డేస్‌లోనూ స్పైడీ బాబు హవా.. ఇండియాలో 400 కోట్ల కలెక్షన్స్ దాటేసిన స్పైడర్ మ్యాన్ 4
Spider Man Brand New Day 8 Days Box Office Collection: టామ్ హాలాండ్ హీరోగా వచ్చిన స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ భారత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వర్కింగ్ డేస్‌లో హవా చాటుతున్న స్పైడర్ మ్యాన్ 4 ఇండియాలో రూ. 400 కోట్లు దాటేసి రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.
Spider Man Brand New Day 8 Days Box Office Collection: హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా 'స్పైడర్ మ్యాన్' అనగానే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం వేరే స్థాయిలో ఉంటుంది.

మొదటి రోజు నుంచే స్పైడీ హవా
అదే నిజమని నిరూపిస్తూ టామ్ హాలండ్ నటించిన లేటెస్ట్ మార్వెల్ చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) భారత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది.
ఎనిమిదో రోజూ చెక్కుచెదరని హవా!
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, స్పైడర్ మ్యాన్ 4 సినిమా ఎనిమిదో రోజున (గురువారం) ఇండియాలో దాదాపు రూ. 14.20 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. బుధవారం (ఆగస్ట్ 5) నాటి వసూళ్లతో పోలిస్తే 17.6 శాతం తగ్గింది. కానీ, వర్కింగ్ డేస్‌లో కూడా ఈ స్థాయిలో హాలీవుడ్ మూవీ కలెక్షన్స్ సాధించడం విశేషం. దీంతో ఎనిమిది రోజుల్లో భారత బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 400.80 కోట్లకు (నెట్ రూ. 334.80 కోట్లు) చేరుకున్నాయి.
ఎనిమిది రోజుల కలెక్షన్ల వివరాలు (నెట్):
మొదటి రోజు: రూ. 60.60 కోట్లు
రెండో రోజు: రూ. 49.35 కోట్లు
మూడో రోజు: రూ. 70.25 కోట్లు
నాలుగో రోజు: రూ. 77.75 కోట్లు
ఐదో రోజు: రూ. 23.80 కోట్లు
ఆరో రోజు: రూ. 21.50 కోట్లు
ఏడో రోజు: రూ. 17.00 కోట్లు
ఎనిమిదో రోజు: రూ. 14.20 కోట్లు
'యానిమల్' రికార్డుల విధ్వంసం
తొలి వారంలోనే రూ. 334.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీ నాలుగో చిత్రం, రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' సాధించిన మొదటి వారపు కలెక్షన్లను (రూ. 301 కోట్లు) సునాయాసంగా దాటేసింది. మన దేశంలో అత్యధిక ఓపెనింగ్ వీక్ సాధించిన చిత్రాల జాబితాలో 'ధురందర్ 2: ది రివెంజ్' (రూ. 636 కోట్లు), 'పఠాన్' (రూ. 351 కోట్లు), 'జవాన్' (రూ. 348 కోట్లు) తర్వాతీ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది.
"కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 300 కోట్ల మార్కును చేరుకుని, భారతదేశంలో వేగంగా ఈ మైలురాయిని దాటిన హాలీవుడ్ చిత్రంగా 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' రికార్డు సృష్టించింది" అని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు.
ప్రాంతీయ భాషల్లోనూ భారీ ఆదరణ!
ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్ వెర్షన్‌కే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కావడం పెద్ద కలిసివచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ, నార్త్ ఇండియాలో హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఐమాక్స్, మల్టీప్లెక్స్ స్క్రీన్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. విడుదలైన ప్రతీ ప్రాంతంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ మార్వెల్ బ్లాక్‌బస్టర్, రాబోయే రెండో వీకెండ్‌లో మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
500 కోట్ల వైపుగా స్పైడర్ మ్యాన్
ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ఇండియాలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా రూ. 500 కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


