విజయనగరంలో హీరోయిన్ రితికా నాయక్ సందడి- గోయాజ్ సిల్వర్ జ్యూవెలరీ షో రూమ్ ప్రారంభం- డ్యాన్స్ చేసిన మిరాయి బ్యూటీ

మిరాయ్ హీరోయిన్ రితికా నాయక్ విజయనగరంలో సందడి చేశారు. గోయాజ్ సిల్వర్ జ్యూవెలరీ షూ రూమ్‌ను రితికా నాయక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి మిరాయ్ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 26, 2026, 13:59:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో హీరోయిన్స్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఒక్క సినిమాతో మంచి ఫామ్‌లోకి వస్తే చాలు బ్రాండింగ్ ప్రమోషన్స్, ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాలతో బిజీ అయిపోతుంటారు. ఇప్పుడు అలాగే ఓ కొత్త హీరోయిన్ బిజీ అయిపోతున్నారు. ఆమెనే రితికా నాయక్.

విజయనగరంలో హీరోయిన్ రితికా నాయక్ సందడి- గోయాజ్ సిల్వర్ జ్యూవెలరీ షో రూమ్ ప్రారంభం- డ్యాన్స్ చేసిన మిరాయి బ్యూటీ
విజయనగరంలో హీరోయిన్ రితికా నాయక్ సందడి- గోయాజ్ సిల్వర్ జ్యూవెలరీ షో రూమ్ ప్రారంభం- డ్యాన్స్ చేసిన మిరాయి బ్యూటీ

మిరాయ్ సినిమాతో

మిరాయి సినిమాలో హీరోయిన్‌గా చేసిన రితికా నాయక్ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అంటూ యూత్‌ను తెగ అట్రాక్ట్ చేశారు. ఒక్క మిరాయితో మంచి క్రేజ్ తెచ్చుకున్న రితికా నాయక్ తాజాగా ఓ జ్యూవెలరీ షోరూమ్‌ను ప్రారంభించారు.

విజయనగరంలో జ్యూవెలరీ షో రూమ్

మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్‌ సిల్వర్‌ జ్యువెలరీ షో రూమ్ విజయనగరం ఎంజీ రోడ్డులోని 21వ స్టోర్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ షోరూమ్‌నే టాలీవుడ్ బ్యూటిఫుల్ రితికా నాయక్ లాంఛనంగా ప్రారంభించారు.

పెద్ద సంఖ్యలో అభిమానులు

ఈ సందర్భంగా హీరోయిన్‌ రితికా నాయక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతేకాకుండా రితికా నాయక్‌తో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

మంచి సిల్వర్ కలెక్షన్స్

అనంతరం షో రూమ్ ఓపెనింగ్ సందర్బంగా జ్యూవెలరీ గురించి రితికా నాయక్ మాట్లాడారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షో రూమ్‌లో మంచి సిల్వర్‌ జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయని మిరాయ్ బయూటీ రితికా నాయక్ అన్నారు.

అద్భుతమైన ఆఫర్స్

ఈ సందర్భంగా గోయాజ్‌ జ్యూవెలరీ ఛైర్మన్ వేములూరి రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "గోయాజ్‌ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 15 వరకు అద్భుతమైన ఆఫర్లను గొప్ప ప్రారంభ ఆఫర్లతో అందిస్తున్నాం" అని తెలిపారు.

మరో 5 జ్యూవెలరీ షోరూమ్స్

"అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్‌ జ్యువెలరీ స్టోర్‌ గోయాజ్‌‌లో వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే త్వరలో దక్షిణ భారత దేశంలో మరో ఐదు జ్యూవెలరీ షో రూమ్‌లు ప్రారంభించనున్నాం" అని వేములూరి రాజేంద్ర కుమార్ వెల్లడించారు.

రితికా నాయక్ డ్యాన్స్

ఇదిలా ఉంటే, రిబ్బన్ కటింగ్, ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి గోయాజ్ జ్యూవెలరీ షోరూమ్‌ను ప్రారంభించిన రితికా నాయక్ అక్కడ అభిమానులతో సందడిగా గడిపారు. అభిమానులతో వైబ్ ఉంది అనే పాటకు డ్యాన్స్ చేస్తూ అందరిని హుషారుపరిచారు రితికా నాయక్. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశ్వక్ సేన్, నాని మూవీలతో

కాగా, మిరాయ్ సినిమా కంటే ముందు రితికా నాయక్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రితికా. అనంతరం హాయ్ నాన్న సినిమాలో నానికి కూతురుగా యాక్ట్ చేసి అట్రాక్ట్ చేసింది రితికా నాయక్.

కమర్షియల్ బ్రాండింగ్స్‌తో

ఇప్పుడు మిరాయ్‌తో మంచి సక్సెస్ అందుకుని హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రితికా నాయక్ కమర్షియల్ బ్రాండింగ్స్‌తో దూసుకుపోతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More