GD Naidu Movie: ఇండియన్ ఎడిసన్ బయోపిక్‌తో మాధవన్- డిఫరెంట్ మేకోవర్- థియేటర్లలో రేపే జీడీ నాయుడు రిలీజ్

R Madhavan GD Naidu Release: భారతీయ ఎడిసన్‌గా పేరుగాంచిన గొప్ప శాస్త్రవేత్త జి.డి.నాయుడు జీవిత కథ ఆధారంగా వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ నటించిన బయోపిక్ చిత్రం 'జీడీ నాయుడు' (GDN). కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది.

Published on: Aug 6, 2026, 14:29:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

R Madhavan GD Naidu Release: కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్. 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రంలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో జీవించి, జాతీయ అవార్డును సైతం ముద్దాడిన ఆయన, ఇప్పుడు మరో మహానాయకుడి జీవిత కథతో వెండితెరపైకి వస్తున్నారు.

ఇండియన్ ఎడిసన్ బయోపిక్‌తో మాధవన్- డిఫరెంట్ మేకోవర్- థియేటర్లలో రేపే జీడీ నాయుడు రిలీజ్
ఇండియన్ ఎడిసన్ బయోపిక్‌తో మాధవన్- డిఫరెంట్ మేకోవర్- థియేటర్లలో రేపే జీడీ నాయుడు రిలీజ్

శాస్త్రవేత్త గోపాల స్వామి దొరైస్వామి బయోపిక్

'ఎడిసన్ ఆఫ్ ఇండియా', 'మిరాకిల్ మేన్', 'వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్' అని పిలుచుకునే ప్రముఖ భారతీయ ఆవిష్కర్త, శాస్త్రవేత్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.నాయుడు) స్ఫూర్తిదాయక జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'జీడీ నాయుడు' (GDN).

వైవిధ్యమైన గెటప్‌లలో మాధవన్ అభినయం

ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించారు. జీడీ నాయుడు జీవితంలోని వివిధ దశలను, ఆయన పడిన శ్రమను, సాధించిన విజయాలను వెండితెరపై ఆవిష్కరించే పాత్రలో మాధవన్ నటించారు.

జీడీ నాయుడు నటీనటులు

ఈ సినిమా కోసం ఆయన వేసుకున్న డిఫరెంట్ మేకోవర్, మేకప్, పీరియాడికల్ సెటప్ అన్నీ అచ్చం ఆ కాలానికి తీసుకెళ్లేలా రూపుదిద్దుకున్నాయి. మాధవన్‌తో పాటు ఈ చిత్రంలో సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ట్రైలర్‌కు విశేష స్పందన.. పెరిగిన అంచనాలు

"భారతీయ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఒక మహానాయకుడి కథను నేటి తరానికి పరిచయం చేయడం ఎంతో గర్వకారణం" అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇటీవల విడుదలైన జీడీ నాయుడు తెలుగు ట్రైలర్‌కు సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

96 మ్యూజిక్ డైరెక్టర్

పక్కా నిర్మాణ విలువలతో, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. '96' చిత్రంతో శ్రోతలను మైమరిపించిన గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని సన్నివేశాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఆగస్ట్ 7న వరల్డ్ వైడ్ రిలీజ్

వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ పిక్చర్స్, మీడియామాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, ఆర్. మాధవన్, సరిత మాధవన్ సంయుక్తంగా జీడీ నాయుడు చిత్రాన్ని నిర్మించారు. భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఈ బయోపిక్ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'జీడీ నాయుడు' (GDN) సినిమా ఎవరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది?

ఈ చిత్రం 'ఇండియన్ ఎడిసన్' అని పిలవబడే ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, కోయంబత్తూర్ ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జీడీ నాయుడు) జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది.

2. 'జీడీ నాయుడు' చిత్రం థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతోంది?

ఈ సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

3. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ఎవరు నటించారు?

వర్సటైల్ నటుడు ఆర్. మాధవన్ జి.డి. నాయుడు పాత్రలో నటించగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

4. ఈ సినిమాకు సంగీతం ఎవరు అందించారు?

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ సంగీతం అందించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More