Rajinikanth Biopic: సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ మూవీ? స్వయంగా తన ఆత్మకథ రాస్తున్న తలైవా- రివీల్ చేసిన కూతురు సౌందర్య
Rajinikanth Biopic Movie Life Story Written: బస్ కండక్టర్ నుంచి ప్రపంచ ప్రసిద్ధ సూపర్ స్టార్ వరకు ఎదిగిన రజనీకాంత్ తన ఆత్మకథను రాస్తున్నారు. ఇప్పుడు ఈ సంచలన జీవిత కథ వెండితెరపై బయోపిక్‌గా రానుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరందుకుంది. మరి రజనీకాంత్ బయోపిక్ మూవీ వివరాలపై ఓ లుక్కేద్దాం.
Rajinikanth Biopic Movie Life Story Written: బెంగళూరు వీధుల్లో బస్ కండక్టర్‌గా ప్రయాణం ప్రారంభించి, దశాబ్దాల పాటు భారతీయ సినీ రంగాన్ని శాసించిన ఏకైక సూపర్ స్టార్ రజనీకాంత్. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్యదైవంగా మారిన తలైవా తన జీవిత కథను ఆత్మకథగా రూపొందిస్తున్నారు.

కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు
ఇప్పుడు ఈ సంచలన ఆత్మకథ ఆధారంగా ఒక భారీ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ చిత్రసీమలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
రజనీకాంత్ ఐకానిక్ సినిమాలు
'పెదరాయుడు', 'ముత్తు', 'బాషా', 'శివాజీ', 'రోబో' నుంచి ఇటీవల వచ్చిన 'జైలర్' వరకు ఆయన ప్రతి సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ జీవితంలో వెలుగుచూడని ఆసక్తికర కోణాలను, ఎదుర్కొన్న సవాళ్లను వెండితెరపై చూడటానికి అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ వరకు..
రజనీకాంత్ స్వయంగా రాస్తున్న ఈ ఆత్మకథలో ఆయన వ్యక్తిగత విషయాలు, సినీ ప్రస్థానంలోని మలుపులు, అధిగమించిన అడ్డంకులను సమగ్రంగా వివరించనున్నారు. ఈ పుస్తకం ఆధారంగా సినిమా తీసే ఆలోచనపై ఆయన ఇప్పటికే తన అత్యంత సన్నిహితులతో చర్చించినట్లు మూవీస్ సింగపూర్ నివేదిక పేర్కొంది.
అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ
అయితే, రజనీకాంత్ బయోపిక్ సినిమాపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రజనీకాంత్ ఆత్మకథ రాస్తున్న విషయాన్ని ఆయన కుమార్తె సౌందర్య ఇదివరకే ధృవీకరించారు.
ఇంటర్వ్యూలో సౌందర్య రజనీకాంత్ కామెంట్స్
"మన ప్రియతమ తలైవా తన కష్టంతో సొంత దారిని ఏర్పరచుకున్నారు. బెంగళూరులో బస్ కండక్టర్‌గా పడిన శ్రమ నుంచి కోలీవుడ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిన వరకు తన జీవిత చరిత్రను ఆయనే స్వయంగా రాయడం ప్రారంభించారు" అని సౌందర్య రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రతి పాత్ర కోసం పడిన కష్టం
ఈ పుస్తకం విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తుందని, ప్రతి పాత్ర కోసం ఆయన పడిన తపన, జీవితంలో పడ్డ కష్టం ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని సౌందర్య వివరించారు. ఐదు దశాబ్దాలకు పైగా విస్తరించిన ఆయన సినీ ప్రస్థానంలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో మరువలేని చిత్రాలు అందించారు.
రజనీకి అత్యున్నత పురస్కారాలు
భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మావిభూషణ్, చలనచిత్ర రంగానికి ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో సత్కరించింది. ఒకవైపు ఆత్మకథ, బయోపిక్ వార్తలు సందడి చేస్తుండగా, మరోవైపు రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
జైలర్ 2, ధర్మన్ సినిమాలతో
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రానున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దీంతో పాటు అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో 'ధర్మన్' అనే మరో ఆసక్తికర చిత్రంలో కూడా రజనీకాంత్ నటిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. రజనీకాంత్ ఆత్మకథను ఎవరు రాస్తున్నారు?
రజనీకాంత్ తన జీవిత చరిత్రను (ఆత్మకథ) స్వయంగా తానే రాస్తున్నారు.
2. రజనీకాంత్ ఆత్మకథ ఆధారంగా బయోపిక్ రానుందా?
ఆయన ఆత్మకథ ఆధారంగా ఒక భారీ చలన చిత్రాన్ని (బయోపిక్) రూపొందించేందుకు ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
3. రజనీకాంత్ తదుపరి చిత్రం 'జైలర్ 2' ఎప్పుడు విడుదలవుతుంది?
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'జైలర్ 2' చిత్రం అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


