Rajinikanth: ఇలాంటి పాత్రలు ఇంకోసారి చేస్తే కొడతాను.. రజనీకాంత్ సినిమాలో నటించిన పంకజ్ త్రిపాఠికి నానా పటేకర్ వార్నింగ్!

Nana Patekar Warning To Pankaj Tripathi: రజనీకాంత్ సినిమాలో పంకజ్ త్రిపాఠి చేసిన ఒక చిన్న పాత్రపై బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ వార్నింగ్ ఇచ్చినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పంకజ్ లాంటి గొప్ప నటుడు భవిష్యత్తులో ఇలాంటివి చేస్తే ఊరుకోనని సరదాగా హెచ్చరించారు. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Published on: Mar 16, 2026, 20:46:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వెండితెరపై కొందరు నటుల మధ్య ఉండే అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్ల మధ్య ఉండే పరస్పర గౌరవం సినిమా స్థాయిని పెంచుతుంది. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్, విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

ఇలాంటి పాత్రలు ఇంకోసారి చేస్తే కొడతాను.. రజనీకాంత్ సినిమాలో నటించిన పంకజ్ త్రిపాఠికి నానా పటేకర్ వార్నింగ్!
ఇలాంటి పాత్రలు ఇంకోసారి చేస్తే కొడతాను.. రజనీకాంత్ సినిమాలో నటించిన పంకజ్ త్రిపాఠికి నానా పటేకర్ వార్నింగ్!

రజనీకాంత్ కాలా మూవీ

2018లో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘కాలా’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి నానా పటేకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

అవినీతిపరుడైన పోలీస్‌గా

కాలా సినిమాలో పంకజ్ త్రిపాఠి ఒక అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా చాలా చిన్న పాత్రలో కనిపిస్తారు. పంకజ్ లాంటి నటుడు అలాంటి 'బ్లింక్ అండ్ మిస్' రోల్‌లో కనిపించడం చూసి నానా పటేకర్ ఆశ్చర్యపోయారట.

ఇక్కడ ఏం చేస్తున్నావ్

"నేను రజనీకాంత్ అన్న (అన్నయ్య)తో కలిసి ‘కాలా’ సినిమా చేస్తున్నాను. అందులో పంకజ్ త్రిపాఠీ ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అతన్ని చూడగానే నాకు షాక్ అనిపించి.. ‘పంకజ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు?’ అని అడిగాను" అని నానా పటేకర్ చెప్పారు.

దానికి పంకజ్ త్రిపాఠి సమాధానమిస్తూ.. "ఒక చిన్న పాత్ర ఉంది సర్" అని చెప్పారట. "నువ్వు ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నావు?" అని నానా ప్రశ్నిస్తే.. "మీరున్నారు, రజనీ అన్నా ఉన్నారు.. మీ అందరితో కలిసి పని చేసే అవకాశం వస్తుందని ఒప్పుకున్నాను సర్" అని పంకజ్ త్రిపాఠి వినయంగా సమాధానమిచ్చారు.

"నువ్వు ఇప్పటికే పెద్ద నటుడివి పంకజ్!"

కానీ, నానా పటేకర్ మాత్రం పంకజ్ ప్రతిభను మెచ్చుకుంటూ ఘాటుగానే స్పందించారు. "నువ్వు ఇప్పటికే చాలా గొప్ప నటుడివి. మాతో కలిసి పని చేయడం వల్ల నువ్వేం పెద్ద నటుడివి అయిపోవు, ఎందుకంటే నువ్వు ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నావు. ఇంకోసారి ఇలాంటి చిన్న చిన్న పాత్రలు చేస్తే మాత్రం నిన్ను కొడతాను జాగ్రత్త!" అని ప్రేమతో కూడిన హెచ్చరిక జారీ చేసినట్లు నానా పటేకర్ వివరించారు.

'కాలా' నుంచి నేటి వరకు..

పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా’ చిత్రంలో రజనీకాంత్ కరికాలన్‌గా అలరిస్తే, నానా పటేకర్ పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించారు. ప్రస్తుతం నానా పటేకర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

రొమాంటిక్ థ్రిల్లర్‌లో

ఇటీవల విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ 'ఓ రోమియో'లో షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రిలతో కలిసి నటించారు. అలాగే అనిల్ కపూర్ 'సుబేదార్'లోనూ అతిథి పాత్రలో మెరిశారు నానా పటేకర్.

నానా పటేకర్ నటనకు ప్రశంసలు

ప్రస్తుతం ప్రకాష్ ఝా తెరకెక్కించిన 'సంకల్ప్' అనే సోషియో-పొలిటికల్ డ్రామా సిరీస్‌లో నానా పటేకర్ నటనకు విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, ప్రతిభ ఉన్న నటులకు సరైన పాత్రలు దక్కాలనే నానా పటేకర్ ఆవేదనలో ఒక సీనియర్ నటుడి పరిణతి కనిపిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More