Madhavan: నా కొడుకు ఫ్రెండ్స్ చూసే సినిమాలు చూసి నాకు పెద్ద భయం పట్టుకుంది, పూర్తిగా దూరమైనట్లు అనిపిస్తోంది: మాధవన్

Actor Madhavan On His Son Vedaant Friends: తెలుగు సీనియర్ హీరో, ధురంధర్ నటుడు ఆర్ మాధవన్ నటించిన సరికొత్త సినిమా జీడీఎన్. బయోపిక్‌గా వస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మాధవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 20 ఏళ్ల తన కొడుకు ఫ్రెండ్స్‌ను గమనించినప్పుడు తనకు పెద్ద భయం పట్టుకుందని మాధవన్ తెలిపారు.

Published on: Jul 18, 2026, 12:37:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actor Madhavan On His Son Vedaant Friends: భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్నా.. లోపల ఒక తెలియని ఆందోళన పరిశ్రమను వేధిస్తోంది. నేటి తరం యువత (జెన్ జీ) భారతీయ చిత్రాలకు క్రమంగా దూరమవుతోందని ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ అభిప్రాయపడ్డారు. తన తాజా బయోపిక్ చిత్రం 'జీడీఎన్' (GDN) ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఇండస్ట్రీ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా కొడుకు ఫ్రెండ్స్ చూసే సినిమాలు చూసి నాకు పెద్ద భయం పట్టుకుంది, పూర్తిగా దూరమైనట్లు అనిపిస్తోంది: మాధవన్
నా కొడుకు ఫ్రెండ్స్ చూసే సినిమాలు చూసి నాకు పెద్ద భయం పట్టుకుంది, పూర్తిగా దూరమైనట్లు అనిపిస్తోంది: మాధవన్

కొరియన్ డ్రామాలు, యానిమే మోజులో జెన్ జీ

ఓటీటీల విప్లవం తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో నేటి యువత ఆలోచనలు, అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. తన 20 ఏళ్ల కొడుకు వేదాంత్‌తో పాటు అతని వయసున్న స్నేహితులను గమనించినప్పుడు తనకు ఒక పెద్ద భయం పట్టుకుందని మాధవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"ఇప్పటివరకు నా కొడుకు దృష్టిలో నేను మంచి గౌరవాన్ని సంపాదించుకున్నాను. కానీ, నేటి తరం యువతను చూస్తే మన సినిమాలకు వారు పూర్తిగా దూరమైనట్లు అనిపిస్తోంది. ఇది పరిశ్రమకు పెద్ద సమస్య. వాళ్లంతా జపనీస్ యానిమే, కొరియన్ కంటెంట్ వైపు వెళ్తున్నారు. థియేటర్లలో మన తమిళ సినిమాలైనా, హిందీ సినిమాలైనా సరే చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు" అని మాధవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

రొటీన్ ఫార్ములా సినిమాలు ఇక సాగవు

కమర్షియల్ సినిమాలను తాను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని, బాక్సాఫీస్ వద్ద అవి ఎలా వర్కవుట్ అవుతాయో తనకు బాగా తెలుసని మాధవన్ స్పష్టం చేశారు. కేవలం హిట్ల కోసం పాత చింతకాయ పచ్చడి లాంటి ఫార్ములా కథలను ఎంచుకుంటే కెరీర్ సాఫీగా సాగిపోవచ్చు కానీ, ఒక నటుడిగా తనకు అది తృప్తిని ఇవ్వదని చెప్పారు.

కాలక్రమేణా నటుడిగా పరిణతి సాధించానని, అందుకే భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలనే ఎంచుకుంటున్నానని వివరించారు. ప్రేక్షకుల అలవాట్లు మారాయని వారిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని మాధవన్ హితవు పలికారు.

ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కథకులు, దర్శకులు, నటులు మరింత స్ఫూర్తిదాయకమైన కథలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. తమిళనాడులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు కనిపిస్తోందని, మరింత బాధ్యతాయుతంగా సినిమాలు తీయాలని పిలుపునిచ్చారు.

ఆగస్టులో 'ఇండియన్ ఎడిసన్' బయోపిక్

మాధవన్ లీడ్ రోల్‌లో నటించిన 'జీడీఎన్' (GDN) చిత్రం కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఆయన్ను మన దేశంలో 'ఇండియన్ ఎడిసన్' అని పిలుస్తారు.

ఎలాంటి అధికారిక ఇంజనీరింగ్ చదువు లేకపోయినా.. భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటారును తయారు చేసిన ఘనత ఆయనది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెజ్ బెంచ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా స్వదేశీ కారును రూపొందించాలని కలలుగన్న ఆయన జీవితం ఎందరికో ఆదర్శం.

జీడీఎన్ రిలీజ్ డేట్

పాన్-ఇండియా లెవెల్‌లో రూపొందిన ఈ బయోపిక్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. గతంలో జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. సరికొత్త షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా జీడీఎన్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More