Korean Kanakaraju Teaser: డ్రాగన్ బొమ్మతో పవర్స్- కొరియన్ భూతంగా వరుణ్ తేజ్- కొరియన్ కనకరాజు టీజర్- ప్రభాస్ ఏమన్నాడంటే?
Prabhas Released Korean Kanakaraju Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సరికొత్త హారర్ కామెడీ యాక్షన్ చిత్రం 'కొరియన్ కనకరాజు' టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prabhas Released Korean Kanakaraju Teaser: టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. ఈసారి అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ జోనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

కొరియన్ కనకరాజు టీజర్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు' (Korean Kanakaraju) టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. ఈ కొరియన్ కనకరాజు టీజర్‌ను రెబల్ స్టార్, పాన్ ఇండియా ఐకాన్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
"కొరియన్ కనకరాజు టీజర్ నాకు బాగా నచ్చింది. వరుణ్ తేజ్ సరికొత్త లుక్‌లో చాలా ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఆగస్టు 7న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో కనకరాజు రచ్చ
దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠను, నవ్వులను రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న పెనుగొండ అనే గ్రామాన్ని వరుణ్ తేజ్ పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది.
అక్కడ ఉండే మంచి మనసున్న ప్రజల గురించి ఆయన ఎంతో కూల్‌గా చెబుతుండగానే.. విజువల్స్ ఒక్కసారిగా కొరియా దేశానికి మారిపోతాయి. దాంతో, "రేయ్ ఎవర్రా అక్కడ? నేను చెప్పేదానికి, మీరు వేసే వీడియోకు అస్సలు సంబంధం లేదు" అంటూ వరుణ్ తేజ్ మార్క్ డైలాగ్‌తో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.
మాస్, అగ్రెసివ్ పాత్రలో
ఇందులో వరుణ్ తేజ్ 'కనకరాజు' అనే మాస్, అగ్రెసివ్ పాత్రలో కనిపిస్తున్నారు. కోపానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ, క్షణాల్లో రగిలిపోయే వ్యక్తిగా ఆయన పాత్రను ఎంతో వినోదాత్మకంగా డిజైన్ చేశారు. మందు కొట్టడానికి ఏ చిన్న కారణం దొరికనా వదిలిపెట్టని కనకరాజు జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది.
'మిరాయి' చిత్రంతో సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ తెచ్చుకున్న రితికా నాయక్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. కొరియా వీసా కోసం ప్రయత్నిస్తూ, కొరియన్ భాషలో ఆమె మాట్లాడే సీన్స్ థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.
డ్రాగన్ శక్తి.. బ్లూ ఐస్ సూపర్ పవర్స్
కనకరాజు తన స్నేహితుడితో కలిసి బార్‌లో కూర్చుని ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్న సమయంలో వారి టేబుల్ పక్కన ఉన్న ఒక పురాతన వాసే (ఫ్లవర్ వాజ్) అకస్మాత్తుగా వెలుగుతుంది. ఆ వాసేపై ఒక వింతైన డ్రాగన్ బొమ్మ చెక్కి ఉంటుంది. ఆ క్షణం నుంచే మన సీమ కనకరాజు జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆయనకు ఊహించని అద్భుత శక్తులు (సూపర్ పవర్స్) వస్తాయి.
కనకరాజు కళ్లు నీలం రంగులోకి మారిపోతాయి. ఎవరైనా 'కొరియా' అనే పదం ఉచ్ఛరిస్తే చాలు, ఆయన ఒక భూతంలా అక్కడ ప్రత్యక్షమవుతాడు. అలా మన ఊరి కనకరాజు కాస్తా 'కొరియన్ కనకరాజు'గా రూపాంతరం చెందుతాడు. ఈ క్రమంలో వచ్చే హారర్, కామెడీ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.
కొరియన్ మాఫియా ట్విస్ట్..
కొరియన్ కనకరాజు టీజర్ చివరలో మేకర్స్ చూపించిన మరో ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరుణ్ తేజ్ ఒక సరికొత్త రగ్గడ్ గెటప్‌లో కనిపిస్తారు. చేతికి మధ్య వేలు లేకుండా, ఒంటి నిండా టాటూలతో, చుట్టూ కొరియన్ గూండాలు ఉండటాన్ని బట్టి చూస్తే ఆయన కొరియన్ మాఫియాతో చేతులు కలిపినట్లు స్పష్టమవుతోంది.
హిలేరియస్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించడంలో దిట్ట అయిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ సరికొత్త కామెడీ టైమింగ్‌ను ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. ప్రముఖ కమెడియన్ సత్య ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ అవుట్ అండ్ అవుట్ నవ్వులు పూయించనున్నారు.
ఆగస్టు 7న విడుదల
ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ స్వరాలు అందిస్తున్నారు. హారర్, యాక్షన్, కామెడీల మేళవింపుగా వస్తున్న ఈ వినూత్న చిత్రాన్ని ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


