Yadu Vamsi: ఓ కథను పట్టుకుని ఏడాది తిరిగా, వర్కౌట్ కాలేదు- వరుణ్ తేజ్ సర్‌ప్రైజ్ చేశారు- డైరెక్టర్ యదు వంశీ కామెంట్స్
Yadu Vamsi On Bhari Movie Story In Pooja Ceremony: చెల్లి నిహారిక కొణిదెల నిర్మాణంలో అన్న వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమా బరి. కమిటీ కుర్రోళ్లు డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బరి పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. ఈవెంట్‌లో డైరెక్టర్ యదు వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిర్మిస్తున్న మరో కొత్త సినిమా బరి. ఈ సినిమాలో తన అన్న, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాకు కమిటీ కుర్రోళ్లు సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహించనున్నారు.

ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్
రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న బరి సినిమా పూజా కార్యక్రమాలను ఇవాళ శనివారం (మార్చి 28) నాడు నిర్వహించారు. బరి సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం
ముహూర్తపు సన్నివేశానికి పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు.
ఏడాది తిరిగా
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ .. "‘కమిటీ కుర్రోళ్లు’ (అవార్డ్ విన్నింగ్ సూపర్ హిట్ మూవీ) తరువాత ఓ కథను పట్టుకుని ఏడాది తిరిగా. అది వర్కౌట్ కాలేదు. మధ్యలో నాకు వాలీబాల్ బ్యాక్ డ్రాప్‌తో ఓ ఐడియా వచ్చింది. కొంత కథ రెడీ చేసుకున్నా" అని అన్నారు.
వాలీబాల్ అనుకోవడంతోనే
"వాలీబాల్ అని అనుకోవడంతోనే నాకు వరుణ్ గారు మైండ్‌లోకి వచ్చారు. అలా కొంత కథ అయ్యాక మళ్లీ తిరిగి నిహారిక వద్దకే వెళ్లాను. ఆమెకు ఈ కథను నెరేట్ చేసి వరుణ్ గారు కావాలని అడిగాను. పూర్తి కథ సిద్దం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని నిహారిక గారు అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను రెడీ చేసి వరుణ్ గారికి వినిపించాం. ఆయనకి కథ చాలా నచ్చింది" అని యుదు వంశీ తెలిపారు.
ఓ గెస్ట్ రాబోతున్నారని
"ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించుతాం. నిన్న రాత్రి నాకు వరుణ్ గారు ఫోన్ చేశారు. ఓ గెస్ట్ రాబోతోన్నారు అని నన్ను సర్‌ప్రైజ్ చేశారు" అని యదు వంశీ చెప్పుకొచ్చారు.
షాక్ అయ్యాను
"పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే నేను షాక్ అయ్యాను. ఈ రోజు ఆయన ఇలా వచ్చి మాలాంటి యంగ్ టీంని ప్రోత్సహించడం, మా వెనుక వరుణ్ గారు, నిహారిక వంటి వారు నిలబడటం చాలా ఆనందంగా ఉంది" అని డైరెక్టర్ యదు వంశీ పేర్కొన్నారు.
పది రెట్లు ప్రభావం చూపేలా
ఇదే ఈవెంట్‌లో సంగీతం దర్శకుడు అనుదీప్ దేవ్ మాట్లాడుతూ .. "‘కమిటీ కుర్రోళ్లు’ కంటే పది రెట్లు ప్రభావం చూపేలా ‘బరి’లోని మ్యూజిక్ ఉంటుంది. వంశీ గారికి కూడా మ్యూజిక్ పట్ల మంచి టేస్ట్ ఉంది. ఈ చిత్రంలోనూ మ్యూజిక్‌కి చాలా స్కోప్ ఉంది. చాలా అద్బుతమైన మ్యూజిక్ రాబోతోంది" అని అన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


