Varun Tej Bhari: చెల్లి ప్రొడ్యూసర్.. బాబాయ్ పవన్ కల్యాణ్ తొలి క్లాప్.. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా బరి ప్రారంభం

Varun Tej Bhari: వరుణ్ తేజ్ కొత్త మూవీ బరి షూటింగ్ శనివారం (మార్చి 28) ప్రారంభమైంది. ఇదో స్పోర్ట్స్ డ్రామా. దీనికి వరుణ్ చెల్లి నిహారిక ప్రొడ్యూసర్ కాగా.. బాబాయ్ పవన్ కళ్యాణ్ తొలి క్లాప్ ఇచ్చి షూటింగ్ మొదలుపెట్టడం విశేషం.

Mar 28, 2026, 10:16:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Varun Tej Bhari: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించబోతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా బరి. ఈ సినిమా లాంచింగ్ శనివారం (మార్చి 28) చాలా గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ పూజా కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ అందించడం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. వరుణ్ పై అతడే తొలి క్లాప్ ఇచ్చాడు.

Varun Tej Bhari: చెల్లి ప్రొడ్యూసర్.. బాబాయ్ పవన్ కల్యాణ్ తొలి క్లాప్.. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా బరి ప్రారంభం
Varun Tej Bhari: చెల్లి ప్రొడ్యూసర్.. బాబాయ్ పవన్ కల్యాణ్ తొలి క్లాప్.. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా బరి ప్రారంభం

బాబాయ్ రాకతో అమాంతం పెరిగిన జోష్..

ఈ మధ్యే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. తాజాగా వరుణ్ తేజ్ సినిమా బరి షూటింగ్ ను క్లాప్ ఇచ్చి ప్రారంభించాడు. ఈ ఈవెంట్‌లో బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయి వరుణ్ తేజ్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాకతో ఈ ప్రాజెక్ట్‌కు స్టార్టింగ్‌లోనే అదిరిపోయే హైప్ వచ్చేసింది.

అన్నయ్య కోసం రంగంలోకి దిగిన నిహారిక..

ఈ సినిమాకు ఉన్న మరో పెద్ద స్పెషాలిటీ ఏంటంటే.. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఒక పక్క యాక్టర్‌గా మెప్పిస్తూనే, మరోపక్క ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి నిహారిక చాలా కష్టపడుతోంది. ఇప్పుడు ఏకంగా తన సొంత అన్నయ్య వరుణ్ తేజ్ కోసం ఆమె ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయడం విశేషం.

అన్నాచెల్లెళ్ల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అటు ఫ్యామిలీ మెంబర్స్‌లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రొడ్యూసర్‌గా నిహారిక కెరీర్‌కు ఈ మూవీ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.

సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న బరి మూవీ

కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుణ్ తేజ్ ఎప్పుడూ రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు ఈ బరి అనే టైటిల్ వింటుంటేనే ఇదొక సాలిడ్ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమాను చాలా గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించడానికి మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.

కమిటీ కుర్రాళ్లు ఫేమ్ యధు వంశీ ఈ బరి సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మూవీ టైటిల్ ను శుక్రవారం (మార్చి 27) అనౌన్స్ చేయగా.. ఇప్పుడు పూజా కార్యక్రమాలతో షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఈ మూవీ పోస్టర్ కూడా ఆసక్తి రేపుతోంది. ఓ ఊళ్లో రసవత్తరంగా సాగుతున్న వాలీబాల్ పోటీలను ఇందులో చూడొచ్చు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు అనే మరో మూవీ షూటింగ్ తోనూ బిజీగా ఉన్నాడు. ఇదో హారర్ కామెడీ సినిమా. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడీ స్పోర్ట్స్ డ్రామాతోనూ వరుణ్ ఆసక్తి రేపుతున్నాడు. మరి ఈ అన్నాచెల్లెళ్లు వరుణ్, నిహారిక కలిసి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More