Ustaad Bhagat Singh Collection: 100 కోట్ల కోసం ఉస్తాద్ భగత్ సింగ్ తిప్పలు- 7వ రోజు అతి తక్కువ వసూల్లు-గట్టెక్కడం కష్టమే!

Ustaad Bhagat Singh Box Office Collection Day 7: భారీ అంచనాల మధ్య విడుదలైన పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. రూ. 100 కోట్ల కలెక్షన్స్ కోసం బాక్సాఫీస్ వద్ద తిప్పలుపడుతోంది. ధురంధర్ 2 ప్రభంజనం ముందు ఉస్తాద్ మొదటి వారం వసూళ్లు చాలా తక్కువగా నమోదయ్యాయి.

Mar 26, 2026, 10:20:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాల్సిందే. కానీ, ఈసారి లెక్కలు మారుతున్నాయి. మార్చి 19న విడుదలైన పవన్ కల్యాణ్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', బాలీవుడ్ భారీ చిత్రం 'ధురంధర్ 2' పోటీని తట్టుకోలేక వసూళ్ల పరంగా నెమ్మదించింది. ధురంధర్ ది రివేంజ్ సినిమా ఒక ప్రభంజనంలా దూసుకుపోతుంటే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం మొదటి వారం ముగిసేసరికి చాలా వెనుకబడిపోయింది.

100 కోట్ల కోసం ఉస్తాద్ భగత్ సింగ్ తిప్పలు- 7వ రోజు అతి తక్కువ వసూల్లు-గట్టెక్కడం కష్టమే!
100 కోట్ల కోసం ఉస్తాద్ భగత్ సింగ్ తిప్పలు- 7వ రోజు అతి తక్కువ వసూల్లు-గట్టెక్కడం కష్టమే!

ఏడో రోజు అత్యంత కనిష్ట వసూళ్లు!

ప్రముఖ ట్రేడ్ పోర్టల్ 'సక్నిల్క్' (Sacnilk) గణాంకాల ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి సోమవారం (మార్చి 23) రూ. 2.50 కోట్లు, మంగళవారం (మార్చి 24) రూ. 1.75 కోట్లు వసూలు చేసింది. ఇక ఏడో రోజైన బుధవారం (మార్చి 25) నాటికి ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ మరింత తగ్గి కేవలం రూ. 1.14 కోట్లు మాత్రమే నమోదయ్యాయి.

ప్రస్తుతం దేశీయంగా ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం వసూళ్లు రూ. 65.74 కోట్లకు చేరుకున్నాయి. పవన్ కల్యాణ్ గత చిత్రం 'హరి హర వీరమల్లు' మొదటి వారం చివరలో రూ. 79.73 కోట్లు రాబట్టగా, ఆ రికార్డును కూడా ఉస్తాద్ అందుకోలేకపోయింది. కనీసం రూ. 100 కోట్ల వరల్డ్ వైడ్ మార్కును చేరడానికి కూడా ఈ సినిమా ఎంతో కష్టపడాల్సి వస్తోంది.

100 కోట్ల కోసం తిప్పలు

అంటే, రూ. 100 కోట్ల కలెక్షన్స్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ తిప్పలు పడుతోంది. మరోవైపు, రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' బుధవారం (మార్చి 25) ఒక్కరోజే రూ. 47.70 కోట్లు కొల్లగొట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 2.50 కోట్లు రావడం విశేషం. అంటే, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ధురంధర్ 2 మూవీకే కలెక్షన్స్ అధికంగా ఉన్నాయి.

దీంతో ధురంధర్ ది రివేంజ్ 7 రోజుల ఇండియన్ కలెక్షన్స్ రూ. 623.42 కోట్లకు చేరాయి. ఇలా ఈ స్థాయిలో ఉన్న ధురంధర్ 2 క్రేజ్ ముందు ఉస్తాద్ భగత్ సింగ్ నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పాటు వసూళ్లు తగ్గడంపై దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల స్పందించారు.

విమర్శలపై హరీష్ శంకర్ గరం గరం!

"ట్రోలర్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. నిర్మాణాత్మకమైన విమర్శలు (Constructive Criticism) ఉంటే కచ్చితంగా స్వీకరిస్తాను. సీన్ బాగుండలేదు అని చెబితే తీసుకుంటాను కానీ, ఐడెంటిటీ లేని ట్రోలర్స్ మాటలను సీరియస్ గా తీసుకోను" అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. హద్దులు దాటి ప్రవర్తించే వారిని బ్లాక్ చేస్తానని లేదా ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

గట్టెక్కడం కష్టమే

ఇక గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్-హరీష్ కలయికలో వచ్చిన రెండో సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తుంటే మాత్రం ఉస్తాద్ గట్టెక్కడం అంత సులభంగా కనిపించడం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More