UBS BO: తెలుగులోనూ ధురంధర్ 2 గట్టిపోటీ- అయినా తగ్గని పవన్ కల్యాణ్ మేనియా- ఉస్తాద్ భగత్ సింగ్ 5 రోజుల కలెక్షన్స్ ఇవే!

Ustaad Bhagat Singh Day 5 Collection: రణ్‌వీర్ సింగ్ ‘ధరంధర్ 2’ ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టిగానే ఉంది. అయితే పవన్ కల్యాణ్ మేనియా దానిముందు తగ్గట్లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఐదో రోజున ఇండియాలో ధురంధర్ 2 రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడితే.. ఉస్తాద్ భగత్ సింగ్ రూ. 2 కోట్లు వసూలు చేసింది.

Published on: Mar 24, 2026, 10:37:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ వద్ద పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ, ఒక్కోసారి అది ఏకపక్షంగా మారిపోతుంది. అది మరో సినిమాపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది.

తెలుగులోనూ ధురంధర్ 2 గట్టిపోటీ- అయినా తగ్గని పవన్ కల్యాణ్ మేనియా- ఉస్తాద్ భగత్ సింగ్ 5 రోజుల కలెక్షన్స్ ఇవే!
తెలుగులోనూ ధురంధర్ 2 గట్టిపోటీ- అయినా తగ్గని పవన్ కల్యాణ్ మేనియా- ఉస్తాద్ భగత్ సింగ్ 5 రోజుల కలెక్షన్స్ ఇవే!

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధరంధర్ 2’ సృష్టించిన సునామీలో పవన్ కల్యాణ్ సినిమా వసూళ్లు కొట్టుకుపోతున్నాయి. బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధాటికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.

ఐదో రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు

ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, సోమవారం (మార్చి 23) (ఐదో రోజు) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇండియాలో కేవలం రూ. 1.96 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. విడుదలైన తర్వాత ఈ సినిమాకు ఇదే అత్యల్ప సింగిల్ డే కలెక్షన్. దీంతో ఇండియాలో ఐదు రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రూ. 62.26 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.

ఫ్యాన్స్ అభిప్రాయం

అయితే, ధురంధర్ 2 పోటీ ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ మేనియా ఏమాత్రం తగ్గట్లేదని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఐదో రోజున కూడా సుమారుగా రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని చెబుతున్నారు. ఒకరకంగా చూస్తే ధురంధర్ 2 హవా గట్టిగా సాగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ క్రేజ్ కూడా ఏమాత్రం తక్కువగా లేదని తెలుస్తోంది.

మరోవైపు, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధరంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రళయం సృష్టిస్తోంది. సోమవారం కూడా ఈ చిత్రం ఏకంగా రూ. 65 కోట్లు రాబట్టి, మొత్తం రూ. 519 కోట్ల మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ హిందీ చిత్రం హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుండటం గమనార్హం. కేజీఎఫ్ 2, బాహుబలి 2 రికార్డులను కూడా ధురంధర్ 2 అధిగమించడం విశేషం.

డైరెక్టర్ హరీష్ శంకర్ ఏమన్నారంటే?

ఈ భారీ పోటీ గురించి దర్శకుడు హరీష్ శంకర్ గతంలోనే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "పెద్ద సినిమాల మధ్య పోటీ అనేది కేవలం నా చేతుల్లో ఉన్న నిర్ణయం కాదు. పవన్ సార్‌తో చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్నాను, ఇలాంటి సమయంలో మరో పెద్ద చిత్రంతో పోటీ పడటం కాస్త ఆందోళన కలిగించే విషయమే. అయితే సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్లలో రెండు మూడు పెద్ద సినిమాలు ఆడేంత స్పేస్ మార్కెట్‌లో ఉంటుందని నేను నమ్ముతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

సినిమా నేపథ్యం

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, 2016లో వచ్చిన విజయ్ ‘తేరి’ చిత్రానికి రీమేక్ అని టాక్ నడుస్తోంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంగీతాన్ని అందించారు. అయితే రణ్‌వీర్ సింగ్ 'ధరంధర్ 2' ధాటికి ఉస్తాద్ భగత్ సింగ్ పుంజుకుంటుందో లేదో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More