Pawan Kalyan Wife: ఇదే సరైన సమయం అనిపించింది.. చిరంజీవి ఆశీస్సులూ ఉన్నాయన్న పవన్ భార్య.. వెల్‌కమ్ చెప్పిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Wife: పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నెవా ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టింది. దీనికి ఇదే సరైన సమయం అని అనిపించిందని ఆమె చెప్పగా.. పవన్ వెల్‌కమ్ మై డియర్ అని చెప్పడం విశేషం. ఆమె ఫస్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది.

Mar 25, 2026, 15:10:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pawan Kalyan Wife: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సాధారణంగా తన సినిమాలకు లేదా రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే పంచుకుంటారు. ఆయన పర్సనల్ విషయాలను, ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను బయటపెట్టడం చాలా అరుదు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా (ఇప్పుడు అన్నా కొణిదెల) కు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమె అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయడంతో, పవన్ స్వయంగా ఒక పోస్ట్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Pawan Kalyan Wife: ఇదే సరైన సమయం అనిపించింది.. చిరంజీవి ఆశీస్సులూ ఉన్నాయన్న పవన్ భార్య.. వెల్‌కమ్ చెప్పిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan Wife: ఇదే సరైన సమయం అనిపించింది.. చిరంజీవి ఆశీస్సులూ ఉన్నాయన్న పవన్ భార్య.. వెల్‌కమ్ చెప్పిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

"ప్రియమైన అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచంలోకి నీకు హృదయపూర్వక స్వాగతం. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్న నీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ రాకతో ఇక్కడ ఎన్నో స్పూర్తిదాయకమైన, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. తన భార్యకు ఆయన ఇచ్చిన ఈ అరుదైన వెల్‌కమ్ మెసేజ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

వైరల్ అవుతున్న కొణిదెల కోడలి తొలి పోస్ట్..

పవన్ స్వాగతం పలికిన కాసేపటికే, కొణిదెల కోడలు అన్నా తన ఖాతాలో తొలి పోస్ట్ పెట్టారు. అది కూడా ఒక స్పెషల్ పోస్ట్ కావడం విశేషం. ఇంతవరకు ఎవరూ చూడని తన భర్త పవన్ కళ్యాణ్ ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. దాదాపు బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఉన్న ఆ ఫోటోలో పవన్, అన్నా ఇద్దరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోకు నిమిషాల్లోనే లక్షల్లో లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తూ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ ఫోటోకు క్యాప్షన్ ఇస్తూ.. "ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావడం చాలా ఆలస్యమైంది. కానీ ఇదే సరైన సమయం అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ మద్దతుతో నా ఈ ప్రయాణం మొదలుపెడుతున్నాను" అని అన్నా కొణిదెల రాసుకొచ్చారు.

రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్..

వీటన్నింటి కంటే ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయో. అందులో ఆమె "రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్" అని రాసుకున్నారు. తాను పుట్టి పెరిగిన రష్యా మూలాలను గుర్తుంచుకుంటూనే, భారతీయ సంప్రదాయాలకు, ఇక్కడి జీవితానికి ఆమె ఎంతలా కనెక్ట్ అయ్యారో ఈ ఒక్క వాక్యం చెబుతోంది.

ఇక అన్నా కొణిదెల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వదినమ్మ సోషల్ మీడియాలోకి వచ్చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆమె పోస్ట్‌లో చిరంజీవి ఆశీస్సులు అని ప్రస్తావించడంతో, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు మిగతా మెగా ఫ్యామిలీ సభ్యులు ఆమెకు సోషల్ మీడియాలో ఎలా స్వాగతం పలుకుతారో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More