Dhurandhar 2: ధురంధర్ 2 మేనియా.. రిలీజ్ ముందే రూ.60 కోట్ల వేట.. పవన్ కళ్యాణ్ 'ఓజీ' రికార్డుకు చెక్ పెడుతుందా?

Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఈ మూవీ ప్రీమియర్ షో, అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ వేరే లెవల్ లో కొనసాగుతున్నాయి. ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల కలెక్షన్ ను ఈ మూవీ ఖాతాలో వేసుకోబోతోంది. 

Mar 13, 2026, 11:42:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధురంధర్ 2 మేనియా నెక్ట్స్ లెవల్. రిలీజ్ కంటే ముందే ధురంధర్ 2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తోనే ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ తో ధురంధర్ 2 రూ.60 కోట్లు ఖాతాలో వేసుకుంది.

ధురంధర్ 2 పోస్టర్ లో ర‌ణ్‌వీర్‌
ధురంధర్ 2 పోస్టర్ లో ర‌ణ్‌వీర్‌

ధురంధర్ 2 జోరు

ర‌ణ్‌వీర్‌ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు ఇండియాలో టికెట్ బుకింగ్స్ ప్రారంభమైంది. మార్చి 13 ఉదయం వరకు ఇండియాలోనే ధురంధర్ 2 ప్రీమియర్ షో కోసం ఏకంగా 4.7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

ఓజీ రికార్డు

ఇండియాలో ధురంధర్ 2 ప్రీమియర్ షోల కోసం ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 4.7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి అంటే మూవీకి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ టికెట్ల అమ్మకాల ద్వారా కేవలం ఇండియాలోనే రూ.24.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. గతేడాది పవన్ కల్యాణ్ మూవీ ఓజీ ప్రీమియర్స్ రికార్డు (రూ.25 కోట్లు)ను ధురంధర్ 2 అందుకునేలా కనిపిస్తోంది.

ఓవర్సీస్ లో

విదేశాల్లో ధురంధర్ 2 ప్రీమియర్ షోలతో పాటు మిగతా రెగ్యులర్ షోలకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ య్యాయి. దీంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఈ మూవీ డామినెన్స్ మూమూలుగా లేదు. ఈ చిత్రం ఇప్పటికే అమెరికా, కెనడాలో కలెక్షన్ రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ లోనే 3 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరేందుకు ధురంధర్ 2 రంగం సిద్ధం చేసుకుంది.

రూ.60 కోట్లు

నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కోసం టికెట్ల సేల్స్ 1 మిలియన్ డాలర్లకు దగ్గరలో ఉంది. యూరప్, ఆసియా, ఓషియానియాలోని ఇతర ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్ 1 మిలియన్ డాలర్ల వైపు దూసుకెళ్తోంది. దీంతో ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని ఓవరాల్ గా ఈ సినిమా రూ.60 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్‌ను అందుకుంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో రూ.100 కోట్ల మార్కును సులభంగా దాటుతుందని ట్రేడ్ అనలిస్ట్ లు చెబుతున్నారు.

ధురంధర్ గురించి

డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ సెన్సేషన్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ధురంధర్ 2 రిలీజ్ కు ముందు ధురంధర్ మూవీని రీ రిలీజ్ చేశారు. మార్చి 12న ప్రపంచవ్యాప్తంగా 500 స్క్రీన్స్ లో ధురంధర్ రీ రిలీజ్ అయింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More