OTT Malayalam: పెళ్లి చేసుకుని పెళ్లికూతురు జంప్.. మోసం చేసే అమ్మాయి.. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన మలయాళం కామెడీ థ్రిల్లర్
OTT Malayalam: ఓటీటీలోకి ఇవాళ ఓ మలయాళ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. పెళ్లి చేసుకున్న వెంటనే కనిపించకుండా పోయే పెళ్లి కూతురు కథతో ఈ మూవీ తెరకెక్కింది. పెళ్లి కోసం ఆశపడే మగాళ్లను మోసం చేసే అమ్మాయి స్టోరీ ఇది.
ఓటీటీల యూజ్ ఎక్కువయ్యాక ఇతర భాషల సినిమాలనూ తెలుగు ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళం సినిమాలంటే మనవాళ్లు మోజు పడుతున్నారు. ఈ రోజు మన తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మరో మలయాళ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఆ సినిమానే.. ‘పెన్ను కేసు’.

పెన్ను కేసు ఓటీటీ
మలయాళ కామెడీ థ్రిల్లర్ పెన్ను కేసు ఇవాళ (మార్చి 12) ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ఆడియన్స్ కు పెన్ను కేసు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు కేవలం మలయాళంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
రెండు నెలల తర్వాత
పెన్ను కేసు సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం జనవరి 10, 2026న థియేటర్లలో రిలీజైంది. కానీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో విఫలమైంది. పెన్ను కేసు మూవీ థియేటర్లలో సోసోగానే ఆడింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత మార్చి 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పెన్ను కేసు సినిమాకు ఫెబిన్ సిద్ధార్థ్ డైరెక్టర్. ఈ మూవీలో నిఖిలా విమన్, హకీమ్ షాజహాన్, శివజీత్, అజు వర్గీస్ తదితరులు నటించారు.
పెన్ను కేసు స్టోరీ
పెళ్లిళ్లు చేసుకుని పురుషులను మోసం చేసే ఓ అమ్మాయి కథ చుట్టూ సాగే సినిమానే పెన్ను కేసు. పెళ్లి కోసం ఆశతో ఉన్న అబ్బాయిలను అమ్మాయి మోసం చేయడం ఈ స్టోరీలో కొత్త పాయింట్. రోహిణి (నిఖిలా విమన్) ఓ అందమైన అమ్మాయి. కేరళ, కర్ణాటకలోని కొంతమంది అబ్బాయిలను తన అందంతో, మాటలతో ఆకర్షించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి కాగానే ఆమె కనిపించకుండా పోతుంది.
పెళ్లి కాగానే
మాయ మాటలతో పెళ్లి చేసుకునే రోహిణి.. వెడ్డింగ్ కాగానే జంప్ అవుతుంది. అలా కొంతమందిని పెళ్లి చేసుకుంటుంది. తనకు కెమెరా అంటే సిగ్గు అని, ఫొటోలు దిగనని చెప్పి పెళ్లి చేసుకుంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా చూసుకుంటుంది. కానీ ఆమె చేతిలో మోసపోయిన అబ్బాయిలు పోలీస్ కేసు పెడతారు. సీఐ మనోజ్ (హకీం షాజహాన్) ఎంక్వైరీ చేస్తాడు.
మరి రోహిణిని పోలీసులు పట్టుకున్నారా? అసలు మగాళ్లను పెళ్లి చేసుకుని రోహిణి ఎందుకు మోసం చేస్తుంది? అన్నది పెన్ను కేసు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


