Chiranjeevi: వాన వాన సాంగ్ కు పవన్ డ్యాన్స్-చిరంజీవి రియాక్షన్ వైరల్-తమ్ముడితో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన మెగాస్టార్
Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కల్యాన్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను తమ్ముడు పవన్ కల్యాణ్ ఫ్యామిలీతో కలిసి చిరంజీవి దంపతులు థియేటర్లో చూశారు. ‘వాన వాన వెల్లువాయే’ సాంగ్ కు పవన్ డ్యాన్స్ చూసి చిరు ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.
ఉస్తాద్ భగత్ సింగ్ తో థియేటర్లను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మిక్సడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా దూసుకెళ్తోంది. ఉగాది సందర్బంగా మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజైంది. ఈ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్. ఈ సినిమాను తాజాగా చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ తో కలిసి చూశారు.

చిరంజీవి, పవన్
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక చోట కలిశారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని స్పెషల్ గా ఫ్యామిలీతో కలిసి చూశారు. ఈ స్క్రీనింగ్ కు చిరంజీవి దంపతులు, పవన్ కల్యాణ్ దంపతులు, డైరెక్టర్ హరీష్ శంకర్ కపుల్స్, తల్లితో కలిసి హీరోయిన్ శ్రీలీల, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు అటెండ్ అయ్యారు.
ఆ సాంగ్ కు
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో అన్నయ్య చిరంజీవి సినిమా పాటలను వాడారు. ఇందులో ‘వాన వాన వెల్లువాయే’ అనే సూపర్ హిట్ సాంగ్ కు స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చుని కాళ్లను కదుపుతాడు పవన్ కల్యాణ్. ఈ సాంగ్ వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ డ్యాన్స్ చూసి చిరంజీవి నవ్వుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
అన్నయ్యకు వెల్కమ్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసేందుకు వచ్చిన అన్నయ్య చిరంజీవికి పవన్ కల్యాణ్ వెల్ కమ్ చెప్పారు. ప్రేమగా ఈ అన్నదమ్ములు హత్తుకున్నారు. ఆ తర్వాత వదిన సురేఖను పవన్ పలకరించారు. సినిమా చూస్తున్నప్పుడు సురేఖాతో పవన్ నవ్వుతూ మాట్లాడారు. సినిమా కంప్లీట్ అయ్యాక మూవీ టీమ్ ను చిరంజీవి అభినందించారు.
పవర్ ఫుల్ పోలీస్
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇందులో భగత్ సింగ్ అనే పవర్ ఫుల్ పోలీసు క్యారెక్టర్లో పవన్ కనిపించారు. తనదైన స్టైల్లో మాస్ డైలాగ్స్, యాక్షన్ తో అదరగొట్టారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు.
మిక్స్ డ్ టాక్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. మార్చి 19న ఉగాది సందర్భంగా ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. తమన్ బీజీఎం సమకూర్చాడు. ఈ సినిమాకు ఫస్ట్ డే ఇండియాలో రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


