Korean Kanakaraju Review: కొరియన్ కనకరాజు రివ్యూ- వరుణ్ తేజ్, సత్య కామెడీ ధమాకా- హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Korean Kanakaraju Review And Rating In Telugu: వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా కమెడియన్ సత్య కీలక పాత్రలో నటించిన కొరియన్ కనకరాజు సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎలా ఉందో నేటి కొరియన్ కనకరాజు రివ్యూలో తెలుసుకుందాం.
Korean Kanakaraju Review In Telugu:

టైటిల్: కొరియన్ కనకరాజు
నటీనటులు: వరుణ్ తేజ్, రితిక నాయక్, సత్య, సునీల్, వీటీవీ గణేష్, మాస్టర్ రేవంత్, మురళీధర్ గౌడ్ తదితరులు
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
సంగీతం: థమన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
ఎడిటింగ్: సత్యా
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి
బ్యానర్స్: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్ : ఆగస్ట్ 7, 2026
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్యూటిఫుల్ రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా కొరియన్ కనకరాజు. సత్య, సునీల్ కీ రోల్స్ పోషించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.
ఇవాళ (ఆగస్ట్ 7) థియేటర్లలో విడుదల కానున్న కొరియన్ కనకరాజు సినిమా ప్రీమియర్ షోలు ఒకరోజు ముందే ప్రదర్శించారు. మరి ఈ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందో నేటి కొరియన్ కనకరాజు రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రాయలసీమలోని పెనుకొండ ప్రాంతంలో ఒక సాంప్రదాయ చెక్కభజన ప్రదర్శనలు ఇచ్చే జానపద కళాకారుల బృందానికి కనకరాజు (వరుణ్ తేజ్) నాయకత్వం వహిస్తుంటాడు. ఆ చెక్కభజనలతో వచ్చే డబ్బుతో కుటుంబానికి అండగా ఉంటాడు. అలాగే, కిష్టప్ప (సత్య)తో స్నేహం, చెంగారెడ్డి (సునీల్)తో గొడవలతో కాలం వెళ్లదీస్తుంటాడు.
అదే ప్రాంతంలోని కియా (Kia) కార్ల తయారీ పరిశ్రమలో పనిచేసే చైత్ర (రితికా నాయక్)తో కనకరాజు ప్రేమలో పడతాడు. చైత్రకు కే-పాప్ (K-Pop), కొరియన్ సంస్కృతి అంటే విపరీతమైన పిచ్చి. ఎలాగోలా ఆమెకు దగ్గరవుతాడు. కానీ, కొరియా నుంచి వచ్చిన ఓ వస్తువు నుంచి కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది.
ఆ కొరియన్ ఆత్మ కనకరాజు శరీరంలోకే ఎందుకు ప్రవేశించింది? ఆ దెయ్యం వెనుక ఉన్న గత చరిత్ర ఏమిటి? కనకరాజు కొరియా ఎందుకు వెళ్లాడు? అక్కడ ఏం జరిగింది? ఆత్మ వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి కనకరాజు, అతడి స్నేహితుడు కిష్టప్ప, చైత్ర కలిసి ఏం చేశారు? ఆత్మ నుంచి కనకరాజుకు విముక్తి లభించిందా? అన్నదే 'కొరియన్ కనకరాజు' కథాంశం.
విశ్లేషణ:
కొరియన్ కనకరాజు కథ ఏంటనేది, ఎలా ఉంటుందనేది ట్రైలర్ ద్వారానే దాదాపుగా చెప్పేశారు. రెగ్యులర్ హారర్ కామెడీ జోనర్‌కు కొరియన్ టచ్ ఇచ్చి తెరకెక్కించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. అది సినిమాకు కాస్తా కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ఇక సినిమా ప్రారంభం అవడం రెగ్యులర్ టెంప్లేట్స్‌తో ఉన్న కామెడీతో మెప్పిస్తుంది.
కనకరాజు, కిష్టప్పతో వచ్చే కామెడీ ట్రాక్ బాగా మెప్పిస్తుంది. చైత్రతో హీరో లవ్, ప్రేమను పొందేందుకు చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో కనకరాజులో కొరియన్ ఆత్మ దూరడం, ఆతర్వాత అతని ప్రవర్తన అంతా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. కొరియన్ గ్యాంగ్స్‌తో వచ్చే యాక్షన్ సీన్స్, పెంపుడు కుక్కతో సాగే డ్రామా ఆకట్టుకుంటాయి.
కామెడీపైనే ఫోకస్
అయితే, ఇలాంటి హారర్ కామెడీ జోనర్లలో పెద్దగా లాజిక్స్ పట్టించుకోరు. అందుకే కేవలం కామెడీపైనే ఫోకస్ పెట్టి సినిమాను తీర్చిదిద్దినట్లుగా అనిపిస్తుంది. అయితే, అందులో చాలా వరకు సక్సెస్ అయ్యారు. కొరియా వెళ్లాక జరిగే సంఘనటలు నవ్వు తెప్పిస్తూనే ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. క్లైమాక్స్ పర్వాలేదు.
ఇంతకిమించి ఎక్కువ ఏం చెప్పిన స్పాయిలర్ అవుతుంది. సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు ఓకే. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా బాగా కుదిరింది. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం కొరియన్ పోర్షన్స్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఎడిటర్ సత్యా గ్రాఫ్ తగ్గకుండా పకడ్బందీగా ఎడిట్ చేశారు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
రెండు గెటప్పులలో
ఇక వరుణ్ తేజ్ రెండు వేర్వేరు గెటప్పులలో కనిపించి మెప్పించాడు. నాటు కనకరాజుగా, అదే సమయంలో స్టైలిష్ కొరియన్ కుర్రాడిగా వైవిధ్యం చూపించాడు. వరుణ్ తేజ్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. అలాగే, కమెడియన్ సత్య కామెడీ మూవీకి హైలెట్‌గా నిలుస్తుంది. సత్య స్క్రీన్ ప్రజెన్స్ ప్రతిసారి నవ్విస్తుంది. వరుణ్-సత్య కాంబినేషన్ బాగా నవ్విస్తుంది.
హీరోయిన్ రీతికా నాయక్ తన పరిధి మేర చక్కగా నటించి కథనాన్ని ముందుకు నడిపింది. మాస్టర్ రేవంత్, మురళీధర్ గౌడ్, కొరియన్ నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో సత్య, రీతికా నాయక్, మురళీధర్ గౌడ్ మధ్య వచ్చే ఒక కామెడీ సీన్ నవ్వులు పూయిస్తుంది.
లాజిక్ పక్కనపెడితే
అయితే, కేవలం వినోదంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కొన్ని చోట్ల లాజిక్ పక్కదారి పట్టింది. ఫైనల్‌గా చెప్పాలంటే లాజిక్‌లను పక్కనబెట్టి హాయిగా నవ్వుకోవాలనుకునే వారు థియేటర్లోల కొరియన్ కనకరాజు సినిమాపై లుక్కేయవచ్చు.
రేటింగ్: 3.25/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


