Satya: అవాక్కయ్యే విషయం చెప్పిన సత్య.. జెట్లీ హీరోకు ఇంత పెద్ద కూతురుందా? తన డాటర్‌కు ఆ డైరెక్టర్ పేరు
Satya: ఓ వైపు కమెడియన్ గా చేస్తూనే, ఛాన్స్ దొరికినప్పుడు హీరోగానూ సత్తాచాటుతున్నాడు సత్య. తాజాగా జెట్లీ అంటూ థియేటర్లలో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా అవాక్కయ్యే విషయాలు చెప్పాడు సత్య.
Satya: టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో సత్య ఒకరు. సినిమాల్లో బ్రహ్మానందం లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్న వాళ్లలో అతనొకడు. కమెడియన్ గా సినిమాలు చేస్తూనే, ఛాన్స్ దొరికితే హీరోగానూ అదరగొడుతున్నాడు. తాజాగా ‘జెట్లీ’ మూవీతో థియేటర్లకు వచ్చాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ఫ్యామిలీ గురించి సత్య ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

సత్య కూతురు
మే 1న జెట్లీ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇందులో సత్య హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రమోషన్లలో సత్య అవాక్కయ్యే నిజాలు చెప్పాడు. సత్య, హీరోయిన్ రియా, డైరెక్టర్ రితేశ్ రాణా కలిసి యాంకర్ సుమ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన కూతురి గురించి సత్య చెప్పాడు.
9 ఏళ్లు
‘‘మీకు పెళ్లయి, ఇద్దరు పిల్లున్నారు అని వినిపిస్తోంది’’ అని సుమ అడుగుతుంది. ఒక పాప ఉందని సత్య చెప్తాడు. ‘‘పాప ఉందా, నిజమా ఇది? కానీ పాప ఫొటో ఎక్కడా పెట్టలేదా?’’ అని సుమ ఆశ్చర్యపోతూ అడుగుతుంది. ‘‘పెట్టలేదు. నా ఫొటోలే పెట్టను నేను’’ అని సత్య నవ్వేస్తాడు. పాప ఏజ్ ఎంత అని సుమ అడిగే సరికి.. 9 ఏళ్లు అని సత్య చెప్తాడు.
ఆ డైరెక్టర్ పేరు
సత్య కూతురి పేరు వెనకాల ఉన్న కథను కూడా సత్య ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పక్కనే ఉన్న రితేశ్ రాణా ఏమో సత్య పాప గురించి సుమను అడగమంటాడు. సుమ అడుగుతుంది. ‘‘పాప పేరు సుధీర. ఫస్ట్ మూవీ డైరెక్టర్ సుధీర్ వర్మ. అందుకే తన పేరు పెట్టా. నెక్ట్స్ ఇంకొకరు పుడితే రితేశ్ రాణా’’ పేరు పెడతానని సత్య వెల్లడించాడు.
జెట్లీ గురించి
రితేశ్ రాణా దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జెట్లీ మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. మూవీ ఎక్కువ భాగం ఓ విమానంలోనే సాగుతుంది.
రూ.15 వేల కోట్ల స్కామ్ చేసిన ఓ బిజినెస్ ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటాడు. అతణ్ని చంపేందుకు శత్రువులు ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో ఆ బిజినెస్ మ్యాన్ ఉన్న విమానంలోకి గతం మర్చిపోయిన హీరో ఎంట్రీ ఇస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే జెట్లీ మూవీ స్టోరీ. కామెడీ లవర్స్ కు ఈ సినిమా మంచి ఎంటర్ టైన్మెంట్ అనే కామెంట్లు వస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


