Suma Birthday: సుమ కనకాల బర్త్ డే.. ఆమె ఏజ్ ఎంతో తెలుసా? ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవాల్సిందే.. రాజీవ్ పోస్టు వైరల్
Suma Birthday: బుల్లితెర మహారాణిగా వెలుగొందుతోంది సుమ కనకాల. టీవీ షోలు, సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లతో దూసుకెళ్తోంది. టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ బర్త్ డే ఈ రోజు. ఆమెకు విషెస్ చెప్తూ భర్త రాజీవ్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సుమ ఏజ్, ఆస్తుల వివరాలపై ఓ లుక్కేయండి.
ఆమె ఓ మాటల ప్రవాహం. మైక్ అందుకుందంటే ఇక నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్లాల్సిందే. టీవీ షోలు అయినా, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయినా ఆమె ఉంటే సక్సెస్ కావాల్సిందే. ఆమెనే.. బుల్లితెర మహారాణిగా పేరు తెచ్చుకున్న సుమ కనకాల. ఈ టాప్ యాంకర్ బర్త్ డే ఈ రోజు. తన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాజీవ్ కనకాల పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

రాజీవ్ పోస్టు
తెలుగులో టాప్ యాంకర్ ఎవరు? అంటే ఠక్కున వినిపించే సమాధానం సుమ కనకాల. అసలు ఆమెకే పోటీనే లేదని చెప్పొచ్చు. ఈ రోజు (మార్చి 22) సుమ బర్త్ డే. ఈ సందర్భంగా తన భార్యకు బర్త్ డే విషెస్ చెప్తూ రాజీవ్ కనకాల ఎక్స్ లో కొన్ని ఫొటోలు పంచుకున్నాడు.
130 ఏళ్లు
‘‘శుభజన్మదినం తుభ్యం
శుభజన్మదినం తుభ్యం
శుభజన్మదినే తవ హే
సకలం సఫలం భూయాత్
సకలం చ శుభం భూయాత్
నిండూ నూరేళ్లు… కాదు కాదు, ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నా. హ్యపీ బర్త్ డే సుమ కనకాల’’ అని రాజీవ్ తన భార్యకు శుభాకాంక్షలు తెలిపాడు.
సుమ ఏజ్
కొన్ని దశాబ్దాలుగా తన యాంకరింగ్ తో ఆడియన్స్ ను సుమ కనకాల ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఆమె ఏజ్ ఎంత అనేది ఎప్పుడూ ఓ డిస్కషన్ పాయింటే. ఇవాళ బర్త్ డే జరుపుకొంటున్న సుమ ఏజ్ 51. ఇది ఆమెకు 51వ పుట్టిన రోజు. కానీ సుమకు అంత ఏజ్ ఉందంటే ఎవరూ నమ్మరు. ఇప్పటికీ ఆమె సూపర్ యాక్టివ్ గా ఉంది.
సుమ నెట్ వర్త్
ఇక టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సుమ బాగానే సంపాదిస్తోంది. ఆమె నెట్ వర్త్ సుమారు రూ.100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. టీవీ షోల కోసం ఒక్కో ఎపిసోడ్ కు సుమ రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం.
ఇక మూవీ ఈవెంట్ల విషయానికి వస్తే సుమకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ డిమాండ్ ను బట్టే సుమ ఒక్కో మూవీ ఈవెంట్ కు రూ.8 నుంచి రూ.10 లక్షల వరకూ తీసుకుంటుందని టాక్. ఇక వ్యాపార ప్రకటనలు, యూట్యూబ్ ఛానెల్ నుంచి కూడా సుమకు ఇన్ కమ్ వస్తుంది.
సినిమాల్లోనూ
అప్పట్లో వర్షం సినిమాలో ప్రభాస్ కు అక్కగా నటించిన సుమ ఆ తర్వాత చాలా కాలం పాటు బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. మళ్లీ 2022లో ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా ప్రియదర్శి హీరోగా నటించిన ‘ప్రేమంటే’ మూవీలో కానిస్టేబుల్ గా సుమ అలరించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


