OTT Horror: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో సూపర్ హిట్ హారర్ కామెడీ థ్రిల్లర్- 6 కోట్లకు 19 కోట్ల కలెక్షన్స్- 7.4 రేటింగ్!
Tumbadchi Manjula OTT Release In Few Hours: ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా తుంబాడ్చి మంజుల స్ట్రీమింగ్ కానుంది. రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ. 19 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 7.4 రేటింగ్ సాధించుకుంది ఈ సినిమా. ఇలాంటి తుంబాడ్చి మంజుల ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Tumbadchi Manjula OTT Streaming In Few Hours: ఇటీవలి కాలంలో ప్రాంతీయ సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వినూత్న కథాంశాలతో వచ్చే హారర్, కామెడీ డ్రామాలను ఓటీటీ ప్రియులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హారర్ కామెడీ మూవీ ‘తుంబాడ్చి మంజుల’ (Tumbadchi Manjula) ఓటీటీలోకి వచ్చేయనుంది.

ఐఎమ్‌డీబీ రేటింగ్
థియేటర్లలో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకుంది తుంబాడ్చి మంజుల. రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే రూ. 19.17 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో పదికి 7.4 రేటింగ్ కూడా దక్కించుకుంది. అలాంటి తుంబాడ్చి మంజుల ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేయనుంది.
కథేంటంటే?
కొంకణ్ ప్రాంతంలోని ఒక ఊరిలో ఈ సినిమా కథ సాగుతుంది. గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్న టైమ్‌లో కేశవ్ అనే యువకుడిని దెయ్యం ఆవహించిందనే వార్త ఒక్కసారిగా వ్యాపిస్తుంది. ఈ ప్రచారంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న గ్రామం మొత్తం భయాందోళనకు గురవుతుంది.
కేశవ్‌లో కనిపిస్తున్న మార్పులను చూసిన గ్రామస్థులు అతడి శరీరంలో దెయ్యం ప్రవేశించిందని గట్టిగా నమ్ముతారు. సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కరుణాకర్ గురూజీని రంగంలోకి దింపుతారు. కరుణాకర్ గురూజీ తనదైన పద్ధతుల్లో కేశవ్‌కు పట్టిన దెయ్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు.
తుంబాడ్ మంజుల ఎవరు?
చివరకు అతడి శరీరంలో ఉన్నది తుంబాడ్ గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ దెయ్యమని చెబుతాడు. అసలు మంజుల ఎవరు? ఆమెకు కేశవ్‌తో ఉన్న సంబంధమేంటి? తుంబాడ్ గ్రామంలో నిజంగానే మంజుల అనే మహిళ ఉందా? లేక గ్రామస్థుల భయం, అపోహల నుంచి పుట్టిన కథా? కరుణాకర్ గురూజీ దెయ్యాన్ని తరిమికొట్టగలిగారా? ఈ మొత్తం వ్యవహారం వెనుక దాగిన నిజమేంటి? అనే అంశాలను భయం, హాస్యం కలగలిపి సినిమాలో చూపించారు.
‘సు ఫ్రమ్ సో’కు అధికారిక రీమేక్
‘తుంబాడ్చి మంజుల’ 2025లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కన్నడ హారర్ కామెడీ ‘సు ఫ్రమ్ సో’కు అధికారిక మరాఠీ రీమేక్. జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం గ్రామీణ నేటివిటీ, కామెడీతో భారీ విజయాన్ని అందుకుంది. అదే కథను యథాతథంగా తీయకుండా మరాఠీ సంస్కృతి, కొంకణ్ ప్రాంతపు వాతావరణం, స్థానికుల జీవనశైలికి అనుగుణంగా మార్పులు చేశారు. ఈ నేటివిటీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
వినోదంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మూఢనమ్మకాలు, ప్రజల ఆంధవిశ్వాసాలు, మానవ సంబంధాల చుట్టూ దర్శకుడు కథనాన్ని ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ప్రథమార్ధంలో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తే, ద్వితీయార్థంలో వచ్చే ట్విస్టులు థ్రిల్ అందిస్తాయి.
తుంబాడ్చి మంజుల ఓటీటీ స్ట్రీమింగ్
జీ5లో తుంబాడ్చి మంజుల ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్ట్ 7 అర్థరాత్రి అంటే మరికొన్ని గంటల్లో జీ5లో తుంబాడ్చి మంజుల ఓటీటీ రిలీజ్ కానుంది. హారర్, కామెడీ అంశాలతో కూడిన విభిన్నమైన కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు కూడా ఇది మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


