OTT K Drama: ఓటీటీలో ఏకంగా 100కిపైగా కొరియన్ డ్రామాలు- అది కూడా తెలుగు భాషలో- భారీ ఒప్పందం- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

100 Of K Drama OTT Streaming Telugu: తెలుగు రాష్ట్రాల్లో కె డ్రామాలు ఇష్టపడే వారికి అదిరిపోయే ఓటీటీ న్యూస్ వచ్చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కిపైగా కొరియన్ డ్రామాలను ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. అది కూడా తెలుగు భాషలో. ఇందుకోసం దక్షిణ కొరియా సంస్థ 'సీజే ఈఎన్ఎమ్'తో భారీ ఒప్పందం జరిగింది.

Published on: Jul 28, 2026, 09:23:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

100 Of K Drama OTT Release In Telugu: తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ డ్రామాలకు (K-Dramas) ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఓటీటీల్లో కే-డ్రామాల మోజులో మునిగితేలుతున్నారు.

ఓటీటీలో ఏకంగా 100కిపైగా కొరియన్ డ్రామాలు- అది కూడా తెలుగు భాషలో- భారీ ఒప్పందం- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో ఏకంగా 100కిపైగా కొరియన్ డ్రామాలు- అది కూడా తెలుగు భాషలో- భారీ ఒప్పందం- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సౌత్ కొరియా సంస్థతో ఒప్పందం

ఈ క్రేజ్‌ను గమనించిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' భారతీయ వీక్షకులకు ఊహించని వినోదాల విందు అందించడానికి సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 'సీజే ఈఎన్ఎమ్' (CJ ENM)తో ప్రైమ్ వీడియో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

తెలుగు డబ్బింగ్‌తో 100కు పైగా కే-డ్రామాలు

ఈ భాగస్వామ్యంలో భాగంగా రాబోయే రెండేళ్లలో 100కు పైగా పాపులర్ కొరియన్ ఓటీటీ షోలను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నారు. ఇందులో 26 సరికొత్త సిరీస్‌లతో పాటు గతంలో సంచలనం సృష్టించిన అనేక హిట్ డ్రామాలు ఉన్నాయి.

ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో డబ్బింగ్ చేసి 100కిపైగా కొరియన్ డ్రామాలను ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం. కేవలం సబ్‌టైటిల్స్ ఆధారంగానే చూసే పరిస్థితి లేకుండా, సొంత భాష తెలుగులోనే వీక్షించే వెసులుబాటు కలగడంతో తెలుగు కే-డ్రామా ప్రియులు పండగ చేసుకుంటున్నారు.

ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ప్రముఖ సిరీస్‌లు ఇవే

ఈ ఒప్పందంలో భాగంగా రాబోతున్న జాబితాలో 'యుమీస్ సెల్స్ సీజన్ 3' (Yumi's Cells Season 3) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటు సీజన్ 1, సీజన్ 2 కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఆగస్టు 3 నుంచి 'మై బయాస్, మై బాస్' అనే కొత్త షో ఓటీటీ రిలీజ్ అవనుంది.

వీటితో పాటు 'ఫైలింగ్ ఫర్ లవ్', 'ది లెజెండ్ ఆఫ్ కిచెన్ సోల్జర్', 'డియర్ ఎక్స్', 'లా ఇన్ ది సిటీ', 'స్టడీ గ్రూప్', 'మై డియరెస్ట్ నెమెసిస్', 'సెర్చ్: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' లాంటి ఎన్నో సూపర్‌హిట్ సిరీస్‌లు త్వరలోనే వరుసగా అలరించబోతున్నాయి. ఎవర్ గ్రీన్ హిట్లయిన 'లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ', 'ప్రిజన్ ప్లేబుక్', 'మదర్' వంటి ప్రముఖ ఓటీటీ షోలను కూడా తెలుగులో అందుబాటులోకి తీసుకురానున్నారు.

తెలుగు ప్రేక్షకుల ఆదరణపై ప్రైమ్ వీడియో సంతోషం

ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతినిధులు భారతీయ మార్కెట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "తెలుగు వీక్షకులు ఇతర భాషా చిత్రాలతో పాటు కొరియన్ కంటెంట్‌ను విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకే ఈ కొరియన్ షోలను తెలుగులోకి డబ్బింగ్ చేసి అందిస్తున్నాం" అని ప్రైమ్ వీడియో ఇండియా ఎస్‌వోడీ బిజినెస్ హెడ్ శిలాంగి ముఖర్జీ తెలిపారు.

భాషా పరిమితులను దాటి కథలు ప్రజల హృదయాలను తాకుతున్నాయని, ప్రాదేశిక భాషల్లో డబ్బింగ్ చేయడం వల్ల మరింత మందికి డిజిటల్ వినోదం చేరువవుతుందని ఆమె వివరించారు. "భారత్‌లో కే-డ్రామాలకు లభిస్తున్న ఆదరణ అద్భుతం. అన్ని ప్రాంతాల, అన్ని వయసుల వీక్షకులు ఈ షోలను ఇష్టపడుతున్నారు" అని ప్రైమ్ వీడియో కంటెంట్ లైసెన్సింగ్ హెడ్ మనీష్ మేంఘానీ పేర్కొన్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వినోద మార్కెట్ అయిన భారత్‌లో తమ కంటెంట్‌ను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా విస్తరించడం ఎంతో సంతోషంగా ఉందని సీజే ఈఎన్ఎమ్ ఈవీపీ జాంగ్ హో సో హర్షం వ్యక్తం చేశారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో కే డ్రామాల ఒప్పందంపై జాంగ్ హో సియో, షిలాంగి ముఖర్జీ, మనీష్ మెంఘానీ ప్రెస్ మీట్
అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో కే డ్రామాల ఒప్పందంపై జాంగ్ హో సియో, షిలాంగి ముఖర్జీ, మనీష్ మెంఘానీ ప్రెస్ మీట్

ఈ లెక్కన వచ్చే రెండేళ్లలో 100కిపైగా కొరియన్ డ్రామాలు ఓటీటీలో తెలుగు భాషలో సందడి చేయనున్నాయని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More