OTT Telugu: 2 ఓటీటీల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోన్న తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా- నవ్వించే భార్యభర్తల గొడవ-ఇక్కడ చూసేయండి!
Purushaha OTT Trending And Streaming On 2 Platforms: ఓటీటీలోకి ఇటీవలే తెలుగులో వచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం పురుషః. భార్యాభర్తల మధ్య గొడవలతో నవ్వించే ఈ సినిమా 2 ఓటీటీల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మరి పురుషః ఓటీటీ స్ట్రీమింగ్ అండ్ ట్రెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Purushaha OTT Trending And Release On 2 Platforms: తెలుగులో ఇటీవల కాలంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలకు మంచి క్రేజ్ పెరుగుతుంది. ఈ డ్రామాకు కాస్తా కామెడీ యాడ్ చేసి పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కిస్తే హిట్ సంగతి ఎలా ఉన్న బాగా నవ్విస్తాయి. అలాంటి ఇటీవల తెలుగులో వచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రమే పురుషః.

పురుషః హీరో హీరోయిన్లు
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. పురుషః మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ మూడు జంటలుగా ముఖ్య పాత్రలను పోషించారు.
ఐఎమ్‌డీబీ నుంచి 6 రేటింగ్
పురుషః సినిమా ఇదే ఏడాది మే 22న థియేటర్లలో విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళా ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఐఎమ్‌డీబీ నుంచి మాత్రం 6 రేటింగ్ సంపాదించుకుని యావరేజ్ హిట్‌గా నిలిచింది పురుషః సినిమా.
హీరోగా పవన్ కళ్యాణ్ బత్తుల
కావాల్సినంత కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ‘పురుషః’ సినిమాతో బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి, వెన్నెల కిషోర్ పాత్రలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయన్న సంగతి తెలిసిందే.
ముగ్గురు హీరోయిన్లకు మంచి క్రేజ్
రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ల పాత్రలు సైతం ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోయిన్లకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందన దక్కించుకున్న తర్వాత రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చేసింది.
2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
అది కూడా రెండింట్లో పురుషః ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో పురుషః ఓటీటీ రిలీజ్ అయింది. అంతేకాకుండా స్ట్రీమింగ్ అయిన కొన్ని రోజులకే పురుషః ఓటీటీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అలా అన్ని చోట్లా ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉండటంతో ఓటీటీలోనూ ఈ సినిమాకి విశేషణమైన ఆదరణ లభిస్తోంది.
రెండింటిల్లో ఓటీటీ ట్రెండింగ్
అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి 2 ఓటీటీల్లో టాప్ ప్లేసులో పురుషః ట్రెండింగ్ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక పురుషః కథ విషయానికొస్తే హీరోలు ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరినొకరు విడిచి ఉండలేరు. అలాంటి వీరి జీవితాల్లోకి ముగ్గురు హీరోయిన్లు భార్యలుగా వస్తారు.
పురుషః కథ
పెళ్లి తర్వాత గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్) నుంచి విడాకులు కావాలని భార్యలు కమల (రాయంచ), లక్ష్మి (హాసిని), గీత (విషిక) కోర్టుకెక్కుతారు. కానీ, విచారణకు మాత్రం రారు. దాంతో జడ్జ్ అసలు గొడవకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు.
అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహా ఓటీటీల్లో
ఆ తర్వాత ఏమైందీ? ఈ ముగ్గురుని భార్యలు విడాకులు కోరడానికి గల పరిణామాలు ఏంటీ? భర్తల గురించి భార్యలకు తెలిసిన నిజాలు ఏంటీ? అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో కామెడీ, డ్రామాగా పురుషః సినిమాను రూపుదిద్దారు. ఇలాంటి పురుషః సినిమాను అమెజాన్ ప్రైమ్, ఆహా 2 ఓటీటీల్లో ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


