Amazon Prime OTT: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్ సీజన్ 3- ఫాంటసీ ఎలిమెంట్స్, మాట్లాడే రాక్షస పాత్ర- తెలుగులో!

Rings Of Power Season 3 OTT Streaming Teaser Release: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎదురుచూస్తున్న 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' సీజన్ 3 టీజర్‌ను అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. శాన్ డియాగో కామిక్-కాన్ 2026 వేదికగా ఈ ఓటీటీ సిరీస్ స్ట్రీమింగ్ తేదీతో పాటు కీలక వివరాలను ప్రకటించారు.

Published on: Jul 25, 2026, 15:56:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rings Of Power Season 3 OTT Release Teaser Out: ఫాంటసీ వెబ్ సిరీస్‌ల ప్రేమికులకు అమెజాన్ ప్రైమ్ వీడియో మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ అందించింది. హాలీవుడ్ ప్రముఖ ఈవెంట్ 'శాన్ డియాగో కామిక్-కాన్ 2026'లో హాల్-హెచ్ వేదికగా 6,500 మందికి పైగా అభిమానుల సమక్షంలో 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' (The Lord of the Rings: The Rings of Power) సీజన్ 3 టీజర్‌ను అత్యంత వేడుకగా ఆవిష్కరించారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్ సీజన్ 3- ఫాంటసీ ఎలిమెంట్స్, మాట్లాడే రాక్షస పాత్ర- తెలుగులో!
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్ సీజన్ 3- ఫాంటసీ ఎలిమెంట్స్, మాట్లాడే రాక్షస పాత్ర- తెలుగులో!

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఈ ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్ నవంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గత రెండు సీజన్ల కంటే ఈ మూడో సీజన్ అత్యంత భయంకరంగా, ఆసక్తికరంగా సాగనుందని మేకర్స్ జె.డి.పేన్, ప్యాట్రిక్ మెక్‌కే స్పష్టం చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో రూపుదిద్దుకున్న 99 సెకన్ల ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

సౌరాన్ 'వన్‌ రింగ్' తయారీ.. టీజర్‌లో మైండ్ బ్లాకింగ్ విజువల్స్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 టీజర్ ప్రారంభంలోనే బూడిదతో నిండిన మోర్డోర్ ప్రాంతం, మెరుపుల మధ్య నిలబడిన బారద్-దూర్ కోట కనిపిస్తాయి. "ఇప్పుడు ఆ శక్తివంతమైన గడియ ఆసన్నమైంది" అని విలన్ సౌరాన్ (చార్లీ వికెర్స్) చెప్పే ఉత్కంఠభరిత సంభాషణతో టీజర్ ముగింపు వరకు ఆకట్టుకుంటుంది.

ఓటీటీ సిరీస్‌లోనే అత్యంత కీలకమైన ఘట్టం సౌరాన్ సొంతంగా 'వన్‌ రింగ్' (One Ring) ను తయారుచేసే సన్నివేశం. కరిగిన బంగారంతో ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు రెండు వారాల పాటు చిత్రీకరణ జరిపినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నానని నటుడు చార్లీ వికెర్స్ తెలిపారు.

ఐదేళ్ల తర్వాత కథ.. మిడిల్ ఎర్త్‌లో నరకసదృశ్య యుద్ధం

ఈ మూడో సీజన్ కథ ఇరేజియాన్ నాశనమైన ఐదేళ్ల తర్వాత నుంచి మొదలవుతుంది. సౌరాన్ సైన్యాలు మిడిల్ ఎర్త్ లోని చాలా ప్రాంతాలను ఆక్రమించేస్తాయి. ఖజాద్-దుమ్ లోని మౌంటెన్ హాల్స్, త్రీ రింగ్స్ రక్షణలో ఉన్న లిండన్, రివెండెల్ ప్రాంతాలు మాత్రమే ప్రస్తుతం సౌరాన్ కు ఎదురునిలుస్తున్నాయి.

"ఈ కొత్త సీజన్ మరింత చీకటిగా, అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోంది. ఇక్కడ ఎవరికీ రక్షణ లేదు" అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్యాట్రిక్ మెక్‌కే చెప్పారు.

సౌరాన్ అంతిమ లక్ష్యాన్ని అడ్డుకోవడానికి ఎల్ఫ్‌లు, డ్వార్ఫ్‌లు, మానవులు, విజార్డ్‌లు అందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని టీజర్ స్పష్టం చేస్తోంది.

కొత్త పాత్రల ఎంట్రీ.. బాల్‌రాగ్‌కు సైమన్ పెగ్ స్వరం

మూడో సీజన్‌లో కొన్ని కొత్త పాత్రలు కథలోకి అడుగుపెడుతున్నాయి. గలాడ్రియెల్ (మోర్ఫిడ్ క్లార్క్) తన భర్త సెలెబోర్న్ (జేమీ క్యాంప్‌బెల్ బావర్) ను కలుసుకోవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు స్ట్రేంజర్ పాత్ర పోషిస్తున్న డానియల్ వేమాన్ తాను గ్యాండాల్ఫ్ అనే నిజాన్ని అంగీకరించి నాయకత్వ బాధ్యతలు చేపడతారు.

ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చరిత్రలోనే మొదటిసారిగా బాల్‌రాగ్ (Balrog) రాక్షస పాత్ర మాట్లాడనుంది. ఈ పాత్రకు ప్రముఖ నటుడు సైమన్ పెగ్ డబ్బింగ్ చెప్పారు. వీటితో పాటు మోర్డోర్ దళాలకు చెందిన భయంకరమైన 'నాజ్గ్నాగోల్' ప్రాణుల ఎంట్రీ ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది.

నవంబర్ 11న గ్రాండ్ స్ట్రీమింగ్

'ది రింగ్స్ ఆఫ్ పవర్' సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 11 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తొలి రోజు ఒకేసారి నాలుగు ఎపిసోడ్‌లను ఓటీటీ రిలీజ్ చేస్తూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

నవంబర్ 25న చివరి 2 ఎపిసోడ్స్

ఆ తర్వాత నవంబర్ 18న 5, 6 ఎపిసోడ్‌లు, నవంబర్ 25న చివరి రెండు ఎపిసోడ్‌లతో ఈ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 ముగియనుంది.

తెలుగులో కూడా

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాంటసీ లవర్స్‌ను ఈ ఓటీటీ సిరీస్ సరికొత్త అనుభూతికి గురిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ 3 ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉండనుందని సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More